
చెన్నై సినిమా: 'పన్నికుట్టి' చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. కొత్త దర్శకుడు అను చరణ్ తెరకెక్కించిన చిత్రం ఇది. ఇందులో కమెడియన్ యోగిబాబు, కరుణాకరన్ ప్రధాన పాత్రలు పోషించారు. సమీర్ భరత్ రామ్ నిర్మించిన ఈ చిత్రం విడుదల హక్కులను లైకా ప్రొడక్షన్ పొంది శుక్రవారం (జులై 8) విడుదల చేసింది. వినోదం మేళవించిన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది.
యోగిబాబు కామెడీ పంచ్ డైలాగ్స్‌కు ప్రేక్షకుల కడుపుబ్బ నవ్వుకుంటున్నారు. నటుడు కరుణాకరన్ నటన ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పందిపిల్ల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రంలో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. కుటుంబ సమస్యలతో సతమతమయ్యే కరుణాకరన్ వాటి నుంచి బయటపడేందుకు ఒక స్వామిజీని ఆశ్రయిస్తాడు. ఆయన ఏం చేశాడు? కరుణాకరన్ సమస్యల నుంచి బయటపడ్డాడా? అంశాలకు దర్శకుడు హాస్యాన్ని జోడించి చిత్రాన్ని జనరంజకంగా తీర్చి దిద్దారు. నమ్మకమే జీవితం అనే చక్కని సందేశంతో కూడిన ఈ చిత్రం థియేటర్లలో వినోదాలు విందులో సందడి చేస్తోంది.
చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా!
నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్
నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్
Comments
Please login to add a commentAdd a comment