
నిర్మలమ్మ అసలు పేరు రాజమణి

పుట్టింది 1926, జూలై 18న గంగయ్య, కోటమ్మ దంపుతులకు బందర్లో తొమ్మిదో సంతానంగా పుట్టింది.

ఊహ తెలిసినప్పటి నుండి నాటకాలంటే పిచ్చి

మూడో తరగతిలోనే చదువు ఆపేసి నాటకాలు చూస్తూ కాలం గడిపేస్తుంటే ఊర్లో పరువుతీస్తుందని బంధువులంతా తిట్టేవారట.

సతీ సక్కుబాయి నాటిక గన్నవరంలో మొట్ట మొదట వేసినప్పుడు నిర్మలమ్మకు 14 ఏళ్ళు

కె.విశ్వనాధ్ దర్శకత్వం వహించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘శంకరాభరణం’లో వైవిధ్యమైన పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

1943లో తన పదహారేళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది నిర్మలమ్మ

1961లో ‘కృష్ణప్రేమ’ అనే చిత్రంలో నిర్మలమ్మ రుక్మిణి పాత్రని దక్కించుకుంది నిర్మలమ్మ

సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించి రికార్డ్ సృష్టించింది నిర్మలమ్మ

ఈమె యుక్త వయసులో చాలా అందంగా ఉండేది

దర్శకనిర్మాతలు ఈమె డేట్స్ కోసం క్యూలో ఎదురుచూసిన సందర్భాలు కూడా ఉన్నాయి

హీరోయిన్లతో సమానంగా పారితోషికం అందుకున్న రోజులు కూడా ఉన్నాయి












































