rare photos
-
ఎవర్గ్రీన్ స్టైలిష్ స్టార్.. తలైవా రజినీని ఇలా ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)
-
Sara Ali Khan: బాలీవుడ్ భామ సారా అలీఖాన్ బర్త్‌డే స్పెషల్.. రేర్ ఫోటోలు
-
నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్ బర్త్‌డే స్పెషల్.. రేర్ ఫొటోలు
-
అసలైన లేడీ సూపర్‌స్టార్.. విజయశాంతి బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
Ajith Unseen Photos: హీరోలందు తలా అజిత్ వేరయా.. రేర్ ఫొటోలు
-
Eesha Rebba: ఈ అమ్మ కూచి.. ఇపుడు యూత్ కలల రాణి.. గుర్తుపట్టారా (ఫొటోలు)
-
టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ బర్త్‌డే.. అరుదైన ఫొటోలు
-
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రేర్ పిక్స్..
-
ఇండస్ట్రీకి 'అవసరాల' బుల్లోడి అరుదైన ఫోటోలు..
-
అలనాటి అందాల తార.. అరుదైన ఫోటోలు
-
Senior NTR Unseen And Rare Photos : అన్న గుండె ఆగిన రోజు (ఫొటోలు)
-
50వ వసంతంలోకి అడుగుపెడుతోన్న కండలవీరుడు హృతిక్ రోషన్
-
Deepika Padukone Unseen Photos: స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె బర్త్‌డే స్పెషల్.. ఈ రేర్ ఫొటోలు చూశారా?
-
Birthday Special: అందాల ముద్దుగుమ్మ సోనాలి బింద్రే బర్త్ డే స్పెషల్.. రేర్ పిక్స్ (ఫొటోలు)
-
హీరో నాగచైతన్య బర్త్ డే స్సెషల్ (ఫోటోలు)
-
Aishwarya Rai Birthday : నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ 50వ పుట్టినరోజు.. ప్రత్యేకమైన ఫోటోలు
-
Parineeti Chopra: ట్రెండింగ్‌లో బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా రేర్ ఫోటోలు
-
సులభ్ ఫౌండర్ బిందేశ్వర్ పాఠక్ అరుదైన ఫోటోలు
-
Actress Soundarya Unseen Photos: తెలుగు తెరకు సిసలైన సౌందర్యం (ఫొటోలు)
-
1983 World Cup: ఆ అపురూప విజయానికి 40 ఏళ్లు
-
మోహన్‌బాబు రేర్ ఫోటోస్.. కలెక్షన్ కింగ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా (ఫోటో గ్యాలరీ -1)
-
డైరెక్టర్ సుకుమార్- తబితల వివాహబంధానికి 14 ఏళ్లు, అరుదైన ఫోటోలు
-
హాలీవుడ్ నటుడు జానీ డెప్ అరుదైన ఫోటోలు
-
ప్రేక్షకులను ఉర్రూతలూగించిన తెలుగింటి బామ్మ.. నిర్మలమ్మ అరుదైన చిత్రాలు
-
దర్శకధీరుడు రాజమౌళిని ఎప్పుడూ ఇలా చూసి ఉండరు! (ఫోటోలు)
-
ప్రముఖ నటుడు శరత్ బాబు అరుదైన ఫోటోలు
-
Chiranjeevi Photos: మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ఫోటోస్
-
Director K Viswanath Photos: కళాతపస్వి కే. విశ్వనాథ్ ఫొటోగ్యాలరీ
-
Kaikala Satyanarayana: నవరస నటనా సార్వభౌముడి అరుదైన (ఫొటోలు)
-
మోహన్ బాబు అరుదైన ఫోటోలు మీ కోసం...
-
రెబల్ స్టార్ కృష్ణంరాజు అరుదైన (ఫొటోలు)
-
YSR Jayanthi 2022 : మరపురాని మహానేత.. వైఎస్సార్ అరుదైన ఫొటోలు
-
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అరుదైన ఫోటోలు
-
గాన కోకిల లతా మంగేష్కర్ అరుదైన ఫోటోలు
-
‘వందేమాతరం’.. స్వాతంత్య్ర సంగ్రామపు అరుదైన ఫొటోలు
Independence Day 2021: రెండు వందల ఏళ్లకు పైగా పరాయి పాలనలో మగ్గిన, అణచివేతకు గురైన భారత్.. తొంభై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో స్వాతంత్య్రం సాధించుకుంది. మహా మహా నాయకుల సారధ్యంలో ప్రజా పోరాటం.. ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛను పొందింది. ఆ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే 75వ స్వాతంత్య్ర దినోత్సవం 75th Independence Dayసందర్భంగా ఆ మహా సంగ్రామం తాలుకా చిత్రాలు కొన్ని మచ్చుకు మీ కోసం.. ►1857 సిపాయిల తిరుగుబాటును స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టంగా అభివర్ణిస్తుంటారు చరిత్రకారులు. ఆ పోరాటంలో ఓడినప్పటికీ.. ఆంగ్లేయులకు మాత్రం మన తొలి దెబ్బ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. కావ్న్పోర్(కాన్పూర్) దగ్గర 1858లో జరిగిన పోరాటానికి సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం ఇది. ►స్వరాజ్య లక్క్ష్యంతో మహాత్మా గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమం హింసాత్మకంగా మారింది. 1922 ఫిబ్రవరి 4న ఉద్యమకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చౌరీ చౌరా పోలీస్ స్టేషన్‌కు నిప్పటించి.. 20 మందికిపైగా పోలీసాఫీసర్లను సజీవంగా దహనం చేశారు. ►1930 ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా.. దండి మార్చ్‌లో పాల్గొన్న గాంధీ, పక్కన సరోజినీ నాయుడు ►విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో భాగంగా.. వస్తువులతో వస్తున్న ఎడ్ల బండికి అడ్డుగా పడుకుని శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారుడు ►క్విట్ ఇండియా ఉద్యమం.. సైమన్ గో బ్యాక్ నినాదంతో ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ►గాంధీ, కాంగ్రెస్ నేతల అరెస్ట్‌కు నిరసనగా చేపట్టిన ప్రదర్శనలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బ్రిటిష్ సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగం ►ఫిబ్రవరి 20, 1947న స్వాతంత్య్ర ప్రకటన చేసిన బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ► సంబురంగా ప్రజల మధ్య శాంతి కపోతాన్ని ఎగరేసిన నెహ్రూ ►ఎర్రకోట సంబురాల్లో ప్రధాని హోదాలో నెహ్రూ ►ఆగష్టు 16, 1947.. ఎర్రకోట నుంచి రెపరెపలాడుతూ కనిపించిన మువ్వన్నెల జెండా ►దేశ విభజన తర్వాత సెప్టెంబర్, 1947లో భారత్ నుంచి పాక్‌కు పయనమైన వందలాది మంది -
వైఎస్సార్ అరుదైన చిత్రాలు.. స్పెషల్ వీడియో
-
అమ్మ ఒడిలోని ఈ చిన్నారి ఎవరో తెలుసా?
కొత్తగా ఆలోచించడం అందరికి సాధ్యం కాకపోవచ్చు. కానీ, కొత్త ఆలోచనలతో అనుకున్నది సాధించడం కొందరికే సాధ్యం. ఆ కొందరిలో ఒక్కడే ఎలన్ మస్క్. వింత ఆలోచనల పుట్ట, మొండి మేధావి, ముక్కుసూటి మనిషిగా పేరున్న ఎలన్ మస్క్ 50వ పుట్టినరోజు ఇవాళ. పైన అమ్మ ఒడిలో ఒదిగిన ఆ చిన్నారి కూడా ఎలన్ మస్కే. వెబ్‌డెస్క్: ఎలన్ మస్క్ కన్నతల్లి మయే మస్క్ ఆ ఫొటోను షేర్ చేసింది. కొడుక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. యాభై ఏళ్ల క్రితం అదొక అద్భుతమైన రోజని, తనలో సంతోషాన్ని నింపాడని చెబుతూ.. ప్రేమగా ట్విటర్లో పోస్ట్ చేసిందామె. పైగా ట్విటర్లో ట్రెండ్ అవుతున్న #HappyBirthdayElonMusk ట్యాగ్‌ను సైతం జత చేసింది. తల్లి పంచిన గుర్తుకు.. సింపుల్‌గా హార్ట్ సింబల్‌తో బదులిచ్చాడు మస్క్. పోయినవారం ఆమె మస్క్, అతని సోదరుడితో ఉన్న ఫొటోని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు మస్క్ చిన్నప్పటి ఫొటోను షేర్ చేయగా.. ఆయన అభిమానులు మురిసిపోయారు. Happy birthday @elonmusk 🎂🎉 Thank you for this wonderful day 50 years ago. You have brought me great joy. Lots of love ❤️❤️❤️ #HappyBirthdayElonMusk now trending 🙌🙏 pic.twitter.com/xro3QwQD1z — Maye Musk (@mayemusk) June 28, 2021 పన్నెండేళ్లకే.. టెస్లా, స్పేస్ ఎక్స్, ది బోరింగ్ కంపెనీలకు హెడ్‌గా న్యూరాలింక్ లాంటి అరుదైన ప్రయోగాలతో ప్రపంచానికి పరిచయమైన మేధావి ఎలన్ మస్క్. ఒక్క ట్వీట్‌తో కోట్లకు కోట్లకు ముంచెత్తడం, అదే టైంలో ఒకే ట్వీట్‌తో సంపాదించడం అతనికి తేలికైన పని. అంతేకాదు బిట్‌కాయిన్ తలరాతను డిసైడ్ చేస్తూ.. డిజిటల్ కరెన్సీ మార్కెట్‌ను శాసిస్తుంటాడు కూడా. 1971, జూన్ 28న ప్రిటోరియా (దక్షిణాఫ్రికా)లో పుట్టాడు ఎలన్ మస్క్. తండ్రి ఎర్రోల్ ఇంజినీర్. తల్లి మయే మస్క్ మోడల్. వ్యక్తిగత విభేధాలతో మస్క్‌కి తొమ్మిదేళ్లున్నప్పుడు విడిపోయారు. ఆ తర్వాత తండ్రి దగ్గరే పెరిగాడు మస్క్(తాను జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు తండ్రి దగ్గర ఉండడమే అని ఎందుకనో తరచూ చెప్తుంటాడు మస్క్). పన్నెండేళ్లకే వీడియో గేమ్‌ను తయారు చేసిన మస్క్.. దక్షిణాఫ్రికాలో ఉంటే సైన్యంలో చేరాల్సి వస్తుందన్న భయంతో కెనడాలోని తల్లి దగ్గరకు వెళ్లాడు. ఆ తర్వాత ఒంటారియో క్వీన్స్ యూనివర్సిటీ, పెన్సిల్వేనియా యూనివర్సిటీల నుంచి నుంచి బ్యాచ్‌లర్ ఆఫ్ సైన్స్, ఆర్ట్స్ కోర్సులు పూర్తి చేసుకుని.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ కోసం ప్రయత్నించాడు. కానీ, రెండో రోజుకే దానిని వదిలేశాడు. నెట్‌స్కేప్‌లో ఉద్యోగాన్ని వదులుకుని సోదరుడితో కలిసి జిప్2 అనే వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించాడు. అది అతన్ని మిలియనీర్‌ను చేసింది. ఆపై బ్యాంకింగ్ సర్వీస్ సంస్థను పేపాల్‌కు అమ్మేసి.. ఏకంగా దానికి సీఈవో అయ్యాడు. ఆకాశంలో ఆలోచనలు మస్క్ ఆలోచనలన్నీ కొత్తగానే ఉంటాయి. అందుకే తిక్క మేధావి అని ఆప్యాయంగా పిలుచుకుంటారు అతని అభిమానులు. బ్యాంకింగ్ సర్వీస్, స్పేస్ ట్రావెల్ కంపెనీ, ఎలక్రి్టకల్ వెహికిల్స్, అండర్‌గ్రౌండ్ టన్నెల్స్, జంతువుల తలలో చిప్‌లతో కంట్రోల్ చేయడం.. ఇలాంటి పనులు అతని క్రేజ్‌ను మరింత పెంచాయి. మార్స్‌పై మొక్కలు పెంచాలన్న ఆలోచన నుంచి.. మస్క్ బుర్రలో స్పేస్ ఎక్స్ ఆలోచనకు బీజం పడింది. స్పేస్ టెక్నాలజీ కోసం అమెరికా సాయం కాకుండా.. రష్యా సాయం తీసుకోవాలని ప్రయత్నించి ఘోరంగా అవమాన పడ్డాడు. కలల సామ్రాజ్యం స్పేస్ ఎక్స్ సంస్థ అందుకు ప్రతీకారంగానే స్పేస్ ఎక్స్‌ను స్థాపించి.. 2008లో ఫాల్కన్ లాంఛ్ ద్వారా స్పేస్ఎక్స్ తొలి సక్సెస్ చవిచూశాడు. రాబోయే రోజుల్లో ఎలక్రి్టక్ వెహికిల్స్‌కే భవిష్యత్తు ఉంటుందని నమ్మి.. 2004లో టెస్లాను లీడ్ చేయడం ప్రారంభించాడు. అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ద్వారా రవాణా, అత్యంత వేగంగా ప్రయాణం, డ్రైవర్‌లెస్ కార్లు, గాల్లో ఎగిరే కార్లు, ఇక జంతువుల బ్రెయిన్లలో చిప్‌లు జొప్పించి.. ప్రయోగాలు. ఇలా మస్క్ మైండ్‌లో ఉండే ఆలోచనలు ఒక్కొక్కటి కార్యరూపం దాలుస్తూ వస్తున్నాయి. టెస్లా సీఈవో హోదాలో.. విమర్శలు.. వివాదాలు బహిరంగంగానే గంజాయి పీల్చే ఎలన్ మస్క్‌కు విమర్శలు, వివాదాలు కొత్తేంకాదు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు. పరువు నష్టం దావాల కింద మూల్యం చెల్లించుకున్నాడు. ఒకానొక టైంలో సొంత కంపెనీలపై సెటైరిక్ ట్వీట్లు వేసి.. ఊహించలేని నష్టాన్ని తెస్తుంటాడు. అయినప్పటికీ కంపెనీని సమర్థవంతంగా నడిపిస్తుండడం, జనాల్లో అతనికి ఉన్న క్రేజ్, మేజర్ వాటా తదితర కారణాల వల్ల అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. పెళ్లిళ్లు.. డేటింగ్లు మస్క్ వ్యక్తిగత జీవితం కూడా ఆగం ఆగమే. గతంలో పలువురితో డేటింగ్ చేసిన మస్క్.. కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లకు ఆమెకు విడాకులిచ్చి.. బ్రిటిష్ నటి టలులాహ్ రిలేను వివాహం చేసుకున్నాడు. 2012లో రిలేకు విడాకులిచ్చి. ఆ మరుసటి ఏడాది మళ్లీ పెళ్లి చేసుకోవడం విశేషం. చివరికి 2016 రిలేకు విడాకులిచ్చేసి సెలబ్రిటీలతో డేటింగ్ చేశాడు. 2018 నుంచి కెనెడియన్ సింగర్ గ్రిమ్స్‌తో డేటింగ్లో ఉన్నాడు మస్క్. పుట్టిన కొడుక్కి కూడా అర్థంకానీ రితీలో X AE A-XII అనే విచిత్రమైన పేరు పెట్టుకున్నాడు. సింగర్ గ్రిమ్స్‌తో ఓ ఈవెంట్లో.. ఇక మస్క్ డేటింగ్ లిస్ట్చాలా పెద్దదే. అందులో హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ కూడా ఉంది. మస్క్ వెండి, బుల్లితెరలపైనా సందడి చేశాడు. ఐరన్ మ్యాన్ 2, వై హిమ్, మెన్ ఇన్ బ్లాక్:ఇంటర్నేషనల్‌తో పాటు ది సింప్సన్, ది బిగ్‌బ్యాంగ్ థియరీ, సౌత్‌పార్క్, రిక్ అండ్ మోర్టీ, శాటర్డే నైట్ లైవ్ లాంటి టీవీ కార్యక్రమాలతోనూ రేసింగ్ ఎక్స్టింగ్షన్, వెన్నెర్ హెర్గోజ్ లాంటి డాక్యుమెంటరీలతోనూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎలన్ మస్క్ ఆస్తుల విలువ సుమారు 165 బిలియన్ల డాలర్లుగా అంచనా. ఐరన్‌మ్యాన్ 2 సినిమాలో ఓ సీన్లో.. కన్నతల్లితో మయేతో ఎలన్ ఎలన్ మస్క్.. ఇంజినీర్ మేధావా? లేక సైంటిస్టా లేదంటే కాల జ్ఞానినా? ఇలాంటి డౌట్లు చాలామందికే ఉన్నాయి. కానీ, ఇప్పటివరకైతే కృత్రిమ మేధస్సునే నమ్ముకున్న మొండి మేధావి అని మాత్రం చెప్పొచ్చు. చదవండి: మస్క్ చిలిపితనం.. పోర్న్ కాయిన్లకు మహర్దశ -
విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఫోటోలు
-
అక్కినేని నాగార్జున స్పెషల్ ఫోటోలు
-
కైకాల సత్యనారాయణ బర్త్‌డే స్పెషల్ రేర్ ఫోటోలు
-
పీవీ శతజయంతి: స్పెషల్ ఫోటోలు
-
లేడీ సూపర్‌స్టార్ బర్త్‌డే స్పెషల్: రేర్ పిక్స్
-
వీరంతా మూడో లింగం అట!
సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ పసిఫిక్ దీవుల సముదాయంలో భాగంగా ఉన్న పొలినేసియన్ దీవి ‘తహితీ’. ఆ దీవిలో ప్రాచీన ఆధ్యాత్మిక ‘మహు’ జాతి మనుషులు ఇప్పటికీ నివసిస్తున్నారు. వారు తమ శరీరాలకు ముదురు నీలం, ముదురు గులాబీ, చిక్కటి పసుపు రంగులు వేసుకొని మెడలో, జుట్టుపై ఆకులు, పూలతో కూడిన దండలు ధరిస్తారు. సముద్రపు ఒడ్డున దొరికే గవ్వలు, కౌశిప్పులు, చిప్పలను కూడా దండలుగా ధరిస్తారు. మొల చుట్టూ ఆకర్షణీయమైన డిజైన్ రంగుల గుడ్డలు ఆడవాళ్ల మాదిరిగా ధరిస్తారు. అయితే వారు ఆడవారు కాదు, మగవారు కాదు. మూడవ లింగం అన్న మాట. ఆ ప్రాంతంలో జరిగే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు. డ్యాన్సులు కూడా చేస్తారు. వారిని దైవ సమానులుగా ఇతర జాతి ప్రజలు వారిని పూజిస్తారు. వాస్తవానికి వారు ‘మహు’ జాతిలో మగవారిగానే పుడతారు. ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులు దాచేసి, మూడవ లింగమంటూ ఈ విచిత్ర వేషధారణను చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారు. ఇక వారి జీవనాధారం. ఆ వేషధారణే. వారికి కావాల్సిన ఆహారాన్ని అన్ని జాతుల ప్రజలు సమకూర్చి పెడతారు. వారు ఇళ్ల వద్ద పెద్దలు, పిల్లల సంరక్షణ బాధ్యతలను చిత్తశుద్ధితో చూసుకుంటారు. స్విస్–గినియన్ ఫొటోగ్రాఫర్ లమ్సా లియూబా ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వారి ఫొటోలను తీశారు. ఫొటోల కోసం వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఒక్కొక్కరితో గంటలపాటు మాట్లాడితేగానీ ఫొటోల కోసం వారు ఒప్పుకోలేదని ఆమె తెలిపారు. స్విడ్జర్లాండ్‌లో జరిగే ఫొటో ఎగ్జిబిషన్లో ‘ఇల్యూషన్’ పేరిట వీటిని ప్రదర్శిస్తానని ఆమె చెప్పారు. -
గుర్తుపట్టండి చూద్దాం!
లండన్: అర్థమైతే ఆర్టు.. అర్థం కాకపోతే మోడ్రన్ ఆర్టు అన్నాడు వెనకటికొకడు.. అయితే, ఇది ఆర్టు కాదు.. మోడ్రన్ ఆర్టు అంతకన్నా కాదు.. ఇది బీకాం ఫిజిక్స్ టైపు.. ఆర్ట్‌లో సైన్సన్నమాట. చూడ్డానికి ప్రముఖ చిత్రకారుడి బ్రష్ స్ట్రోక్స్లాగ ఉన్నాయి కానీ.. నిజానికిది ఎలుకలోని రక్త కణాలను చుట్టుముట్టి ఉన్న మృదువైన కండర కణజాలం. ‘రిఫ్లెక్షన్స్ ఆఫ్ రీసెర్చ్’ పేరిట బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ ఏటా ఈ సైన్స్ ఇమేజ్ పోటీలను నిర్వహిస్తోంది. ఎంఆర్ఐ స్కాన్స్, మైక్రో స్కోప్‌లు వంటి వైద్య ఉపకరణాలను ఉపయోగించి తీసిన చిత్రాలివి. ఈ పోటీలో ‘కణసాగరం’ పేరిట కేంబ్రిడ్జి వర్సిటీలోని పీహెచ్డీ విద్యార్థి లోనా కత్బర్ట్సన్ సమర్పించిన ఈ ఎంట్రీ ఓవరాల్ విన్నర్‌గా నిలిచింది. అభివృద్ధి చెందుతున్న ఎలుక పిండంలో గుండె ఇమేజ్ రన్నరప్‌గా నిలిచింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి డాక్టర్ రిచర్డ్ టైసర్ ఈ ఫొటో తీశారు. ఆరంభ దశలో గుండె కణాలు ఎరుపు రంగులో ఉన్నాయి. గుండె అర్ధచంద్రాకారంలో ఉంచి కొట్టుకోవడం మొదలుపెట్టింది. -
కోడి రామకృష్ణ అపూర్వ చిత్రాలు
-
శ్రీవారి అపురూపమైన ఫొటోలను పంపించండి
సాక్షి, తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే అపురూపమైన పాత చిత్రాలు ఉంటే ఈనెల 7వ తేదీలోగా తమకు పంపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఏటా తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద ‘నాడు–నేడు’ పేరిట ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం, తిరుపతిలోని ఆలయాలు, ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలకు సంబంధించిన అపురూపమైన పాత ఫొటోలను ‘ప్రజాసంబంధాల అధికారి (పీఆర్ఓ), టీటీడీ పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి –517520’ చిరునామాకు పంపించాలని టీటీడీ కోరింది. మరిన్ని వివరాలకు 0877–2264217 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది. కాగా, ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఫొటోల ప్రదర్శన నిర్వహించనుంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో నిత్య పూజల సందర్భంగా వినియోగించే పాత్రలు, పూజా ద్రవ్యాలు, ప్రత్యేక పర్వదినాలు, ఇతర ఉత్సవాల దినాల్లో పూజలు అందుకునే ఉత్సవమూర్తుల ఫొటోలతో విడివిడిగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు. 80 ఏళ్లనాటి శ్రీవారి ఆలయ చరిత్రను కళ్లకు కట్టే అరుదైన ఫొటోలను కూడా ప్రదర్శనలో ఉంచుతారు. 1950వ సంవత్సరానికి ముందు, ఆ తరువాత శ్రీవారి సేవలో పాల్గొన్న రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్వామీజీలు, ఇతర ప్రముఖుల ఫొటోలను కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేయనున్నారు. -
నందమూరి హరికృష్ణ అరుదైన ఫోటో గ్యాలరీ
-
9/11 అరుదైన ఫొటోలు.. మీరు చూశారా?
-
9/11 అరుదైన ఫొటోలు.. మీరు చూశారా?
అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద అల్ కాయిదా దాడి జరిగి ఇప్పటికి దాదాపు 16 ఏళ్లయింది. 2001 సెప్టెంబర్ 11వ తేదీన అల్ కాయిదా ఉగ్రవాదులు విమానాలను హైజాక్ చేసి, వాటితో ట్విన్ టవర్స్‌ను ఢీకొన్న ఈ ఘటనతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. పెంటగాన్ ప్రధాన కార్యాలయం కూడా దారుణంగా దెబ్బతిన్న ఈ ఘటనకు సంబంధించి, ఇప్పటివరకు ఎవరూ చూడని కొన్ని అరుదైన ఫొటోలను ఎఫ్‌బీఐ విడుదల చేసింది. మొట్టమొదటిసారిగా ఈ ప్రమాదాన్ని చూసినవాళ్లు ఎలా స్పందించారు, నష్టం ఎలా సంభవించిందనే విషయాలను ఈ ఫొటోలు స్పష్టంగా చూపిస్తున్నాయి. కుప్పకూలిపోయిన గోడలు, చెలరేగుతున్న మంటలు, విమాన శకలాలు.. ఇలా రకరకాల ఫొటోలు కూడా వ ఈటిలో ఉన్నాయి. అల్ కాయిదా మొత్తం నాలుగు విమానాలను హైజాక్ చేసి, ఈ దాడులకు ఉపయోగించింది. పెంటగాన్‌ను ఒకటి ఢీకొనగా, మరో రెండింటిని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడికి ఉపయోగించారు. నాలుగో విమానంలో ప్రయాణికులు హైజాకర్ల మీద తిరగబడగా.. వాళ్లు దాన్ని పెన్సల్వేనియా సమీపంలో ఒక పొలంలో కూల్చేశారు. కొన్ని ఫొటోలలో గ్యాస్ మాస్కులు ధరించిన గార్డులు ఒక కుక్క పిల్లను శిథిలాల నుంచి రక్షించారు. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది మరణించారు. ఎక్కువమంది వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన దాడిలోనే ప్రాణాలు కోల్పోయారు. -
ఇందిర అరుదైన ఫొటోలు చూడాలని ఉందా..!
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ.. భారత రాజకీయాల్లోనే ఆమె తిరుగులేని ముద్ర వేసిన నాయకురాలు. దేశం మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని కనుసన్నల్లో మెదిలేలా చేసిన శక్తిమంతమైన మహిళ. వైఫల్యాలు, స్వార్థపూరిత చర్యలు అనే విమర్శలను పక్కనపెడితే.. ఇప్పటికీ భారత రాజకీయాల అధ్యయనం ఆమె ప్రస్తావన లేకుండా చేయడం సాధ్యంకాని పని. ప్రధానిగా చెరగని ముద్ర వేసుకున్న ఇందిరాగాంధీ.. ఇప్పటికీ గ్రామాల్లోని ప్రతి ఒక్కరు ఆమె తమకు బాగా కావాల్సినవారు అన్నట్లుగా మాట్లాడతారంటే ఆశ్చర్యపోక తప్పదు కూడా. అంతగా సుపరిచితురాలైన ఆమె ఆహార్యం, దర్పం, హుందాతనం, ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ ఒక ప్రత్యేకతను చాటుకుంది. అలాంటి ఇందిరాగాంధీకి సంబంధించిన అరుదైన ఛాయ చిత్రాలు ఇప్పుడు దర్శనం ఇస్తున్నాయి. యుక్త వయసులోవి, భర్త ఫీరోజ్ గాంధీతో పెళ్లినాటివి, కశ్మీర్ లో హనీమూన్ సందర్భంలోనివి, రాజీవ్‌ను ఒడిలోపెట్టుకొని నెహ్రూతో దిగిన సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే చిత్రాలు ప్రదర్శనకు ఉంచారు. మొత్తం 220 ఆనాటి ఇందిర ఫొటోల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే సేకరించారు. వీటన్నింటిని అలహా బాద్‌లో ఎగ్జిబిషన్‌కు ఏర్పాటు చేయగా సోనియా కూతురు ప్రియాంక గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోనియా, రాహుల్, ప్రియాంక ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. (మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అరుదైన చిత్రాల ఎగ్జిబిషన్ ను ప్రారంభించి తిలకిస్తున్న ప్రియాంకా గాంధీ) (మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అరుదైన చిత్రాలు వీక్షిస్తున్న సోనియా గాంధీ) (మహాత్మాగాంధీ చితాభస్మాన్ని రైలులో తీసుకెళుతూ ఇందిర) (ముగ్గురు ప్రధానులు నెహ్రూ, ఇందిర, రాజీవ్(ఒడిలోని బాలుడు) (తన కోడలు సోనియా గాంధీతో ఇందిర) (పెళ్లినాడు తన భర్త ఫిరోజ్ గాంధీ, బంధువులతో ఇందిర)