Independence Day 2021: రెండు వందల ఏళ్లకు పైగా పరాయి పాలనలో మగ్గిన, అణచివేతకు గురైన భారత్.. తొంభై ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో స్వాతంత్య్రం సాధించుకుంది. మహా మహా నాయకుల సారధ్యంలో ప్రజా పోరాటం.. ప్రాణ త్యాగాలతో స్వేచ్ఛను పొందింది. ఆ పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే 75వ స్వాతంత్య్ర దినోత్సవం 75th Independence Dayసందర్భంగా ఆ మహా సంగ్రామం తాలుకా చిత్రాలు కొన్ని మచ్చుకు మీ కోసం..
►1857 సిపాయిల తిరుగుబాటును స్వాతంత్య్ర పోరాటంలో కీలక ఘట్టంగా అభివర్ణిస్తుంటారు చరిత్రకారులు. ఆ పోరాటంలో ఓడినప్పటికీ.. ఆంగ్లేయులకు మాత్రం మన తొలి దెబ్బ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. కావ్న్‌పోర్(కాన్పూర్) దగ్గర 1858లో జరిగిన పోరాటానికి సంబంధించిన ప్రతీకాత్మక చిత్రం ఇది.
►స్వరాజ్య లక్క్ష్యంతో మహాత్మా గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమం హింసాత్మకంగా మారింది. 1922 ఫిబ్రవరి 4న ఉద్యమకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చౌరీ చౌరా పోలీస్ స్టేషన్‌కు నిప్పటించి.. 20 మందికిపైగా పోలీసాఫీసర్లను సజీవంగా దహనం చేశారు.
►1930 ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా.. దండి మార్చ్‌లో పాల్గొన్న గాంధీ, పక్కన సరోజినీ నాయుడు
►విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమంలో భాగంగా.. వస్తువులతో వస్తున్న ఎడ్ల బండికి అడ్డుగా పడుకుని శాంతియుత నిరసన వ్యక్తం చేస్తున్న నిరసనకారుడు
►క్విట్ ఇండియా ఉద్యమం.. సైమన్ గో బ్యాక్ నినాదంతో ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు
►గాంధీ, కాంగ్రెస్ నేతల అరెస్ట్‌కు నిరసనగా చేపట్టిన ప్రదర్శనలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు బ్రిటిష్ సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగం
►ఫిబ్రవరి 20, 1947న స్వాతంత్య్ర ప్రకటన చేసిన బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ
► సంబురంగా ప్రజల మధ్య శాంతి కపోతాన్ని ఎగరేసిన నెహ్రూ
►ఎర్రకోట సంబురాల్లో ప్రధాని హోదాలో నెహ్రూ
►ఆగష్టు 16, 1947.. ఎర్రకోట నుంచి రెపరెపలాడుతూ కనిపించిన మువ్వన్నెల జెండా
►దేశ విభజన తర్వాత సెప్టెంబర్, 1947లో భారత్ నుంచి పాక్‌కు పయనమైన వందలాది మంది
Comments
Please login to add a commentAdd a comment