ఏడు పదుల సౌరభం | Shiva reddy article on Independence Day of India | Sakshi
Sakshi News home page

ఏడు పదుల సౌరభం

Published Tue, Aug 15 2017 1:25 AM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

ఏడు పదుల సౌరభం

ఏడు పదుల సౌరభం

సందర్భం
స్వాతంత్య్రం వచ్చాక మొదటి దశాబ్దాన్ని వదిలేస్తే తర్వాత ఆరు దశాబ్దాలలో భారతీయ సాహిత్యం అపూర్వంగా వృద్ధి చెందింది. అన్ని భాషా సాహిత్యా లలో నిర్దిష్టత ప్రవేశించింది. ఒక స్థానికమైన రంగూ రుచీ కేరక్టర్‌ అబ్బాయి.

త్రిపురనేని మధుసూదన రావు అంటూ వుండే వారు: ‘అభ్యుదయ కవి త్వం భావకవిత్వం మీద తిరుగుబాటుగా వచ్చింద నుకుంటాం, కానీ కాదు – అది జాతీయవాద కవి త్వానికి కొనసాగింపు’. గురజాడ ఇచ్చిన ఆధు నికత తర్కం తాత్వికతని కాదని భావకవిత్వం ఎలా వచ్చింది? గురజాడ ఇచ్చిన ఆధునిక ఆలోచనని బూర్జువా ప్రజాస్వామిక దృక్పథాన్ని భావకవిత్వం అందుకొని విశాలం చేసి వుండాల్సింది. భావ కవిత్వం ఆకాశం నుంచి ఊడిపడలేదు.

పశ్చిమాన ఫ్రెంచి విప్లవంతో ప్రభావితమైన కవులు రొమాంటిక్‌ పొయిట్రీ మూవ్‌మెంట్‌ని ప్రారంభిస్తే (ప్రకృతి కవిత్వం అని కూడా అన్నారు), ఆ ప్రభావం నుంచి కొంత ఇక్కడ నెలకొన్న పరిస్థితుల వల్ల పరిపూర్ణమైన హద్దుల్లేని స్వేచ్ఛ కావాలనే భావన మూలంగా భావకవిత్వం వచ్చింది. భావకవి త్వంలో అనేక పాయలు న్నాయి. అది కేవలం ప్రేయసీ ప్రియులకు సంబంధించినది కాదు. ఒక బంధన నుంచి ఒక విముక్తి. గురజాడ దోవన నడిచివచ్చిన వాళ్ళు, దాన్ని విశాలం చేసిన వాళ్ళు అభ్యుదయ కవులు.

స్వతంత్రం తరువాత వచ్చిన అన్ని కవిత్వ ధోర ణులలో ఆనాటి కాలాల చారిత్రక పరిస్థితులు, మార్పులు, సంక్షోభాలు, పరివర్తనలు భాగమయ్యాయి. ఏ ధోరణి కవిత్వం అయినా ప్రారంభంలో ఒకానొక స్థలం వద్ద ఒకానొక నిర్దిష్ట ఆదర్శంతో మొదలయినా రానురాను అది బలపడే క్రమంలో స్థలకాలాలు, సామాజిక స్థితులు, రాజకీయాలు అంతర్భాగమై, ఆధునికత అంతర్వాహినిగా అభివృద్ధి చెందాయి. అన్ని భాషల కవిత్వం ఈ స్థితికి లోనయ్యింది. హిందీలో వచ్చిన నయా కవితా ఇత్యాదులు ఉదాహరణ.

ఈ డెబ్భై ఏళ్ళలో భారతీయ సమాజం అనేక మార్పులకు లోనయింది. కల్లోల స్థితులను ఎదు ర్కొంది. అటు రాజకీయాలలోనూ ఇటు సమాజం లోనూ విస్తృతి జరిగిందా అంటే, ఏదీ మూసుకోదు. ఓపెన్‌ అప్‌ అవుతుంది. అన్ని భాషల బృందాల సాహిత్యాల్లోనూ ఇది ప్రతిఫలించింది.స్వతంత్రం వచ్చాక మొదటి దశాబ్దాన్ని వదిలేస్తే తర్వాత ఆరు దశాబ్దాలలో భారతీయ సాహిత్యం అపూర్వంగా అనన్యంగా అభివృద్ధి చెందింది. పశ్చి మాన వచ్చిన అన్ని సాహిత్య మార్పులను, శిల్ప రీతుల్ని, కవిత్వ విధానాలను అది అందుకొంది. గర్భీ కరించుకొని ముందుకెళ్ళింది. పాతదాన్ని ప్రశ్నిం చడం, నిలవనీటి సిద్ధాంతాల మీద తిరుగుబాటు వేయడం మొదలయ్యింది.

కొత్త చైతన్యం నుంచి కొత్త ఎరుకనుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. కేంద్రాన్ని బద్దలు కొట్టడం ఒక ఐడియల్‌ అయింది. మహాకథనాలు నశించాయని ఇక రావని – అనేక ప్రపంచ సాహిత్యాల అధ్య యనం వల్ల సంపర్కం వల్ల ఇక్కడి సమాజాన్ని ఇక్కడ ప్రజల జీవనాన్ని రికార్డు చేయడం జరిగింది. ఏదీ పరిపూర్ణ సిద్ధాంతం కాదు. అందువల్ల అనేక ప్రశ్నలు అనేక సమాధానాలు అనేక వాదాలు అన్ని ప్రాంతాల్లోనూ అన్ని భాషల్లోనూ కొత్త సాహిత్యం రావడానికి దోహ దం చేశాయి.

అన్ని భాషా సాహిత్యాలలో నిర్దిష్టత ప్రవేశిం చింది. ఆ నిర్దిష్టత నుంచి అస్తిత్వాన్ని గురించి ఆలోచనలు, అనేక రకాల అస్తిత్వాల మధ్య అస్తిత్వపు సమ స్యను అర్థం చేసుకోవ డం, ఆ దిశగా ఆలోచిం చడం, సాహిత్య సృజన చేయడం అన్ని భాష లలో జరుగుతూ వచ్చిం ది. కొత్త పరికరాలు, ఒక టెక్నలాజికల్‌ రెవల్యూ షన్‌ వల్ల చోటు చేసు కున్న కొత్త సంక్షోభ స్థితులు, మానవ సంబం ధాలలో శిథిలాలు. రాజ కీయాలలో ఒక లంపెనైజేషన్, క్రిమినలైజేషన్, శిథిల మవుతున్న విలువలు, కొత్త సమీకరణలు దుష్ఫలి  తాలు–అన్నింటినీ స్వాతంత్య్రానంతర భారతీయ సాహిత్యం అందుకుంది.

అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ స్థానిక సమస్యల వివక్షల నేపథ్యంలో ఉనికిలోకి వచ్చిన పోరాటాలు, ఆ వెలుగులో వచ్చిన సాహిత్యం బల మైనది. ఒక స్థానికమైన రంగూ రుచీ కేరక్టర్‌ దాని కబ్బాయి. ఈశాన్య రాష్ట్రాల సాహిత్యం దీనికి ఉదాహ రణ. వామపక్ష ఉద్యమాలు సాయుధ పోరాటాలు ఒక ప్రత్యామ్నాయ ఆదర్శ పరిపాలన – రాజ్యంతో భీకర పోరాటం ఇవన్నీ సమీప గతం నుంచి గొప్ప సాహిత్యం రావటానికి దోహదం చేశాయి. అన్ని పోరా టాల నుంచి అన్ని వాదాల నేపథ్యం నుంచి వచ్చిన సృజన నిర్దుష్టమై సాధారణీకరణ చెందుతూ వచ్చింది. ఒక భౌతిక స్థితి నుంచి ఒక ఆంతరిక కల్లోల పరి జ్ఞానంతో గొప్ప సాహిత్యం వస్తున్న దశ ఇది.


కె.శివారెడ్డి
వ్యాసకర్త ప్రముఖ కవి, విమర్శకుడు,
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
మొబైల్‌ : 95021 67764

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement