ఇందిర అరుదైన ఫొటోలు చూడాలని ఉందా..! | Rare Pics Of Indira Gandhi in new exhibition | Sakshi
Sakshi News home page

ఇందిర అరుదైన ఫొటోలు చూడాలని ఉందా..!

Nov 21 2016 7:04 PM | Updated on Aug 16 2018 4:59 PM

ఇందిర అరుదైన ఫొటోలు చూడాలని ఉందా..! - Sakshi

ఇందిర అరుదైన ఫొటోలు చూడాలని ఉందా..!

ఇందిరాగాంధీ.. భారత రాజకీయాల్లోనే ఆమె తిరుగులేని ముద్ర వేసిన నాయకురాలు. దేశం మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని కనుసన్నల్లో మెదిలేలా చేసిన శక్తిమంతమైన మహిళ.

న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ.. భారత రాజకీయాల్లోనే ఆమె తిరుగులేని ముద్ర వేసిన నాయకురాలు. దేశం మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకొని కనుసన్నల్లో మెదిలేలా చేసిన శక్తిమంతమైన మహిళ. వైఫల్యాలు, స్వార్థపూరిత చర్యలు అనే విమర్శలను పక్కనపెడితే.. ఇప్పటికీ భారత రాజకీయాల అధ్యయనం ఆమె ప్రస్తావన లేకుండా చేయడం సాధ్యంకాని పని. ప్రధానిగా చెరగని ముద్ర వేసుకున్న ఇందిరాగాంధీ.. ఇప్పటికీ గ్రామాల్లోని ప్రతి ఒక్కరు ఆమె తమకు బాగా కావాల్సినవారు అన్నట్లుగా మాట్లాడతారంటే ఆశ్చర్యపోక తప్పదు కూడా.

అంతగా సుపరిచితురాలైన ఆమె ఆహార్యం, దర్పం, హుందాతనం, ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్ ఒక ప్రత్యేకతను చాటుకుంది. అలాంటి ఇందిరాగాంధీకి సంబంధించిన అరుదైన ఛాయ చిత్రాలు ఇప్పుడు దర్శనం ఇస్తున్నాయి. యుక్త వయసులోవి, భర్త ఫీరోజ్ గాంధీతో పెళ్లినాటివి, కశ్మీర్ లో హనీమూన్  సందర్భంలోనివి, రాజీవ్ను ఒడిలోపెట్టుకొని  నెహ్రూతో దిగిన సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే చిత్రాలు ప్రదర్శనకు ఉంచారు.

మొత్తం 220 ఆనాటి ఇందిర ఫొటోల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే సేకరించారు. వీటన్నింటిని అలహా బాద్లో ఎగ్జిబిషన్కు ఏర్పాటు చేయగా సోనియా కూతురు ప్రియాంక గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సోనియా, రాహుల్, ప్రియాంక ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.   

(మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అరుదైన చిత్రాల ఎగ్జిబిషన్ ను ప్రారంభించి తిలకిస్తున్న ప్రియాంకా గాంధీ)


(మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అరుదైన చిత్రాలు వీక్షిస్తున్న సోనియా గాంధీ)


(మహాత్మాగాంధీ చితాభస్మాన్ని రైలులో తీసుకెళుతూ ఇందిర) (ముగ్గురు ప్రధానులు నెహ్రూ, ఇందిర, రాజీవ్‌(ఒడిలోని బాలుడు)


(తన కోడలు సోనియా గాంధీతో ఇందిర)

(పెళ్లినాడు తన భర్త ఫిరోజ్‌ గాంధీ, బంధువులతో ఇందిర)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement