వీరంతా మూడో లింగం అట! | Fascinating photographs Of Ancient 'Mahu' community | Sakshi
Sakshi News home page

వీరంతా మూడో లింగం అట!

Published Thu, Oct 10 2019 4:43 PM | Last Updated on Thu, Oct 10 2019 7:53 PM

Fascinating photographs Of Ancient 'Mahu' community - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ పసిఫిక్‌ దీవుల సముదాయంలో భాగంగా ఉన్న పొలినేసియన్‌ దీవి ‘తహితీ’. ఆ దీవిలో ప్రాచీన ఆధ్యాత్మిక ‘మహు’ జాతి మనుషులు ఇప్పటికీ నివసిస్తున్నారు. వారు తమ శరీరాలకు ముదురు నీలం, ముదురు గులాబీ, చిక్కటి పసుపు రంగులు వేసుకొని మెడలో, జుట్టుపై ఆకులు, పూలతో కూడిన దండలు ధరిస్తారు. సముద్రపు ఒడ్డున దొరికే గవ్వలు, కౌశిప్పులు, చిప్పలను కూడా దండలుగా ధరిస్తారు. మొల చుట్టూ ఆకర్షణీయమైన డిజైన్‌ రంగుల గుడ్డలు ఆడవాళ్ల మాదిరిగా ధరిస్తారు. అయితే వారు ఆడవారు కాదు, మగవారు కాదు. మూడవ లింగం అన్న మాట.



ఆ ప్రాంతంలో జరిగే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు. డ్యాన్సులు కూడా చేస్తారు. వారిని దైవ సమానులుగా ఇతర జాతి ప్రజలు వారిని పూజిస్తారు. వాస్తవానికి వారు ‘మహు’ జాతిలో మగవారిగానే పుడతారు. ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులు దాచేసి, మూడవ లింగమంటూ ఈ విచిత్ర వేషధారణను చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తారు. ఇక వారి జీవనాధారం. ఆ వేషధారణే. వారికి కావాల్సిన ఆహారాన్ని అన్ని జాతుల ప్రజలు సమకూర్చి పెడతారు. వారు ఇళ్ల వద్ద పెద్దలు, పిల్లల సంరక్షణ బాధ్యతలను చిత్తశుద్ధితో చూసుకుంటారు.



స్విస్‌–గినియన్‌ ఫొటోగ్రాఫర్‌ లమ్సా లియూబా ఇటీవల ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వారి ఫొటోలను తీశారు. ఫొటోల కోసం వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఒక్కొక్కరితో గంటలపాటు మాట్లాడితేగానీ ఫొటోల కోసం వారు ఒప్పుకోలేదని ఆమె తెలిపారు. స్విడ్జర్లాండ్‌లో జరిగే ఫొటో ఎగ్జిబిషన్‌లో ‘ఇల్యూషన్‌’ పేరిట వీటిని ప్రదర్శిస్తానని ఆమె చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement