
మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు

మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాళెం లో 1952 మార్చి 19న జన్మించారు

తండ్రి ఉపాధ్యాయుడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు - రంగనాధ్ చౌదరీ, రామచంద్ర చౌదరీ, కృష్ణ -, ఒక సోదరి విజయ ఉన్నారు

నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్ గా, హీరోగా, క్యారక్టర్ నటుడిగా నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్నారు

1975 లో దాసరి నారాయణరావు గారు కొత్త నటి నటులతో నిర్మించ తలపెట్టిన 'స్వర్గం-నరకం' చిత్రం కోసం జరిగిన ఆడిషన్ లో భక్తవత్సలం దాసరి దృష్టిని ఆకర్షించి నటునిగా తోలి ఆవకాశం సంపాదించారు.

స్వర్గం నరకం (1975) చలన చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యాడు

నటునిగానే కాకుండా నిర్మాతగా కూడా మోహన్ బాబు గుర్తింపు పొందారు

ఆయన దర్శకుడు లక్ష్మి దీపక్ దగ్గర పనిచేసారు

దాసరి గారే భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా వెండి తెరకు పరిచయం చేసారు

80వ దశకంలో విలన్ గానే ఎక్కువ ఆకట్టుకున్న మోహన్ బాబు 1990 వ దశకంలో పూర్తిస్థాయి హీరోగా ప్రేక్షకులకు దగ్గర అయ్యారు

అల్లుడుగారు తో సోలో హీరో గా నిలదొక్కుకున్న మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ, రౌడిగారి పెళ్ళాం, అల్లరి మొగుడు వంటి చిత్రాలతో కలక్షన్ల మోత మోగించి 'కలక్షన్ కింగ్ ' అనిపించుకున్నారు.

రజిని కాంత్ అతిధి పాత్రలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన 'పెదరాయుడు' అప్పటివరుకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది.

నటుడిగా ఆయన సూపర్ హిట్ సినిమాలు అన్ని తన సొంత బ్యానర్ లోనే రావటం విశేషం

1983 లో శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్ స్థాపించి ఇప్పటి వరుకు 56 చిత్రాలను నిర్మించారు

మోహన్ బాబు 1992 లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను స్థాపించడం ద్వారా విద్యారంగంలో సేవలు అందిస్తున్నారు

1995 లో యన్.టి.ఆర్ ప్రోద్బలంతో రాజ్యసభ ఎమ్.పి. గా పనిచేసారు.

ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు


మోహన్ బాబు దాసరి నారాయణరావును గురువుగా భావిస్తాడు

రజినీకాంత్ కు సన్నిహితుడు

ఆయన ఇద్దరు కుమారులు మంచు విష్ణు, మనోజ్

కుమార్తె లక్ష్మీ ప్రసన్న

శ్రీ రాములయ్య , అడవిలో అన్న తో మోహన్ బాబు లో మరో నటుడిని చూపించారు

కర్ణాటక రాష్ట ప్రభుత్వం నుంచి శ్రీ కృష్ణ దేవరాయలు పురస్కారం

తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ : లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్

లండన్ తెలుగు సంఘం (తాల్) వారు తాల్ హయ్యస్ట్ ప్రెస్టిజియస్ అవార్డు



































