Mahesh Babu Brother Ramesh Babu Unseen Photos And Movies List - Sakshi

Ramesh Babu: ఇప్పటివరకు చూడని రమేశ్‌ బాబు అన్‌సీన్‌ ఫోటోలు

Jan 9 2022 5:26 PM | Updated on Jan 10 2022 8:31 AM

Mahesh Babu Brother Ramesh Babu Unseen Pictures - Sakshi

Ramesh Babu Movies List: సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌ బాబు సోదరుడు రమేశ్‌ బాబు (56)ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి(శనివారం) 10గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 1965, అక్టోబర్‌ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరలకు మొదటి సంతానంగా జన్మించిన రమేశ్‌ బాబు‘అల్లూరి సీతారామరాజు’సినిమాతో తెరంగేట్రం చేశారు.

ఆ తర్వాత కృష్ణ ఓ లీడ్‌ రోల్‌లో నటించి, నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’లో చిన్నప్పటి ఎన్టీఆర్‌గా కనిపించారు. అలా బాలనటుడిగా కొన్ని సినిమాలు చేసిన అనంతరం ‘సామ్రాట్‌’(1987)సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.

ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఆ తర్వాత ‘చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్‌ టైగర్, కృష్ణగారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, అన్నాచెల్లెలు, ఆయుధం’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు.రమేశ్‌కు భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement