
Krishna About Namrata Shirodkar: సూపర్ స్టార్ మహేశ్‌బాబు తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాల ద్వారా ప్రేక్షకులకు వినోదం పంచుతూనే మరోవైపు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అయితే అతడు పెద్ద స్టార్ అవుతాడని తమకెప్పుడో తెలుసంటున్నారు మహేశ్ తండ్రి, సీనియర్ నటుడు కృష్ణ.
కృష్ణ సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'పోరాటం' సినిమాలో తనయులు మహేశ్ బాబు, రమేశ్ బాబు ఇద్దరూ బాగా నటించారన్నారు. కానీ ఆ తర్వాత రమేశ్ కెరీర్‌లో మంచి సినిమాలు పడలేదన్నారు. అందుకే రమేశ్ బాబుకు నటించాలన్న ఆసక్తి సన్నగిల్లిందని చెప్పుకొచ్చారు. ఇక తన కోడలు నమ్రత సినిమాలు, బిజినెస్ పట్టించుకోదని, అన్నీ తన కొడుకే చూసుకుంటాడని తెలిపారు. ఆయన ఇంకా ఏమేం మాట్లాడారో తెలియాలంటే కింది వీడియో చూసేయండి..