
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ కెరీర్ మోడలింగ్‌తో కేరీర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమాల్లోకి అడుగుపెట్టి ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న అరుదైన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
వారు మోడల్‌గా ఓకే ఫ్రేమ్‌లో ఉన్న ఈ ఫొటోను ఫోటోని ఫ్యాషన్ వీక్ ఆర్గనైజర్ మార్క్ రాబిన్సన్ తన ట్విటర్‌లో షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. టామ్‌ఫిగర్ ఫ్యాషన్ షో కోసం తీసిన ఆ పిక్‌లో జలక్ దిఖ్ లాజా 7 పార్టిసిపెంట్, నటి, హోస్ట్ సోఫి చౌదరి కూడా ఉన్నారు.
కాగా బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న దీపికా పడుకోనే ప్రస్తుతం ‘ఫైటర్, ది ఇంటర్న్, పఠాన్’ వంటి చిత్రాలతో పాటు భర్త రణవీర్ సింగ్‌తో కలిసి '83లో నటిస్తోంది. అంతేకాకుండా హాలీవుడ్‌లో సైతం మరో సినిమాకు సంతకం చేయడమే కాకుండా ఆ మూవీ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం గమనార్హం. ఇక కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ మూవీ ‘టైగర్ 3’, ‘ఫోన్ బూత్’, ‘సూర్యవంశీ’ వంటి సినిమాలతో బిజీగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment