ముంబై : బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్‌కు లవర్‌బాయ్ ఇమేజ్ ఉంది. గతంలో స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, కత్రినా కైఫ్‌లతో లవ్‌ట్రాక్ నడిపిన రణ్‌బీర్ ఇప్పుడు ఆలియాభట్‌తో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. కరోనా కారణంగా వీరి పెళ్లికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కొడుకు ఫెయిల్యూర్ లవ్‌స్టోరీలపై స్పందించారు. రణ్‌బీర్‌తో డేటింగ్ చేసిన హీరోయిన్లు ఎవరూ తనకు సూట్ కారని, రిలేషన్ బ్రేకప్ కావడంలో తన కొడుకు తప్పేమీ లేదని పేర్కొంది.
'రణ్‌బీర్ చాలా సాఫ్ట్. ఎవరినీ హర్ట్ చేయడు. తను బంధానికి ఎంతో విలువిచ్చే మనిషి. నో చెప్పడం కూడా తెలియని అమాయకుడు. ఫస్ట్ టైమ్ రణ్‌బీర్ డేటింగ్‌లో ఉన్నప్పుడు.. ఆ అమ్మాయితో రిలేషన్ వద్దని వారించినా రణ్‌బీర్ వ్యతిరేకించాడు. దీంతో ఈ మ్యాటర్‌ను మరో రకంగా డీల్ చేస్తే మంచిదని భావించా. అందుకే అమ్మాయిల విషయంలో అంత త్వరగా నిర్ణయం తీసుకోవద్దని సలహా ఇచ్చా' అని నీతూకపూర్ వెల్లడించింది.
కాగా రణ్‌బీర్‌తో గతంలో దీపికా పదుకొణె పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. అతని పేరుతో 'ఆర్‌కే' అనే టాటూని వీపుపై వేయించుకుంది. వీరిద్దరి పెళ్లి కూడా జరగనుందనే వార్తలు కూడా బీటౌన్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే అనూహ్యంగా వీరి రిలేషన్ మధ్యలోనే ఆగిపోయింది. ఈ కారణంగానే దీపికా డిప్రెషన్‌కు గురైనట్లు బీటౌన్ టాక్. ఆ తర్వాత నటుడు రణవీర్ సింగ్‌తో దీపిక పెళ్లి జరిగింది.
ఆ తర్వాత కత్రినా కైఫ్‌తో ఆరేళ్ల పాటు రణ్‌బీర్ డేటింగ్ చేశాడు. అంతేకాకుండా ఫ్యామిలీ ఫంక్షనకు సైతం కత్రినా అటెండ్ అయ్యేది. వీరి పెళ్లకి ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారనే ప్రచారం కూడా సాగింది. కానీ సడెన్‌గా వీరిద్దరు ఉంటున్న ఇళ్లు ఖాళీ చేసి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇక దీపికా- కత్రినాలతో రణ్‌బీర్ బ్రేకప్ జరగడానికి తల్లి నీతూ కపూర్ కూడా ఒక కారణమని అప్పట్లో రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి : తనే నా గర్ల్ ఫ్రెండ్, త్వరలోనే పెళ్లి : రణ్‌బీర్
‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’
Comments
Please login to add a commentAdd a comment