న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఎన్నికల ప్రధానంగా పోటీ పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు విమర్శల దాడి పెంచారు. తాజాగా ఆప్ (AAP)అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బంగారు గొలుసులు పంచుతున్నారని ఆరోపించారు.‘ఈ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోంది.
ఓటర్లను ఆకట్టుకునేందుకు జాకెట్లు,షూస్,చీరలు, డబ్బులు పంచుతున్నారు. కొన్ని కాలనీల్లో అయితే బంగారు గొలుసులు కూడా ఇస్తున్నట్లు సమాచారం.నేను ఓటర్లను కోరేది ఒకటే..ఓట్లను అమ్ముకోకండి. బంగారం,డబ్బులు ఎవరిచ్చినా సరే,అది ఆప్ అభ్యర్థులైనా సరే వారికి ఓటు వేయకండి’ అని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
కేజజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలకు బీజేపీ(Bjp) ఎంపీ మనోజ్ తివారీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కేజ్రీవాల్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. కేజ్రీవాల్ ఎప్పుడో మద్యం ట్రేడర్లకు సోల్డ్‌ఔట్ అయ్యారు’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment