ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. ఢిల్లీలోని 70 స్థానాలకు బుధవారం (ఫిబ్రవరి 5) పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హ్యాట్రిక్ విజయాలు సాధించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తుండగా, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఢిల్లీలోని ఐదు స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు స్థానాలను ఆప్ అతికష్టం మీద గెలుచుకుంది. ఆప్ అభ్యర్థులు బీజేపీని చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. ఆ సీట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బిజ్వాసన్
గత ఎన్నికల్లో నైరుతి ఢిల్లీలోని బిజ్వాసన్ స్థానంలో ఆప్ అభ్యర్థి భూపిందర్ సింగ్ జూన్ బీజేపీకి చెందిన సత్ ప్రకాష్ రాణాను కేవలం753 ఓట్ల తేడాతో ఓడించారు. భూపిందర్ సింగ్ జూన్‌కు 57,271 ఓట్లు, సత్ ప్రకాష్ రాణాకు 56,518 ఓట్లు వచ్చాయి. ఈ సీటును రెండుసార్లు గెలుచుకున్న సత్ ప్రకాష్ రాణా, 2015లో మొదటిసారి, 2020లో రెండవసారి ఈ సీటును కోల్పోయారు. ఈసారి ఆప్ సురేంద్ర భరద్వాజ్‌కు, బీజేపీ కైలాష్ గెహ్లాట్‌కు, కాంగ్రెస్ దేవేంద్ర సెహ్రావత్‌కు బిజ్వాసన్ టికెట్ ఇచ్చింది.
2. కస్తూర్బా నగర్
ఆగ్నేయ ఢిల్లీలోని కస్తూర్బా నగర్ సీటులో ఈసారి కూడా గట్టి పోటీ నెలకొంది. బీజేపీకి చెందిన రవీంద్ర చౌదరికి 33,935 ఓట్లు, ఆప్ నేత మదన్ లాల్‌కు 37100 ఓట్లు వచ్చాయి. మదన్ లాల్ కేవలం 3,165 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆప్ రమేష్ పెహ్ల్వాన్‌ను బరిలోకి దింపింది. బీజేపీ నీరజ్ బసోయాకు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ అభిషేక్ దత్‌ను నిలబెట్టింది.
3. ఛతర్‌పూర్
2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి కర్తార్ సింగ్ తన్వర్ కూడా దక్షిణ ఢిల్లీలోని ఛతర్‌పూర్ అసెంబ్లీ స్థానాన్ని 3,720 ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో కర్తార్ సింగ్ కు 6,9411 ఓట్లు, బీజేపీకి చెందిన బ్రహ్మ సింగ్ తన్వర్ కు 6,5691 ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ స్థానంలో అభ్యర్థుల్లో మార్పు జరిగింది. ఆప్ బ్రహ్మ సింగ్ తన్వర్‌ను, బీజేపీ కర్తార్ సింగ్‌ను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర తన్వర్‌కు టికెట్ ఇచ్చింది.
4. ఆదర్శ్ నగర్
ఉత్తర ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ స్థానంలో గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి పవన్ శర్మకు 46,892 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ భాటియాకు 45,303 ఓట్లు వచ్చాయి. వారిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 1,589 మాత్రమే. ఈసారి ఆప్ ముఖేష్ గోయల్ కు టికెట్ ఇవ్వగా, బీజేపీ రాజ్ కుమార్ భాటియాకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ శివంక్ సింఘాల్‌ను ఎన్నికల్లో పోటీకి దింపింది.
5. పట్పర్‌గంజ్
మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తూర్పు ఢిల్లీలోని పట్పర్‌గంజ్ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సీటును సిసోడియా అతికష్టం మీద దక్కించుకున్నారు. 2020 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియాకు 70,163 ఓట్లు వచ్చాయి. బీజేపీ నేత రవీంద్ర నేగికి 66,956 ఓట్లు వచ్చాయి. మనీష్ సిసోడియా 3,207 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఆప్ అవధ్ ఓజాకు టికెట్ ఇచ్చింది. బీజేపీ రవీంద్ర నేగిని, కాంగ్రెస్ అనిల్ కుమార్‌ను బరిలోకి దింపాయి.
ఇది కూడా చదవండి: వికటించిన విందు భోజనం.. ఆస్పత్రికి 200 మంది
Comments
Please login to add a commentAdd a comment