Tamannaah Fan Over Action At Kollam Shopping Mall Opening - Sakshi
Sakshi News home page

Tamanna: తమన్నాను భయపెట్టిన అభిమాని.. చివరికి ఏమైందంటే?

Published Sun, Aug 6 2023 7:29 PM | Last Updated on Mon, Aug 7 2023 9:44 AM

Tamanna Fan Over Action At Kollam Shopping Mall Opening - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌తో పాటు సౌత్‌ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవలే లస్ట్ స్టోరీస్‌-2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రస్తుతం ఆమె నటించిన భోళాశంకర్, జైలర్‌ విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రిలీజైన జైలర్ సాంగ్ కావాలయ్యా అంటూ అభిమానలను ఓ రేంజ్‌లో ఊపేస్తోంది ముద్దుగుమ్మ. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సావానికి వెళ్లిన భామకు అభిమానుల తాకిడి ఎదురైంది. 

(ఇది చదవండి: థియేటర్లో యాంకర్ రచ్చ రచ్చ.. భర్తతో కలిసి!)

కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లగా తమన్నాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె చుట్టూ బౌన్సర్లు ఉండగా.. వారందరినీ తప్పించుకుని ఏకంగా తమన్నా చేయిని పట్టుకున్నాడు. దీంతో అక్కడున్న బౌన్సర్లు ఒక్కసారిగా అప్రమత్తమై ‍అతన్ని పక్కకు లాగేశారు. అయితే అభిమాని అత్యుత్సాహాన్ని గమనించిన మిల్కీ బ్యూటీ బౌన్సర్లకు నచ్చజెప్పి.. అభిమానితో నవ్వుతూ సెల్పీ దిగింది. మరీ మిల్కీ బ్యూటీ అభిమానులంటే ఆ మాత్రం ఉంటది అంటున్నారు నెటిజన్స్. కాగా.. రజినీకాంత్ సరసన తమన్నా నటించిన జైలర్ ఈనెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే మెగాస్టార్ భోళాశంకర్ సైతం ఈనెల 11వ తేదీన రిలీజ్ కానుంది. 

(ఇది చదవండి: మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్‌ ఇప్పటికైతే లేదు: –తమన్నా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement