వ్యాపారవేత్తతో నటి పెళ్లి ఫిక్స్‌ : భలే ఇంప్రెస్‌ చేశాడుగా! ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌ | Housefull 2 Actress Shazahn Padamsee Engaged To Ashish Kanakia | Sakshi
Sakshi News home page

వ్యాపారవేత్తతో నటి పెళ్లి ఫిక్స్‌ : భలే ఇంప్రెస్‌ చేశాడుగా! ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌

Published Fri, Nov 22 2024 3:19 PM | Last Updated on Fri, Nov 22 2024 5:51 PM

Housefull 2 Actress Shazahn Padamsee Engaged To Ashish Kanakia

హౌస్‌ఫుల్ 2-స్టార్, సింగర్‌ షాజాన్‌ పదమ్‌సీ గుడ్‌న్యూస్‌ చెప్పేసింది. తన చిరకాల ప్రియుడు,వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది. అంతేకాదు అతనితో ఎంగేజ్‌మెంట్‌ పూర్తి చేసుకున్న షాజాన్‌ దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. కలకాలం నీతో జీవించేందుకు ఎదురు చూస్తున్నా  అని పేర్కొంది. 

మూవీమాక్స్ సినిమాస్ సీఈఓ, కనకియా గ్రూప్ డైరెక్టర్ ఆశిష్‌ను వచ్చే ఏడాది పెళ్లాడనుంది.  ఈ సందర్భంగా  తమ లవ్‌ స్టోరీని,  ఆశిష్‌ ఆకట్టుకునే అద్భుతమైన సెట్టింగ్‌తో తనను ఇంప్రెస్‌  చేసిన తీరును వెల్లడించింది.   తనను తాను ఓల్డ్-స్కూల్ రొమాంటిక్ అని  చెప్పుకునే షాజాన్, బాలీవుడ్‌ హీరో రణబీర్ కపూర్‌తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్‌ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్‌ అయింది. ఈమె మంచి గాయని కూడా. బాలీవుడ్‌ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్‌సీల కుమార్తె షాజాన్‌.

ఆశిష్ అందమైన  పూలతో అలకరించిన వేదికపై ఆమెకు అందంగా ప్రతిపాదించాడు. గత రెండున్నరేళ్లలో వారి చిత్రాలు జ్ఞాపకాలన్నింటినీ కలిపి కస్టమైజ్ చేసిన ఫోటో వాల్‌తో నవంబర్ 13న షాజాన్‌కు ప్రపోజ్‌ చేశాడు. షాజాన్ తన చిన్ననాటి స్నేహితురాలు ద్వారా ఆశిష్‌ని  కలిసినటటు తెలిపింది. అలా సాగిన పరిచయం, డేటింగ్‌, పెళ్లి దాకా వచ్చిందని గుర్తు చేసుకుంది. తాము విభిన్న నేపథ్యాలనుండి వచ్చినప్పటికీ, అభిరుచులూ, ప్రధాన విలువలు ఒకటేనని తెలిపింది. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లడం , ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ఉత్సవాలకు వెళ్లడంపై ఆసక్తి ఇద్దరికీ ఉందని  వెల్లడించింది.  అంతేకాదు తన కాబోయే భర్త క్రమశిక్షణ, నీట్‌నెస్ ఫ్రీక్ అని,ఆశిష్‌కు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా మెండుగా ఉందంటూ మురిసిపోయింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement