Housefull -2
-
వ్యాపారవేత్తతో నటి పెళ్లి ఫిక్స్ : భలే ఇంప్రెస్ చేశాడుగా! ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
హౌస్‌ఫుల్ 2-స్టార్, సింగర్ షాజాన్ పదమ్సీ గుడ్‌న్యూస్ చెప్పేసింది. తన చిరకాల ప్రియుడు,వ్యాపారవేత్త ఆశిష్ కనకియాతో వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగు పెట్టనుంది. అంతేకాదు అతనితో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న షాజాన్ దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కలకాలం నీతో జీవించేందుకు ఎదురు చూస్తున్నా అని పేర్కొంది. మూవీమాక్స్ సినిమాస్ సీఈఓ, కనకియా గ్రూప్ డైరెక్టర్ ఆశిష్‌ను వచ్చే ఏడాది పెళ్లాడనుంది. ఈ సందర్భంగా తమ లవ్ స్టోరీని, ఆశిష్ ఆకట్టుకునే అద్భుతమైన సెట్టింగ్‌తో తనను ఇంప్రెస్ చేసిన తీరును వెల్లడించింది. తనను తాను ఓల్డ్-స్కూల్ రొమాంటిక్ అని చెప్పుకునే షాజాన్, బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో కలిసి రాకెట్ సింగ్ , హౌస్‌ఫుల్ 2 సినిమాలతో బాగా పాపులర్ అయింది. ఈమె మంచి గాయని కూడా. బాలీవుడ్ ప్రముఖ గాయని షారన్ ప్రభాకర్, గాంధీ సినిమాలో జిన్నా పాత్రలో మెప్పించిన నటుడు దివంగత అలిక్ పదమ్‌సీల కుమార్తె షాజాన్.ఆశిష్ అందమైన పూలతో అలకరించిన వేదికపై ఆమెకు అందంగా ప్రతిపాదించాడు. గత రెండున్నరేళ్లలో వారి చిత్రాలు జ్ఞాపకాలన్నింటినీ కలిపి కస్టమైజ్ చేసిన ఫోటో వాల్‌తో నవంబర్ 13న షాజాన్కు ప్రపోజ్ చేశాడు. షాజాన్ తన చిన్ననాటి స్నేహితురాలు ద్వారా ఆశిష్‌ని కలిసినటటు తెలిపింది. అలా సాగిన పరిచయం, డేటింగ్, పెళ్లి దాకా వచ్చిందని గుర్తు చేసుకుంది. తాము విభిన్న నేపథ్యాలనుండి వచ్చినప్పటికీ, అభిరుచులూ, ప్రధాన విలువలు ఒకటేనని తెలిపింది. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు వెళ్లడం , ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ఉత్సవాలకు వెళ్లడంపై ఆసక్తి ఇద్దరికీ ఉందని వెల్లడించింది. అంతేకాదు తన కాబోయే భర్త క్రమశిక్షణ, నీట్నెస్ ఫ్రీక్ అని,ఆశిష్‌కు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా మెండుగా ఉందంటూ మురిసిపోయింది. View this post on Instagram A post shared by Shazahn Padamsee (@shazahnpadamsee) -
ఈ కథ అందరి కోసం
పెద్దలు మాత్రమే వినాల్సిన సంభాషణలు రాయడంలో సిద్ధహస్తులుగా పేరుగాంచిన రచయితలు సాజిద్, ఫరాద్లు దర్శకులుగా మారారు. కథలు రాసి కడుపుబ్బా నవ్వించిన వీరిద్దరు ఇక దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందో...? అందులో ఎన్నిసార్లు కళ్లు మూసుకోవాల్సిన సన్నివేశాలు, చెవులు మూసుకోవాల్సిన సంభాషణలు ఉంటాయోనని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఈ దర్శకద్వయం చెవిలో కూడా పడిందట. దానికి వెంటనే వారిద్దరు వివరణ ఇచ్చుకుంటూ... ‘మేమిద్దరం తెరకెక్కించే ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ సినిమా కుటుంబంలోని అందరినీ దృష్టిలో ఉంచుకొని తెరకెక్కిస్తున్నాం. ఇప్పటిదాకా మేం రాసిన బోల్ బచ్చన్, హౌస్‌ఫుల్-2, రెడీ, గోల్మాల్ రిటన్స్, గోల్మాల్-3 వంటి చిత్రాల్లో అశ్లీల సంభాషణలు ఉన్నాయన్నది వాస్తవం కాదు. అందుకు మేమెప్పుడూ అవకాశం ఇవ్వలేదు. నిజంగా అటువంటి సందర్భానికి సంభాషణలు రాయాల్సి వస్తే చాలా అసౌకర్యంగా అనిపించేది. ఓ పని చేయడం అసౌకర్యంగా అనిపిస్తే ఆ పని ఎప్పుడూ ఎదుటివారికి నచ్చేలా ఉండదు. అందుకే ఆ ‘గిరి’లోనుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నాం. మా తొలి సినిమాతో ఆ గిరిలో నుంచి సులభంగా బయటపడతామని భావిస్తున్నాం. ఈ సినిమాకు కథ రాసుకునేముందే కుటుంబంలోని పిల్లలు, పెద్దలు, యువతీయువకులు.. ఇలా అందరినీ దృష్టిలో పెట్టుకున్నాం. సినిమాను కుటుంబ కథాచిత్రంగా తీర్చిదిద్దుతున్నాం. అక్షయ్‌కుమార్ సినిమాలో నటిస్తున్నాడంటే ప్రేక్షకులకు కొన్ని అంచనాలుంటాయి. వాటిని పూర్తిస్థాయిలో మేం అందుకోగలమనే విశ్వాసంతో ఉన్నాం. నాణ్యమైన వినోదంతో దర్శకులుగా ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాం. అందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. అక్షయ్ కుమార్ విషయానికి వస్తే ఆయన ఓ మంచి నటుడు మాత్రమే కాదు గొప్ప మానవతావాది కూడా. సినిమా బాగా రావడం కోసం ఆయన అందిస్తున్న ప్రోత్సాహం చూస్తే ముచ్చటేస్తోంది. ఈ సినిమాలో కూడా శిక్షణ పొందిన కుక్కలు నటిస్తున్నాయి. ‘హాథీ మేరే సాథీ’, ‘తేరీ మెహర్బనియన్’ చిత్రాల్లో ఈ కుక్కలు నటించాయి. అవి ఎంతగా ప్రేక్షకాదరణను పొందాయో మీకు తెలిసిందే. మరోసారి తాజా చిత్రం ద్వారా ప్రేక్షకులను నవ్వించనున్నాయి. ఈ సినిమా ద్వారా కేవలం ప్రేక్షకులను నవ్వించాలని మాత్రమే అనుకోవడంలేదు. కంటతడి పెట్టించే సన్నివేశాలు కూడా ఉంటాయి. అయితే ఎటువంటి ప్రయోగాల జోలికి వెళ్లడంలేదు. రోహిత్‌శెట్టితో కలిసి రెండుమూడు సినిమాలు చేశాం. అయితే వాటి ప్రభావం తాజా సినిమాలో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నాం. మా సినిమాపై దర్శకుడు రాజుహిరానీ ప్రభావం కాస్త కనిపిస్తుంది. ఆయన చిత్రాల్లో వినోదం, భావోద్వేగాలు, సందేశాలు ఎలా ఉంటాయో మా సినిమాలో కూడా ఆ అంశాలన్నీ ఉండేలా జాగ్రత్త పడుతున్నామ’న్నారు.