
బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి తొలి భార్య హెలెన ల్యూక్ కన్నుమూసింది. అమెరికాలోనే చనిపోయినట్లు ఈమె ఫ్రెండ్, నటి కల్పన అయ్యర్ ధ్రువీకరించింది. ఇండో-అమెరికన్ సిటిజన్ అయిన హెలెన్.. గతంలో పలు హిందీ సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే మిథున్ చక్రవర్తిని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నాలుగు నెలలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత ఎవరి దాని వాళ్లు చూసుకున్నారు.
(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)
మిథున్ చక్రవర్తితో పెళ్లి గురించి అప్పట్లో ఓసారి మాట్లాడిన హెలెన్.. తనని మిథున్ బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేసుకున్నాడని, తర్వాత అతడి నిజస్వరూపం బయటపడటంతో విడిపోయానని చెప్పింది. ఈమె విడాకులు ఇచ్చేసిన తర్వాత యోగిత బలిని మిథున్ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత అమెరికా వెళ్లిపోయిన హెలెన్.. అక్కడి ఉండిపోయింది. తాజాగా ఈమె మరణవార్త తెలిసి పలువురు నెటిజన్లు సంతాపం తెలియజేస్తున్నారు.
అయితే చనిపోవడానికి కొన్ని గంటల ముందే హెలెన్.. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. 'ఫీలింగ్ వీర్డ్. మిక్స్‌డ్ ఎమోషన్స్ అండ్ నో క్లూ' అని రాసుకొచ్చింది. అయితే ఈమె తన అనారోగ్య సమస్యల గురించే ఇలా పరోక్షంగా ప్రస్తావించిందని, కానీ అకస్మాత్తుగా మరణించడం మాత్రం షాక్‌కి గురిచేసిందని ఆమె స్నేహితులు అంటున్నారు. ఈమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment