పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌ | Bollywood Actress Sonnalli Seygall Welcomes Her First Child, a Baby Girl | Sakshi
Sakshi News home page

Sonnalli Seygall: తల్లయిన హీరోయిన్‌.. చేతిలో బీర్‌ బాటిల్స్‌కు బదులుగా ఇకపై పాల సీసాలు

Published Thu, Nov 28 2024 5:27 PM | Last Updated on Thu, Nov 28 2024 6:52 PM

Bollywood Actress Sonnalli Seygall Welcomes Her First Child, a Baby Girl

బాలీవుడ్‌ నటి సోనాలి సెగల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోనాలి టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. సోనాలి సెగల్‌- అశేష్‌ సజ్నాని దంపతులకు కూతురు పుట్టింది. ఇది వారికెంతో సంతోషకరమైన సమయం. నవంబర్‌ 27న సాయంత్రం సోనాలి బిడ్డకు జన్మనిచ్చింది అని రాసుకొచ్చారు.

బీర్‌ బాటిల్స్‌కు బదులు పాల సీసాలు
కాగా సోనాలి ఈ ఏడాది ఆగస్టు 16న తన ప్రెగ్నెన్సీని బయటపెట్టింది. బీర్‌ బాటిల్స్‌ పట్టుకునే చేతిలో ఇకపై పాలడబ్బాలు పట్టుకునే సమయం ఆసన్నమైంది. అశేష్‌ జీవితంలో మార్పు మొదలుకానుంది. నా విషయానికి వస్తే ఇప్పటివరకు నా ఒక్కదానికోసమే తిన్నాను, ఇప్పుడేమో ఇద్దరికోసం తింటున్నాను. 

గతేడాది పెళ్లి
మా కుక్కపిల్ల కూడా రాబోయే బేబీతో ఎలా ఆడుకోవాలా? అని ఆలోచిస్తోంది. డిసెంబర్‌లో డెలివరీ డేట్‌ ఉంది అని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా చెప్పుకొచ్చింది. కాగా హీరోయిన్‌ సోనాలి, రెస్టారెంట్‌ యజమాని అశేష్‌ ఐదేళ్లపాటు డేటింగ్‌ చేశారు. గతేడాది జూన్‌లో సిక్కు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

సినిమా
సినిమాల విషయానికి వస్తే సోనాలి సెగల్‌.. ప్యార్‌ కా పంచనామా సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వెడ్డింగ్‌ పులావ్‌, ప్యార్‌ కా పంచనామా 2, హైజాక్‌, జై మమ్మీదీ, జో తేరా హై వో మేరా హై చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె చేతిలో బ్లాక్‌ కరెన్సీ, నూరని చెహ్రా, బూండి రైతా సినిమాలున్నాయి.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement