రెహానా సుల్తాన్.. అప్పట్లో ఈ పేరు ఒక సంచలనం.. సినిమాల్లో నటించడానికి అమ్మాయిలు సంకోచిస్తున్న సమయంలో రెహానా ఏకంగా బోల్డ్ సన్నివేశాల్లో యాక్ట్ చేసింది. హద్దుల్లేకుండా, సరిహద్దులు గీసుకోకుండా విచ్చలవిడిగా నటించింది. తన అందచందాలను చూసి కుర్రకారు వెర్రెక్కిపోయారు. కానీ శృంగార సన్నివేశాలతో వచ్చే గుర్తింపు కొంతకాలమే అని రెహానా ఆలస్యంగా తెలుసుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఆమె ప్రస్తుతం కడుపేదరికంలో బతుకు బండి లాగుతోంది. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆమె కెరీర్ సడన్‌గా పాతాళానికి ఎందుకు కూలబడిపోయింది? స్టార్ స్టేటస్ నుంచి సైడ్ క్యారెక్టర్ చేసే స్థాయికి ఎలా పడిపోడియింది? ఈ కథనంలో చదివేద్దాం..
తొలి సినిమాలోనే బోల్డ్‌గా..
1950 నవంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో పుట్టి పెరిగింది రెహానా సుల్తాన్. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండటం, అందుకు కావాల్సిన లక్షణాలన్నీ తనలో ఉండటంతో 1967లో ఫిలిం స్కూల్(ఎఫ్‌టీఐఐ)లో శిక్షణ తీసుకుంది. అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే నేరుగా వెండితెరపై వాలిపోయింది. తొలి సినిమాకే బోల్డ్ సన్నివేశాల్లో నటించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. చేతన చిత్రంలో రెహానా వేశ్యగా నటించింది. ఈ సినిమాలో ఆమె నటనకు నూటిని నూరు మార్కులు పడ్డాయి. అవకాశాలు తలుపుతట్టాయి. తను చేసిన రెండో సినిమా దస్తక్‌తో రెహానా దశ తిరిగిపోయింది.
అన్నీ బోల్డ్ ఆఫర్లే
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకోవడంతోపాటు పారితోషికాన్ని పెంచేసి వరుస సినిమాలు చేసింది. కొంతకాలం పాటు ఇండస్ట్రీని తన మైకంలో పడేసిన ఆమె హవా తర్వాత నెమ్మదిగా తగ్గిపోసాగింది. అన్ని రకాల సినిమాలు చేయాలనుకున్న ఆమెకు కేవలం బోల్డ్ చిత్రాలు మాత్రమే రాసాగాయి. సినిమాలో పాత్ర డిమాండ్ చేసినందుకే బోల్డ్ సన్నివేశాలు చేసింది తప్పితే పూర్తిగా అటువంటి సినిమాలే చేయాలని ఆమె అనుకోలేదు.
దర్శకుడితో వివాహం.. సినిమాలకు దూరం
కానీ దర్శకనిర్మాతలు కేవలం బోల్డ్ కంటెంట్‌తోనే బోలెడన్ని సినిమాలు ఆఫర్ చేశారు. చాలావాటిని తిరస్కరించింది. కొన్నింటిని కాదనలేక చేసుకుంటూ ముందుకు వెళ్లింది, అందులో కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేసింది. 1984లో చేతన సినిమాతో తనకు హీరోయిన్‌గా జీవితాన్నిచ్చిన దర్శక రచయిత బి.ఇషారాను పెళ్లాడింది. తర్వాత ఆమె సినిమాల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. డేర్ అండ్ డాషింగ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రెహానా అతి త్వరగా వెండితెరపై కనుమరుగైపోయింది.
అవకాశాలిచ్చేవాళ్లు ఉన్నారా?
'కొందరు నిర్మాతలు నా దగ్గరకు తీసుకువచ్చే కథలు వింటే చాలా కోపమొచ్చేది. బాత్ టబ్‌లో స్నానం చేయాలని, వర్షంలో తడవాలని, ఇంతకంటే దారుణమైనవి కూడా చెప్పేవారు. కానీ ఎంతమంది భారతీయుల ఇళ్లలో బాత్‌టబ్ ఉంది? ఎందుకని ఇలాంటి సన్నివేశాలు సహజంగా కాకుండా ఇలా బలవంతంగా రాసుకుంటున్నారని తిట్టి రిజెక్ట్ చేశాను. సినిమాలకు ఎందుకు దూరమయ్యానో నాకే తెలియడం లేదు. నాకు తిరిగి నటించాలని ఉంది. కానీ అవకాశాలిచ్చేవాళ్లు ఉన్నారా?' అని 2012లో అడిగింది రెహానా. నోరు తెరిచి అడిగినందుకో ఏమో మరి ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సినిమా(ఇంకార్) మాత్రమే చేసింది.
కడు పేదరికంలో హీరోయిన్
2012లో రెహానా భర్త ఇషారా మరణించడంతో ఒంటరిగా కాలం వెళ్లదీస్తోంది. ఒకప్పుడు మంచి హోదాలో బతికిన ఆమె ప్రస్తుతం పేదరికంలో మగ్గుతోంది. ఓపక్క వృద్దాప్య సమస్యలు, మరోపక్క ఆర్థిక కష్టాలతో హీరోయిన్ సతమతమవుతోందని 2018లో వార్తలు వెలువడ్డాయి. సినీ అండ్ టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్ ఇచ్చే భత్యంతోనే ఆమె పూట గడుస్తోందనేది సదరు వార్తల సారాంశం.
చదవండి: ఇద్దరు పిల్లలున్నారన్న ఈషా రెబ్బా.. పెళ్లి కాకుండా అదెలాగబ్బా అని ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment