
చిత్ర పరిశ్రమలో హీరోలతో పోలిసే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువ. అయితే కొంతమంది హీరోయిన్లకు ఇందులో మినహాయింపు ఉంటుంది. నయనతార, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె లాంటి స్టార్ హీరోయిన్లు హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటున్నారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా నటీమణుల హవా కొనసాగుతుంది. సీరియల్స్ హీరోయిన్లు కూడా ఈ మధ్యకాలంలో తెగ ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్లను మించిన క్రేజ్ తెచ్చుకున్న భామలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో జన్నత్ జుబేర్ రహ్మానీ(Jannat Zubair Rahmani) ఒకరు. ఆమె వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కానీ ఆస్తుల విలువ మాత్రం దాదాపు 250 కోట్ల వరకు ఉంటుంది. వినడానికి కాస్త షాకింగ్‌గా ఉన్నా.. ఇది వాస్తవమే.

షారుఖ్‌ని మించిన అభిమానం..
బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్‌కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 46 మిలియన్ల ఫాలోవర్స్‌తో షారుఖ్ అగ్రస్థానంలో ఉండేవాడు. కానీ జన్నత్ ఇన్‌స్టా ఫాలోవర్స్‌లో షారుఖ్‌ని మించిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాలో 49.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 23 ఏళ్లకే ఇంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం గొప్ప విషయమే. ఆమెకు ఉన్న క్రేజ్ కారణంగా బుల్లితెరపై నటించే అవకాశాలు వస్తున్నాయి.

ఎపిసోడ్‌కి 18 లక్షలు
జన్నత్ వయసు ప్రస్తుతం 23 ఏళ్లు. ఆగస్ట్ 29, 2001లో ముంబైలో జన్మించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎన్నో టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించింది. హిచ్కీ, వాట్ విల్ పీపుల్ సే.. సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సీరియల్స్ తో పాటు పలు టీవీ షోలో నటించి మెప్పిస్తుంది.

ఖత్రోన్ కే ఖిలాడీ షోలో పాల్గొన్న జన్నత్.. ఒక్కో ఎపిసోడ్‌కి అత్యధికంగా రూ. 18 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. ఇక సీరియల్ కోసం ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 2 లక్షల వరకు తీసుకుంటుందట. అలాగే సోషల్ మీడియాలో ఆమె ఒక్కో పోస్టుకు 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఇలా ఏడాదికి 25 కోట్ల సంపాదనతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది జన్నత్. అంతేకాదు పలు వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టిందట. మీడియా కథనాల ప్రకారం జన్నత్ ఆస్తుల విలువ దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుంది. అందంలోనే కాను ఆస్తుల విషయంలోనూ ఈ బ్యూటీ తగ్గేదే లే అన్నట్లుగా దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment