
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మన దేశానికి చెందిన 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకాన్ని దెబ్బతీయడమే లక్ష‍్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటికే ఇక్కడికి టూర్ కోసం వచ్చినవాళ్లు, త్వరలో వెళ్దామని అనుకున్నవాళ్లు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ నటుడు పహల్గామ్ వెళ్లారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు అతుల్ కులకర్ణి.. ఆదివారం పహల్గామ్ వెళ్లారు. అందరూ కశ్మీర్ తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. తాను ధైర్యంగా వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటో పోస్ట్ చేశారు.
(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి)

'ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ భయం కంటే ధైర్యం ఎక్కువ. ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ ద్వేషాన్ని ప్రేమ ఓడిస్తుంది. కశ్మీర్ పోదాం పదండి. సింధు, జీలం నదుల్ని సందర్శిద్దాం పదండి. నేను వచ్చాను. మీరు కూడా రండి' అని అతుల్ కులకర్ణి చెప్పుకొచ్చారు.
జయం మనదేరా, ఆంధ్రావాలా, చంటి, గౌరీ, లీలా మహల్ సెంటర్, పంజా, ద ఘాజీ, మజిలీ, వైల్డ్ డాగ్ తదితర తెలుగు సినిమాల్లో ఈయన నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, ఒరియా, మరాఠీ భాషల్లో తీసిన పలు చిత్రాల్లోనూ ఈయన నటించడం విశేషం.
(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్)