బిజినెస్‌లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్! | Bhumika Chawla Started hotel Business In Goa Video Goes Viral | Sakshi
Sakshi News home page

Bhumika Chawla: వ్యాపారంలోకి భూమిక ఎంట్రీ.. అదేంటో తెలుసా?

Published Sun, Dec 31 2023 11:42 AM | Last Updated on Sun, Dec 31 2023 12:05 PM

Bhumika Chawla Started hotel Business In Goa Video Goes Viral - Sakshi

టాలీవుడ్ సినిమాతోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ భూమిక చావ్లా. యువకుడు సినిమాతో అరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ ఆ తర్వాత ఖుషీ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. అనంతరం మిస్సమ్మ, సింహాద్రి, వాసు, ఒక్కడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

మిస్సమ్మ చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది. ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా చేసిన భామ.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్‌తో మెప్పిస్తోంది. ఎంఎస్ ధోని చిత్రంలో సుశాంత్‌కు అక్కగా నటించి మెప్పించింది. ప్రస్తుతం కంగనా రనౌత్ నటిస్తోన్న ఎమర్జన్సీ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనుంది. 

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉండే భూమిక చావ్లా.. తాజాగా వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. గోవాలో కొత్త హోటల్‌ను ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ నటికి అభినందనలు తెలుపుతున్నారు. భూమిక హోటల్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement