Bhumika Chawla: 'I Felt Bad When I Signed Jab We Met and Then It Didn't Happen' - Sakshi
Sakshi News home page

Bhumika Chawla: ఆ సినిమా కోసం ఏడాదిపాటు మరే మూవీ ఒప్పుకోలేదు.. బాలీవుడ్‌లో చేదు అనుభవం!

Published Wed, Apr 26 2023 11:03 AM | Last Updated on Wed, Apr 26 2023 11:33 AM

Bhumika Chawla: I Felt Bad When I Signed Jab We Met and It Did not Happen - Sakshi

తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా వెలుగొందిన భూమిక సౌత్‌ సినిమాల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ నటించింది. హిందీలో తొలి చిత్రంతోనే గుర్తింపు పొందిన  తనకు ఆ తర్వాత చేదు అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొంది హీరోయిన్‌. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'హిందీలో నా తొలి చిత్రం తేరే నామ్‌. ఇందులో సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించాను. ఈ మూవీ హిట్‌ కావడంతో నాకు హీరోయిన్‌గా మంచి మంచి అవకాశాలు వచ్చాయి. సాధారణంగానే నేను ఆచితూచి సినిమాలు ఒప్పుకుంటాను. అలా తేరే నామ్‌ తర్వాత నాకు ఒక పెద్ద సినిమా ఆఫర్‌ వచ్చింది. ఓకే చేశా.

కానీ సడన్‌గా నిర్మాతలు మారడంతో హీరోను, నన్ను మార్చేశారు. సినిమా టైటిల్‌ కూడా చేంజ్‌ చేశారు. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదేమో! ఏది జరగాలనుంటే అది జరుగుతుందనుకున్నాను. కానీ ఆ సినిమా కోసం మరే మూవీ ఒప్పుకోకుండా ఏడాదిపాటు ఎదురుచూశాను. చివరికి నిరాశే ఎదురవడంతో వేరే సినిమాలకు సైన్‌ చేశాను. కానీ తేరే నామ్‌ వంటి పెద్ద హిట్‌ నాకు బాలీవుడ్‌లో మళ్లీ దొరకలేదు. 

నాకు మరీ బాధేసిన సంఘటన ఏంటంటే.. జబ్‌ వి మెట్‌ సినిమాకు మొదట నేను సంతకం చేశాను. నాకు జోడీగా బాబీ డియోల్‌ అన్నారు, తర్వాత షాహిద్‌ కపూర్‌ అన్నారు. కట్‌ చేస్తే షాహిద్‌ కపూర్‌- కరీనా కపూర్‌ సినిమాలో ఉన్నారు. నన్ను తీసేశారు. మున్నా భాయ్‌ ఎంబీబీఎస్‌ సినిమాకు కూడా సంతకం చేశాను, కానీ ఇక్కడ కూడా నన్ను తీసేశారు. మణిరత్నం కన్నతిల్‌ ముత్తమిట్టల్‌ సినిమాలో కూడా నేనే హీరోయిన్‌ అని చెప్పి చివరకు హ్యాండిచ్చారు' అని చెప్పుకొచ్చింది. కాగా భూమిక ఇటీవల రిలీజైన కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement