Actress Bhumika Chawla Shocking Comments On Movie Offers And Makers - Sakshi
Sakshi News home page

Bhumika Chawla: 'నా కోసం ముంబై వచ్చిన మేకర్స్‌ చాలామంది ఉన్నారు'

Published Tue, Nov 16 2021 12:27 PM | Last Updated on Tue, Nov 16 2021 12:56 PM

Actress Bhumika Chawla Shocking Comments - Sakshi

Actress Bhumika Chawla Shocking Comments: యువకుడు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన భూమిక.. ఖుషీ సినిమాతో స్టార్‌ స్టేటస్‌ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా ఒక్కడు, సింహాద్రి వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలతో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. హీరోయిన్‌గా మాంచి ఫామ్‌లో ఉన్నప్పుడే 2007లో నిర్మాత భరత్ ఠాకూర్‌ని పెళ్లాడిన భూమిక..ఆ తర్వాత హీరోయిన్‌ రోల్స్‌కి గుడ్‌బై చెప్పింది. రీఎంట్రీ అనంతరం అక్క, తల్లి , వదిన వంటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రలతో అలరిస్తుంది.

అయితే సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఇంతవరకు ఆమెకు సరైన పాత్ర దొరకలేదనే చెప్పాలి. ’ఎం.సి.ఎ’ ‘పాగల్’, ‘సీటిమార్’ వంటి సినిమాలో ఓకే అనిపించినా సెకండ్ ఇన్నింగ్స్‌కు బూస్టప్‌ను ఇవ్వలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం భూమిక ఎక్కువగా సెలబ్రిటీలతో కలవదని, ప్రైవేటు పార్టీలకు సైతం వెళ్లదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన ఆమె..'పార్టీలకు వెళ్తే తప్పా మంచి రోల్స్‌ రావా? అలాంటి మాటలను నేను ఎంకరేజ్‌ చేయను. ఫిల్మ్‌ మేకర్స్‌తో రోజూ టచ్‌లో ఉంటేనే అవకాశాలు వస్తాయన్నది భ్రమ మాత్రమే. నా కోసమే పాత్రలు రాసి, నా కోసం ముంబై వచ్చిన మేకర్స్‌ చాలా మంది ఉన్నారు' అని చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement