రామ్ పోతినేని స్కంద.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే? | 'Skanda' Movie Day 1 Box Office Collection In World Wide | Sakshi
Sakshi News home page

Skanda Movie Collections: స్కంద మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

Published Fri, Sep 29 2023 12:52 PM | Last Updated on Fri, Sep 29 2023 1:54 PM

Ram Pothineni Skanda First Day Collections In World Wide - Sakshi

రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో వచ్చిన తాజా చిత్రం స్కంద. ఈ మూవీలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈనెల 28న థియేటర్లలో వచ్చిన ఈ  చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. పక్కా మాస్‌ మూవీగా రూపొందించిన ఈ మూవీ తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.

తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.18.2 కోట్ల వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.8.62 వసూళ్లు రాబట్టింది. అయితే కేవలం మాస్ ఆడియన్స్‌ మెప్పించేలా ఉన్న ఈ చిత్రం నైజాంలో అత్యధికంగా రూ.3.23 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్‌గా చూస్తే రామ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ రాబ‌ట్టిన మూవీగా స్కంద నిలిచింది. కాగా.. ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ప్రిన్స్‌, ద‌గ్గుబాటి రాజా కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు రామ్‌, బోయ‌పాటి శ్రీను ప్ర‌క‌టించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement