
తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరో ప్రిన్స్. బస్ స్టాప్, నేను శైలజ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ప్రిన్స్ రామ్, బోయపాటి శ్రీను సినిమాలో విలన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.
అఖండ బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాలో రామ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రిన్స్ విలన్ రోల్‌లో నటిస్తున్నాడు. పవర్ ఫుల్ విలనిజాన్ని తెరమీద చూపించడంలో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. రామ్, బోయపాటి సినిమాలో ప్రిన్స్ రోల్ సినిమాకు హైలెట్ కానుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment