మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను- ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే! వీరి కాంబినేషన్‌లో వచ్చిన తాజా ఊరమాస్ చిత్రం స్కంద. ఈ మూవీలో రామ్ నటనకు, లుక్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. తన యాక్షన్‌కు థియేటర్స్‌లో విజిల్స్ వేస్తున్నారు. మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రంలో రామ్ పోతినేనికి చెల్లిగా ఓ కొత్త అమ్మాయి నటించింది. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఈమె ఎవరో కచ్చితంగా తెలిసే ఉంటుంది. రామ్‌కు చెల్లిగా నటించిన ఆమె పేరు అమృత చౌదరి.
ఈమె పక్కా తెలుగమ్మాయి. తనది భీమవరం. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అమృత చౌదరి కాలేజీ డేస్‌లోనే యాక్టింగ్‌లో తన టాలెంట్ చూపించింది. పలు షార్ట్ ఫిలింస్‌లో నటించిన ఈ బ్యూటీ కవర్ సాంగ్స్‌లోనూ యాక్ట్ చేసింది. ప్రస్తుతం సినీ పరిశ్రమలో నటిగా ట్రై చేస్తోంది. ఈ క్రమంలో స్కంద మూవీలో హీరోకి చెల్లెలిగా నటించింది. ఈ ఛాన్స్‌తో ఆమె దశ తిరిగిపోవడం ఖాయం అంటున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ ఏదో ఒక ఫోటో, వీడియోతో అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది. హీరోయిన్‌కు తానేం తక్కువ కాదన్నట్లుగా అందాలు ఆరబోస్తోంది.
చదవండి: తేజపై విరుచుకుపడ్డ నాగ్.. జైలు శిక్ష తక్కువే.. నేరుగా ఇంటికి పంపించేయడమే..
Comments
Please login to add a commentAdd a comment