అల్లు అర్జున్ 'సరైనోడు' ప్రీ లుక్ పోస్టర్ | allu arjun sarainodu pre look poster released | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్ 'సరైనోడు' ప్రీ లుక్ పోస్టర్

Published Fri, Jan 22 2016 2:25 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

అల్లు అర్జున్ 'సరైనోడు' ప్రీ లుక్ పోస్టర్ - Sakshi

అల్లు అర్జున్ 'సరైనోడు' ప్రీ లుక్ పోస్టర్

ఇప్పటి వరకు ఆడియో రిలీజ్ పోస్టర్స్, సినిమా రిలీజ్ పోస్టర్స్ మాత్రమే వచ్చేవి.., కాని అల్లు అర్జున్ సరైనోడు సినిమాతో మరో కొత్త సాంప్రదాయానికి తెర తీశాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఆ సినిమా ప్రీలుక్ పోస్టర్ను రిలీజ్ చేశాడు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత బన్నీ చేస్తున్న సరైనోడు సినిమా పై భారీ అంఛనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా చిత్రయూనిట్ మరింత ఆసక్తి రేకెత్తించేలా ప్రమోషన్ను ప్రారంభించింది.

పోస్టర్లో ఫేస్ చూపించకపోయినా అది బన్నీ చెయ్యి అని అర్థమయ్యేలా ప్రీ లుక్ పోస్టర్ను డిజైన్ చేశారు. మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి దర్శకుడు బోయపాటి శ్రీను, ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement