రామ్‌- బోయపాటి మూవీ దసరా సర్‌ప్రైజ్.. హీరోయిన్ ఎవరంటే? | Sree leela As A Heroine In Ram Pothineni and Boyapati Sreenu Latest Movie | Sakshi
Sakshi News home page

Ram Pothineni Latest Movie: రామ్‌- బోయపాటి చిత్రంలో హీరోయిన్‌గా పెళ్లిసందడి భామ.. షూటింగ్ ఎప్పుడంటే?

Published Wed, Oct 5 2022 5:48 PM | Last Updated on Wed, Oct 5 2022 6:13 PM

Sree leela As A Heroine In Ram Pothineni and Boyapati Sreenu Latest Movie - Sakshi

రామ్ పోతినేని- బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రంపై క్రేజీ అప్‌డేట్ వచ్చింది. దసరా కానుకగా చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్స్ ఇచ్చింది చిత్రబృందం.  ఈ చిత్రం షూటింగ్ రేపటి నుంచే ప్రారంభిస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఈ సినిమాలో హీరోయిన్‍గా పెళ్లిసందడి కథానాయిక శ్రీ లీలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ సినిమాకు బీజీఎం మాస్టర్‌ ఎస్ఎస్ తమన్‌ సంగీతమందించనున్నారు. 
(చదవండి: రామ్ - బోయపాటి కాంబినేషన్.. క్రేజీ అప్ డేట్ ఆరోజే..!)

శ్రీనివాస సిల్వర్‌ స్కీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్‌ చిత్రబృందం ఏకంగా సినిమా షూటింగ్‌ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక పొలిటికల్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. ముఖ్యంగా రామ్ మాస్‌ యాక్షన్‌కు సరిపోయే స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement