
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ రెండు సూపర్ హిట్స్ అందించిన విషయం అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా రూపొందనుంది. నందమూరి బాలకృష్ణ కోసం దర్శకుడు బోయపాటి శ్రీను మరో పవర్‌ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు.
కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రస్తుతం సమాజంలోని ప్రధానమైన సమస్య ఆధారంగా బోయపాటి శ్రీను ఈ కథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2020 వేసవి చివరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తమ సంస్థ నుంచి మూడో సినిమాగా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ, కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment