‘వినయ విధేయ రామ’ నుంచి ఫ్యామిలీ సాంగ్! | Family Song From Ram Charan Vinaya Vidheya Rama | Sakshi
Sakshi News home page

Dec 1 2018 11:51 AM | Updated on Dec 1 2018 11:55 AM

Family Song From Ram Charan Vinaya Vidheya Rama - Sakshi

‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్‌ తరువాత రామ్‌ చరణ్‌.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రాబోతోన్న సంగతి తెలిసిందే. మాస్‌, యాక్షన్‌ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న బోయపాటి.. ఈసారి తన మార్క్‌ను మిస్‌ కాకుండా.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా టచ్‌ చేయబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్, ఫస్ట్‌ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. 

ఇక టీజర్‌లో రామ్‌చరణ్‌ చెప్పిన రామ్‌.. కొ..ణి..దె..ల డైలాగ్‌ ఎంత పాపులర్‌ అయిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫ్యామిలీ సాంగ్‌ను రిలీజ్‌చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సోమవారం (డిసెంబర్‌ 3) సాయంత్రం 4గంటలకు ఆ పాట (తందానే తందానే)ను విడుదల చేయనున్నారు. కియారా అద్వాణీ  హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా విడుదలకానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement