పోటీ ఎందుకు అనిపించింది! | Special chit chat with ram charan | Sakshi
Sakshi News home page

పోటీ ఎందుకు అనిపించింది!

Published Wed, Jan 9 2019 12:44 AM | Last Updated on Wed, Jan 9 2019 3:38 AM

Special chit chat with ram charan - Sakshi

‘‘ప్రతి సినిమా ఒక మంచి సినిమా అవుతుందనే స్టార్ట్‌ చేస్తాం. ఒక సక్సెస్‌ఫుల్‌ సినిమాలోని క్యారెక్టర్‌ గురించే ఆలోచిస్తే అందరి డైరెక్టర్స్‌తో సినిమాలు చేయలేం. 1980లో చూస్తే నాన్నగారు అన్ని జానర్స్‌ను రెండేళ్లలో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆర్టిస్టుగా నేనూ అలా అన్నీ చేయాలనుకుంటాను. కన్విక్షన్‌ ఉన్న డైరెక్టర్స్‌తో సెన్సిబుల్‌ సినిమాలు చేయడం కూడా ఇష్టమే. బోయపాటి గారు మంచి కన్విక్షన్‌ ఉన్న డైరెక్టర్‌. ‘వినయ విధేయ రామ’ సెట్స్‌లో నేను బాగా ఎంజాయ్‌ చేశాను’’ అని రామ్‌చరణ్‌ అన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘వినయ విధేయ రామ’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ చెప్పిన సంగతులు... 

∙నలుగురు అన్నదమ్ముల కథే ఈ ‘వినయ విధేయరామ’. ప్రతి వ్యక్తి క్యారెక్టర్లో వినయం, విధ్వంసం ఉంటాయి. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ కూడా అంతే. సంక్రాంతికి తగ్గట్లే ‘వినయ విధేయ రామ’ టైటిల్‌ ఉంది. కథకు కూడా దగ్గరగా ఉండే టైటిల్‌ ఇది. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా ఇది. ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమాతో ఈ సినిమాకు పోలికలు ఉన్నాయి అంటున్నారు కానీ నాకు అలా అనిపించలేదు. ఈ సినిమాలోని పరిస్థితులు, స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉంటాయి. ఎప్పటినుంచో ‘గ్యాంగ్‌ లీడర్‌’ లాంటి సినిమా చేయాలనుకుంటున్నాను. కానీ అది ఈ సినిమా కాదని నా అభిప్రాయం.

∙‘రంగస్థలం’ తర్వాత 15 రోజుల లోపలే ఈ సినిమా స్టార్ట్‌ చేశాం. ఇంకాస్త టైమ్‌ ఉంటే నాకు పర్సనల్‌గా ఇంకా బాగుండేది అనిపించింది. టైమ్‌ లేకపోయినా ‘రంగస్థలం’లోని చిట్టిబాబు క్యారెక్టర్‌ నుంచి ఈ సినిమాలోని రామ్‌ క్యారెక్టర్‌లో బాగానే ఒదిగిపోయాను.

∙బోయపాటిగారి సినిమాలను చూస్తే లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఆయనకు ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చిందంటేనే అది ఆయనకు ఉన్న స్ట్రెంత్‌ వల్లే. ఈ సినిమాలో యాక్షన్‌ బ్యాలెన్డ్స్‌గా ఉంటుందనే అనుకుంటున్నాను.

∙సిల్వెస్టర్‌ స్టాలోన్‌ వంటి గొప్ప నటుల సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనలా ఈ సినిమాలో నాకు  రాంబో లుక్‌ అనేసరికి కాస్త ఉత్సాహంగా అనిపించింది. ఈ లుక్‌ గురించి బోయపాటిగారు రెండేళ్ల క్రితమే చెప్పారు. ‘వినయ విధేయ రామ’కు బాడీ బిల్డింగ్‌ అవసరం అయ్యింది. అందుకే కొంతకాలం డైట్‌ ఫాలో అయ్యాను. ‘సైరా’ నిర్మాణంలో ఉపాసన పాత్ర ఏం లేదు. నా డైట్‌ విషయంలో మాత్రం ఉంది. ఈ మధ్య వైఫ్స్‌ అందరూ అదే చేస్తున్నారు (నవ్వుతూ). నేను ఎక్కువగా డైట్‌ చేయను. నార్మల్‌గా నేను ఇంట్లో బాగానే తింటాను.

∙నా పేరుతో డైలాగ్‌ చేప్పే ముందు, ఆ తర్వాత పెద్ద సీన్స్‌ ఉన్నాయి. ఆ కాంబినేషన్లో నాకు పెద్ద సమస్యగా అనిపించలేదు. నాన్నగారు(చిరంజీవి) బోయపాటిని పిలిచి ఓ జోక్‌ వేశారు. ఎవరి పర్మిషన్‌ తీసుకుని ఈ పేరు పెట్టారు అని (నవ్వుతూ). నాన్నగారు ఈ సినిమా ఈవెంట్లో ఆ డైలాగ్‌ను నాకన్నా పదిరెట్లు బాగా చెప్పారనిపించింది. షాకింగ్‌గా అనిపించింది.

∙ప్రతి సినిమా ‘రంగస్థలం’ లానే రావాలంటే కష్టం అవుతుంది. కథ విన్నప్పుడు ఆడియన్‌గా నాకు ఆసక్తికరంగా అనిపించాలి. దర్శకుడు క్లారిటీగా ఉన్నారనిపిస్తే తప్పకుండా చేస్తాను. ‘రంగస్థలం’లాంటి మంచి సినిమా చేసినప్పుడు ఆర్టిస్టుగా నా కాన్ఫిడెన్స్‌లో మార్పు వచ్చింది. కానీ అది మరింత పెద్దగా అని చెప్పలేను.

∙గతేడాది సమ్మర్లో రిలీజైన ‘రంగస్థలం, భరత్‌ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాల కలెక్షన్స్‌ విషయంలో చిన్న డిస్ట్రబెన్సెస్‌ వచ్చాయి. అది అవరసమా? అనిపించింది. హ్యాపీగా అందరం మంచి సినిమాలు చేశాం. నిర్మాతలకు మంచి డబ్బులు వచ్చాయి. ఈ కలెక్షన్స్‌ విషయంలో పోటీ ఎందుకు? అనిపించింది. పోటీ ఉంటే క్యారెక్టర్స్‌ విషయంలో ఉండాలి. సినిమాలు ఇంకా బాగా చేయాలనే విషయంలో పోటీ ఉండాలి. నిర్మాతలకు డబ్బులు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్‌ హ్యాపీగా ఉన్నారు. మధ్యలో అభిమానులు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిర్మాతగా కన్నా ఫ్యాన్స్‌ ఈగర్‌గా ఉంటారు. నా వైపు నుంచి నేను చెప్పాను. కలెక్షన్స్‌ విషయంలో అంత ప్రెజర్‌ లేదు అని. రేపు నిర్మాతలు పెట్టుకుంటే అది వారి ఇష్టం. ఎందుకంటే ఇది వారి సినిమా. 

∙నాలో మార్పు వచ్చింది అంటున్నారు. అయితే నాకు పెద్ద మార్పేం అనిపించడంలేదు. సందర్భాన్ని బట్టి రియాక్ట్‌ అవుతుంటాను. మహేశ్, తారక్‌ వంటి వాళ్లతో నేను బాగా కలిసిపోతాను. సోషల్‌æమీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ విషయం బయటకు తెలుస్తోంది. నాన్నగారు కూడా చెన్నైలో ఉన్నప్పుడే అందర్నీ కలిసేవారు. అదే ఫాలో అవుతున్నాను. 

∙నా స్టాఫ్‌ను బాగా చూసుకుంటే నాకు బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇస్తారని నా ఆలోచన. అందుకే నా టీమ్‌కి బహుమతులు ఇవ్వాలనుకుంటాను. నిర్మాతగా, యాక్టర్‌గా ఉంటడం వల్ల చిన్న స్ట్రెస్‌ ఉంటుంది. ఈ సినిమా, ‘సైరా’ రిలీజ్‌ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు 150పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెట్టాలనుకుంటున్నాను.

∙దానయ్యగారు గట్స్‌ ఉన్న నిర్మాత. తివ్రిక్రమ్‌గారితో దానయ్యగారి నిర్మాణంలో నాన్నగారు ఓ సినిమా చేస్తారు. ఈ సినిమా కంటే ముందు కొరటాల శివగారితో సినిమా చేస్తారు నాన్నగారు. నేనూ శివగారు చేయాల్సింది. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వల్ల నాన్నగారితో శివగారు చేస్తున్నారు. లేటైనా శివగారితో నా సినిమా ఉంటుంది.

∙రాజమౌళిగారు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రాజెక్ట్‌ గురించి చెప్పినప్పుడు ‘ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా?’ని నేను, ఎన్టీఆర్‌ షాకయ్యాం. నేను సైలెంట్‌గా ఉన్నాను. తారక్‌ బాగా ఎగై్జటయ్యాడు. ఈ సినిమా గ్రాఫిక్స్‌ కోసం యు.ఎస్‌. వెళ్లాం.

∙కొణిదెల ప్రొడక్షన్స్‌లో వేరే వారితో సినిమాలు చేయాలనుకోవడం లేదు. నాన్నగారి కోసమే అనుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీలో నేను మా నాన్నగారికి ఇచ్చే రెమ్యూనరేషన్‌ ఎవ్వరూ ఇవ్వలేరని చెప్పగలను. ఈ సినిమా ప్రీ–రి లీజ్‌ ఈవెంట్‌లో టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ‘మీలో రాజకీయ నాయకుడికి ఉండ వలసిన లక్షణాలు ఉన్నాయని కితాబు ఇచ్చారు కదా! అలాంటి ఆలోచన మీకేమైనా ఉందా?’ అని చరణ్‌ని అడిగితే, ‘‘ఆయన యాక్టింగ్‌ చేయకూడదు. నేను పాలిటిక్స్‌ చేయకూడదు’’ అన్నారు. 

‘సైరా:  నరసింహారెడ్డి’ విషయంలో అన్నీ కరెక్ట్‌గా జరుగుతున్నాయని చెప్పడం లేదు. పెద్ద సినిమాలు చేసేటప్పుడు కొన్నిసార్లు డేట్స్‌ కావొచ్చు, ప్రొడక్షన్‌లో కావొచ్చు... ఇలా చాలా కారణాలు ఉంటాయి.  ‘రంగస్థలం’ సినిమా సెట్‌ను రీ డెకరేట్‌ చేసి ‘సైరా’కు  వాడుకుందాం  అనుకున్నాం. ల్యాండ్‌ ఓనర్‌కు ఏదో ప్రాబ్లమ్‌ ఉండి ఆపారు అంతే. అనుకున్న బడ్జెట్‌తో జరుగుతోంది. ఓవరాల్‌గా బాగానే జరుగుతోంది. చెప్పుకోదగ్గ సమస్య లేదు. రెండు నెలల్లో షూటింగ్‌ పూర్తవుతుంది. రీ షూట్స్‌ జరగడంలేదు. రీ షూట్స్‌ చేసేంత డబ్బు  లేదు. దసరాకు రిలీజ్‌ కావొచ్చు.  200 కోట్లకు పైగా బడ్జెట్‌ ఉంటుంది.   చేయాల్సినౖ టెమ్‌లోనే చేస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement