
‘నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా!’, ‘నీ గేటు దాటలేనన్నావ్... దాటా!’, నీ పవర్ దాటలేనన్నావ్...దాటా!’, ‘ఇంకేంటి దాటేది...!’ అనే డైలాగ్స్‌తో విడుదలైంది రామ్ కొత్త సినిమా టీజర్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవన్ కుమార్, జీ స్టూడియోస్ సౌత్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోమవారం (మే 15) హీరో రామ్ బర్త్ డే సందర్భంగా ‘ఫస్ట్ థండర్’ పేరుతో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
సదర్ ఉత్సవాల నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్ విజువల్స్‌లో ‘కొట్టర కొట్టు... నరాలు కట్టు! బొక్కలు చూర అయ్యేటట్టు..’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ టీజర్‌లో వినిపించింది. ‘‘మా హీరో రామ్ మేకోవర్, యాక్టింగ్, బోయపాటి శ్రీనుగారి డైరెక్షన్, తమన్ రీ రికార్డింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో టైటిల్, ఇతర వివరాలు వెల్లడిస్తాం. దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment