Boyapati
-
'కొట్టర కొట్టు.. బొక్కలు చూర అయ్యేటట్టు..' అదిరిపోయిన టీజర్
‘నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా!’, ‘నీ గేటు దాటలేనన్నావ్... దాటా!’, నీ పవర్ దాటలేనన్నావ్...దాటా!’, ‘ఇంకేంటి దాటేది...!’ అనే డైలాగ్స్‌తో విడుదలైంది రామ్ కొత్త సినిమా టీజర్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవన్ కుమార్, జీ స్టూడియోస్ సౌత్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. సోమవారం (మే 15) హీరో రామ్ బర్త్ డే సందర్భంగా ‘ఫస్ట్ థండర్’ పేరుతో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సదర్ ఉత్సవాల నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్ విజువల్స్‌లో ‘కొట్టర కొట్టు... నరాలు కట్టు! బొక్కలు చూర అయ్యేటట్టు..’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ టీజర్లో వినిపించింది. ‘‘మా హీరో రామ్ మేకోవర్, యాక్టింగ్, బోయపాటి శ్రీనుగారి డైరెక్షన్, తమన్ రీ రికార్డింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో టైటిల్, ఇతర వివరాలు వెల్లడిస్తాం. దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
వైఎస్సార్సీపీలో కొనసాగుతా
తిరుపతి మంగళం: తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని ముత్యాలరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బోయనపాటి మమత స్పష్టం చేశారు. మంగళవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. క్రమశిక్షణ.. విశిష్ట వ్యక్తిత్వం..ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపించే ఉద్యమ నాయకుడు భూమన కరుణాకరరెడ్డి సారథ్యంలో పనిచేస్తానని చెప్పారు. చిన్నతనం నుంచే పోరాట పటిమతో నాయకత్వ లక్షణాలను అలవరుచుకుని నాటి కాంగ్రెస్ నుంచి నేటి వైఎస్సార్ సీపీ వరకూ వెన్నెముకలా ఉంటూ నడిపిస్తున్న నాయకుడు భూమన తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కులమతాలకతీతంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగే ఆయన నేతృత్వంలో పనిచేయడం సంతోషకరమన్నారు. మహిళలకు పార్టీలో ప్రత్యేక గౌరవాన్ని కల్పిస్తారని, అందుకు తనకు రాష్ట్ర పదవిని ఇవ్వడమే నిదర్శనమని అన్నారు. అనునిత్యం ప్రజల మధ్య ఉండాలనే కాంక్షతో గడప గడపకూ వెళ్లి సమస్యలను తెలుసుకుంటూ శ్రమిస్తున్న కరుణాకరరెడ్డి సారథ్యాన్ని తాను కోరుకుంటానని తెలిపారు. నాలుగు నెలలుగా వ్యక్తిగత కారణాలతో పార్టీకి దూరంగా ఉన్నానన్నారు. అంతేతప్ప పార్టీని వీడిపోలేదని స్పష్టం చేశారు. పదవికి రాజీనామా చేశానే తప్ప పార్టీకి కాదన్నారు. కొందరు తాను టీడీపీలోకి వెళుతున్నానని చేస్తున్న ప్రచారం సరికాదని తోసిపుచ్చారు. ప్రాణమున్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. -
బోయపాటిలో రెండోవైపు చూడండి!
‘చూడు... ఒకవైపే చూడు. రెండోవైపు చూడాలనుకోకు... మాడి మసైపోతావ్!’ – దర్శకుడు బోయపాటి సిన్మాలంటే ఇలాంటి పంచ్ డైలాగులు, మాస్ హీరోయిజమ్ గుర్తుకొస్తాయి. కానీ, ఫస్ట్ టైమ్ ఆయన తన సిన్మాలో హీరోని సాఫ్ట్‌గా చూపిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘జయ జానకి నాయక’. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్... దాన్ని అనుకుని హీరోయిన్ రకుల్... రోడ్డుపై కూర్చున్న హీరో... బోయపాటి దర్శకత్వంలో రెండోవైపును చూడండి! ఆయన అభిమానులకు ఈ లుక్ కాస్త సర్ప్రైజ్ ఇస్తే, ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకుంది. ఈ సిన్మాలో బోయపాటి మార్క్ యాక్షన్ కూడా ఉందట! ప్రస్తుతానికి దాన్ని దాచేశారు. ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేయాలనుకుంటున్నారు. ప్రగ్యా జైశ్వాల్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్
హీరోయిన్గా నటిస్తున్నవాళ్లు ప్రత్యేక పాటకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే.. ఆ పాటకు సినిమాలో చాలా స్పెషాల్టీ ఉండాలి. ఉంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కేథరిన్ ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి పచ్చజెండా ఊపారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. ఈ చిత్రంలోనే కేథరిన్ ప్రత్యేక పాటలో మెరవనున్నారు. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాల్లో బెల్లంకొండ పక్కన తమన్నా ప్రత్యేక గీతాలతో కుర్రకారును ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. తాజా చిత్రంలో కేథరిన్ చేయనున్న ఐటమ్ సాంగ్ వాటికి ధీటుగా చాలా గ్రాండ్‌గా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పాట కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ఇప్పటికే భారీ సెట్ సిద్ధం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ప్రత్యేక పాట ట్యూన్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించవచ్చు. -
ఐ వాంట్ గెస్ట్ రోల్స్ అంటున్న వెంకీ
-
’నేను ఏషార్ట్ ఫిలిం తీయలేదు’
-
హారతి కనిపించేలా తీయమన్నారు
-
హీరోగా ది బెస్ట్ అనిపించుకుంటా!
- బెల్లంకొండ శ్రీనివాస్ ‘‘ఈ ఆరు నెలల్లో బోల్డన్ని కథలు విన్నాను. వాటిల్లో కొన్ని కథలు ఎంపిక చేశాం. ‘అల్లుడు శీను’తో హీరోగా నా రంగప్రవేశం భారీగా జరగడం, ఆ చిత్రం భారీ విజయం సాధించడంతో నా తదుపరి చిత్రం కూడా దానికి దీటుగా ఉండాలనుకుంటున్నా. అందుకే కథ ఎంపిక కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నాను’’ అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘నా తొలి చిత్రం కమర్షియల్ పంథాలో సాగుతుంది. ఆ తరహా చిత్రాల్లో డాన్స్, ఫైట్స్‌కి బాగా ఆస్కారం ఉంటుంది. అందుకని, నా తదుపరి చిత్రాలు కూడా ఈ కోవలోనే ఉండాలని కోరుకుంటున్నాను. బోయపాటిగారు ఓ మంచి కమర్షియల్ కథ తయారు చేస్తున్నారు. ఈ చిత్రం కోసం బాడీ బిల్డప్ చేశాను. డాన్స్, జిమ్నాస్టిక్స్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను’ అని చెప్పారు. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో చేయనున్న చిత్రం గురించి శ్రీనివాస్ చెబుతూ -‘‘తమిళంలో ఘనవిజయం సాధించిన ‘సుందర పాండియన్’కి ఇది రీమేక్. స్నేహం నేపథ్యంలో సాగే ఈ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలుస్తున్నారు’’ అని తెలిపారు. కెరీర్ ప్రారంభంలో ఉన్నందు వల్ల సినిమాల ఎంపిక విషయంలో కొంచెం ఒత్తిడి ఉంటుందని చెబుతూ - ‘‘హీరోగా ‘ది బెస్ట్’ అనిపించుకోవాలన్నది నా తాపత్రయం. మరో మూడు, నాలుగు సినిమాల వరకూ సినిమాలు చేసే విషయంలో కొంచెం స్లోగా వ్యవహరిస్తాం. ఆ తర్వాత వేగం పెంచుతా’’ అన్నారు. సినిమా సినిమాకీ నటనపరంగా వైవిధ్యం కనబర్చడానికి వంద శాతం కృషి చేస్తాననీ, తన లక్ష్యం అదేననీ చెప్పారు. -
లెజెండ్ సినిమా టీజర్
-
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లెజెండ్
-
మళ్ళీ ఫాక్షన్ హీరోగా బాలయ్య