
స్పెషల్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్
హీరోయిన్‌గా నటిస్తున్నవాళ్లు ప్రత్యేక పాటకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటే.. ఆ పాటకు సినిమాలో చాలా స్పెషాల్టీ ఉండాలి. ఉంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. కేథరిన్ ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి పచ్చజెండా ఊపారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రకుల్ ప్రీత్‌సింగ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. ఈ చిత్రంలోనే కేథరిన్ ప్రత్యేక పాటలో మెరవనున్నారు.
‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రాల్లో బెల్లంకొండ పక్కన తమన్నా ప్రత్యేక గీతాలతో కుర్రకారును ఊర్రూతలూగించిన విషయం తెలిసిందే. తాజా చిత్రంలో కేథరిన్ చేయనున్న ఐటమ్ సాంగ్ వాటికి ధీటుగా చాలా గ్రాండ్‌గా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. ఈ ప్రత్యేక పాట కోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ఇప్పటికే భారీ సెట్ సిద్ధం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ప్రత్యేక పాట ట్యూన్ ఓ రేంజ్‌లో ఉంటుందని ఊహించవచ్చు.