డబుల్‌ హ్యాట్రిక్‌పై గురి | Kiara Advani To Romance With Ram Charan Next Movie | Sakshi
Sakshi News home page

డబుల్‌ హ్యాట్రిక్‌పై గురి

Dec 31 2017 1:30 AM | Updated on Dec 31 2017 1:30 AM

Kiara Advani To Romance With Ram Charan Next Movie  - Sakshi

మాస్‌ ప్లస్‌ మాస్‌ ఈక్వెల్‌ టు ఊరమాస్‌. అదేనండి... బోయపాటి శ్రీను మార్క్‌ మాస్‌. ఇప్పటివరకూ ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలే అందుకు నిదర్శనం.  ఇప్పుడు రామ్‌చరణ్‌తో మాంచి మాస్‌ మూవీ తీయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ను జనవరి 19న స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. అంతేకాదు మేజర్‌ షూట్‌ను రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరపనున్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘‘లెజెండ్, సరైనోడు, జయజానకి నాయక విజయాలతో హ్యాట్రిక్‌ కంప్లీట్‌ చేశాను. రామ్‌చరణ్‌తో చేయబోయే సినిమా నా డబుల్‌ హాట్రిక్‌కు నాంది అవుతుంది.

ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌ మాస్‌ ఆడియన్స్‌కు సూపర్‌ కిక్‌ ఇస్తుంది’’ అన్నారు బోయపాటి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో  హీరోయిన్‌గా నిన్నమొన్నటి వరకు రకుల్‌ ప్రీత్‌సింగ్, పూజా హెగ్డే పేర్లు వినిపించాయి. తాజాగా కియరా అద్వాని పేరు రేస్‌లోకి వచ్చింది. మరి.. ఈ రేస్‌లో ఫైనల్‌గా విన్‌ అయ్యేది ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా రూపొందుతున్న ‘రంగస్థలం’ చిత్రం మార్చి 30న రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement