ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్టానమే నిర్ణయిస్తుంది | Nandamuri Balakrishna says he will obey TDP High decision | Sakshi
Sakshi News home page

ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్టానమే నిర్ణయిస్తుంది

Published Fri, Apr 11 2014 12:06 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్టానమే నిర్ణయిస్తుంది - Sakshi

ఎక్కడి నుంచి పోటీ చేయాలో అధిష్టానమే నిర్ణయిస్తుంది

ధర్మపురి: సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేయాలా.. లేక టీడీపీ తరఫున ప్రచారం చేయాలా అనే విషయాన్ని పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ తెలిపారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..  ఇటీవల తన 98వ చిత్రం ‘లెజెండ్’ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా మళ్లీ పుణ్యక్షేత్రాలను దర్శించుకొంటున్నానని తెలిపారు.

ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని విలేకరులు అడుగగా.. నేను పోటీ చేయాలా.. చేస్తే ఎక్కడినుంచి.. లేక పార్టీ ప్రచారానికే అంకితం కావాలా.. అనే విషయాలను అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పారు. చంద్రబాబు తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించారనే  ఆరోపణలను ప్రస్తావించగా.. నో పాలిటిక్స్.. నేను వ్యక్తిగతంగానే వచ్చాను తప్ప రాజకీయంగా రాలేదని బదులిచ్చారు. ఆయనవెంట దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రామ్ ఆచంట, కెమెరామన్ రాంప్రసాద్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement