హాయ్ సార్..! నాకొక అమ్మాయితో పరిచయం అయ్యింది. ఒక రాంగ్ మెసేజ్‌లతో కొన్ని రోజులు మాటల తర్వాత తను నాకు ప్రపోజ్ చేసింది. మా కులాలు వేరు కావడంతో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని తనంటే నాకిష్టమున్నా ‘నో’ అని చెప్పాను. కానీ తనే నన్ను ఒప్పించింది. ఒకరంటే ఒకరికి ప్రాణమిచ్చేంత ప్రేమ ఏర్పడింది. ఆరు నెలల వరకు నాతో బాగానే ఉంది. అప్పుడప్పుడు మన విషయం మా ఇంట్లో తెలిసిందని చెప్పేది. పెళ్ళి చేసుకుందామంటే ఇప్పుడే వద్దని చెప్పేది. ఒక రోజు ఏడుస్తూ ఫోన్ చేసి ‘మా అన్నయ్య నన్ను కొట్టాడు. నితో మాట్లాడొద్దంటున్నాడు’ అని చెప్పింది. బయటికెళ్లి పెళ్లి చేసుకుందామంటే.. ‘మా నాన్న చనిపోతారు’ అని చెప్పింది. ఇప్పటికి నాకు అర్థం కానీ విషయం ఏమిటంటే.. తనకు ముందు తెలియదా!? మొదట్లో నేను చెప్పింది కూడా అదే కదా!? ఇది జరిగి సంవత్సరం పైనే అవుతోంది. చనిపోదామనుకున్నా. ఎందుకంటే తప్పు తనది కాదు సార్ నాదే. కానీ.. నా తల్లిదండ్రులు నా మీద పెంచుకున్న ఆశల కోసం చస్తూ బతుకుతున్నా. నేను మీకు పెద్ద అభిమానిని సార్ నాకు ఒక సలహా ఇవ్వండి. తనని మర్చిపోలేకపోతున్నా. తనని మర్చిపోయే మార్గం చెప్పండి సార్. – సంతోష్
ప్రేమించినప్పుడు కలిసుండాలని ఉండదా? అమ్మాయి అదే అనుకుంది. ఎలా అయినా పేరెంట్స్ ఒప్పుకుంటారని. అన్నయ్య కొట్టి మరీ వారిస్తే కూడా నీకు ఫోన్ చేసి విషయం చెప్పింది. తండ్రి ప్రాణం వదిలేస్తానంటే... మనం దూరంగా ఉండటమే నయమన్నది. ఎంత మంచి అమ్మాయి సంతోష్..! నువ్వు బాధపడకూడదని నీకు తోడుగా ఉంది. నాన్న కష్టపడకూడదని ప్రాణం లాంటి నిన్ను దూరముంచింది. తన మనస్తాపాన్ని నువ్వు అర్థం చేసుకుని దూరంగా ఉండటం మంచి నిర్ణయం. ‘ఏంటి సార్..? అప్పుడు నుంచి చూస్తున్నాను. అందరిని దూరం..దూరం..దూరం... అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు.
మీరు చాలా శాడిస్ట్ అయిపోతున్నారు సార్? సంతోష్‌ని పోయి అమ్మాయి పేరెంట్స్‌తో మాట్లాడమని చెప్పచ్చు కదా! దగ్గర చెయ్యొచ్చు కదా! ఎట్ ద మోస్ట్ అవమానిస్తారు. లేదంటే రెండు చివాట్లు పెడతారు. ఇంకా కోపమొస్తే అమ్మాయి వాళ్ల అన్న రెండు పీకుతాడు సార్!’ కానీ అంతా అల్లరైపోదా నీలూ!? ఆ కుటుంబం కుమిలిపోదా నీలూ? ఆ అమ్మాయి లైఫ్ పూర్తిగా స్పాయిల్ అయిపోదా నీలూ..? ప్రేమలో అంత స్వార్థం పనికిరాదు నీలూ..!! అమ్మాయి చల్లగా ఉండాలంటే... కుటుంబం చక్కగా ఉండాలంటే..... ‘సార్..! మీరిచ్చిన ఆన్సర్ అమ్మాయి పేరెంట్స్‌కి చూపిస్తే బెస్ట్ సార్..! పేరెంట్స్ బాధపడరు. సంతోష్ దెబ్బలు తినడు. మంచి ఎఫర్ట్ చేశాడు కాబట్టి ఆ తర్వాత అమ్మాయిని మరచిపోవడంలో ప్రాబ్లమ్ ఉండదు!’
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment