హాయ్ అన్నయ్యా! నేనొక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నాను. మాది టూ సైడ్ లవ్. మా సమస్య ఏంటంటే... మా ఇద్దరిదీ సేమ్ ఏజ్. ఈ కారణంతో మా పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకుంటారో లేదోనని చాలా భయంగా ఉంది. నేను లేకపోతే తను, తను లేకపోతే నేను ఉండలేమన్నయ్యా! కాబట్టి మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. –ప్రవీణ్
తెల్ల రంగు డై దొరుకుతుందన్నా.. పూసేసుకో...!! ‘ఇదేమైనా సినిమానా సార్? తెల్లరంగు పూసుకుని నటించడానికి...!? ఇది లైఫ్ సార్...!! పుట్టిన డేట్.. టైమ్.. ఇయర్.. ఇవన్నీ రంగుతో మార్చలేం సార్!’ రంగుతో మార్చలేనిది... ఆలోచనతో మార్చవచ్చు నీలూ..! ‘అంటే లవ్‌కి ఏజ్.. గేజ్.. అంతగా అడ్డు రావంటారు. చక్కగా ఒకే ఏజ్ కాబట్టి.. ఒకరు పెద్ద, ఒకరు చిన్న అనిపించదు. ఇద్దరూ ఈక్వల్‌గా ఫీల్ అవ్వచ్చు. మ్యారీడ్ లైఫ్ – ఫ్రెండ్లీ లైఫ్ అనిపిస్తుంది కదా సార్?’ అవును నీలూ! పేరెంట్స్‌కి కూడా ఇదే చెప్పి కన్విన్స్ చెయ్యాలి!!
‘చెబుతాడు సార్! ప్రవీణ్ చాలా స్మార్ట్ సార్..!! వెరీ బ్రేవ్ సార్..!! చెబుతాడు... నాకు తెలుసు..!!’ ఆల్ ద బెస్ట్ ప్రవీణ్!!
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment