
హాయ్ సార్..! నేనొక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను చాలా లవ్ చేస్తున్నాడు. మా లవ్ గురించి మా ఇంట్లో తెలిసి చాలా తిట్టారు. కానీ నేను మాత్రం తననే పెళ్లి చేసుకుంటానని చెప్పి, కష్టపడి మా వాళ్లని ఒప్పించాను. ఆ అబ్బాయి వాళ్ల ఇంట్లో కూడా తను ఒప్పించాడు. కానీ కట్నం కావాలంటున్నారు. మా పేరెంట్స్ మాత్రం ఒక్క రూపాయి కూడా కట్నం ఇవ్వమని చెప్పేశారు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడంలేదు సార్. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. – శ్రావణి
శ్రావణి కావాలో.. కట్నం కావాలో.. డిసైడ్ చేసుకోమంటూ.... ‘రెండూ వర్కౌట్ కావా సార్?’ మూడూ వర్కౌట్ అవుతాయి నీలూ! ‘మూడేంటి సార్.. పెళ్లి, కట్నం రెండే కదా సార్!!’మరి జైల్‌కి ఎవరు వెళ్తారు నీలూ... నేనా? ‘వద్దులే అలాంటి సలహా మీరెప్పుడూ ఇవ్వకండి... ఎందుకంటే జైల్లో అరటిపండు ఇవ్వరు కదా సార్!’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ ,లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment