నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Sat, Sep 16 2017 12:14 AM | Last Updated on Tue, Sep 19 2017 4:36 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌

హలో సార్‌! నేను ఫైవ్‌ ఇయర్స్‌ నుంచి ఒక అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నాను. పరిచయమైన వన్‌ ఇయర్‌కి తను డైవోర్స్‌డ్‌ అని తెలిసింది. తరువాత నాకు ప్రపోజ్‌ చేశాడు. దాంతో నేను రిజెక్ట్‌ చేసి మాట్లాడ్డం మానేశాను. కానీ తనంటే ఇష్టం ఉండటంతో మళ్లీ వన్‌ ఇయర్‌ తరువాత మాట్లాడాను. అప్పుడు మళ్లీ ప్రపోజ్‌ చేస్తే.. ఓకే చేశాను. కొన్నిరోజుల తరువాత తెలిసింది నేను రిజెక్ట్‌ చేసిన వన్‌ ఇయర్‌ గ్యాప్‌లో వాళ్ల మరదలితో రిలేషన్‌ పెట్టుకున్నాడని. చాలా గొడవల తరువాత వాళ్ల మరదలు తనకి బ్రేక్‌ అప్‌ చెప్పేసిందట.

‘ఇప్పుడు నిన్ను మాత్రమే లవ్‌ చేస్తున్నా, పెళ్లి చేసుకుంటా’ అంటున్నాడు. అయితే ఫస్ట్‌ డైవోర్స్‌ విషయం, వాళ్ల మరదలితో బ్రేక్‌ అప్‌ విషయం.. రెండూ మా పేరెంట్స్‌కి చెప్పి ఒప్పించాలంటున్నాడు. అలా ఏ పేరెంట్స్‌ ఒప్పుకుంటారు? పైగా వాళ్ల మరదలే తనని వద్దు అని వెళ్లిపోయింది కానీ, నా కోసం తను వాళ్ల మరదల్ని వద్దు అని చెప్పలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వాళ్లిద్దరి మధ్యలోకి నేను వెళ్లానా? అసలు నేనంటే తనకి ఇష్టముందా? ఏ రకంగా చూసుకున్నా తను నాకు ఇంపార్టెన్స్‌ ఇస్తున్నట్లే అనిపించడంలేదు. వాళ్ల మరదలితో రిలేషన్‌ విషయంలో తనపై నాకు చాలా బ్యాడ్‌ ఇంప్రెషన్‌ వచ్చేసింది కాబట్టి మీరే ఏమైనా మంచి సమాధానం ఇవ్వండి ప్లీజ్‌!! – రత్నం


నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది బంగారం! ‘అదేంటి సార్‌?’ చదివితే నీకే అర్థమవుతుంది!! ‘మీరు చెప్పరా?’ చెప్పను!! ‘ఎందుకు సార్‌ ఇలా వేధిస్తారు?’సమాధానం చెప్పడం కంటే.. సమాధానాన్ని తనకై తానే తెలుసుకుంటే... లైఫ్‌ స్ట్రాంగ్‌ అవుతుంది! ‘సార్‌ విసిగించకుండా చెప్పండి సార్‌ ప్లీజ్‌!!’ తన కోసం మరదలిని వదల లేదు!!

‘కరెక్ట్‌ సార్‌!! తన క్వశ్చన్‌లోనే చెప్పింది.. అలాంటప్పుడు వాడిది ప్రేమ కాదు! అవసరం అని!!’ అబ్బా ఏం చెప్పావు నీలాంబరీ తొందరగా అరటిపండు ఇవ్వు!!
 - ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement