నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Wed, Sep 20 2017 12:23 AM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్‌ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి  చేసుకుందాము అంటే మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు నన్ను మరిచిపో అని చెబుతోంది. నేను ఆ అమ్మాయిని మరచిపోలేక పోతున్నా. ఎంత అవాయిడ్‌ చేసినా తనతో ఉన్న జ్ఞాపకాలు బాగా గుర్తొస్తున్నాయి. చాలా కష్టంగా ఉంది సర్‌. అదంతా మరచిపోవడానికి నేను ఏం చెయ్యాలి సొల్యూషన్‌ చెప్పండి ప్లీజ్‌!! – శేఖర్‌

శేఖర్‌ అన్నా చాలా కష్టం!! ‘ఏంటి సార్‌ కష్టం?’ ప్రేమించిన ప్రేయసిని మరువటం ఎంత కష్టం!! ‘ఊరికే పీకకండి సార్‌ మీకేదో ఆ ఎమోషన్‌ అర్థమయినట్లు!?’ ప్రాణం పిండేస్తుంది శేఖర్‌ అన్నా!! ‘ఉత్తుత్తి మాటలు చెప్పకండి సార్‌!’ అన్నం సహించదు! వాటర్‌ కూడా పడదు!! సార్‌ ఆ కోర మీసాలు మీరూ.. ఎవరయినా నవ్విపోతారు! మీరేంటి సార్‌ అంతగా ఫీల్‌ అయిపోతున్నారు?’ నిద్దర పట్టదు! కలలు వస్తునే ఉంటాయి.. పిల్లో తడుస్తూనే ఉంటుంది!! ‘ఛస్‌! ఛస్‌! స్లీప్‌ లేకుండా కలలేంటి సార్‌? లవ్‌ చేసినట్టు మీరు పగటికలలు కన్నట్టే ఉంది సార్‌ మీ తొక్కలో ఆన్సర్‌!!’ఇప్పుడర్థమయిందా శేఖరన్నా అసలు మగాళ్లు ప్రేమిస్తారంటే నమ్మలేని ఆడవారు వీరు!! ‘సార్‌ మీకు లవ్‌ రాదు! శేఖర్‌ లవ్‌ చెయ్యగలడు!!’

ప్రేమించిన వాడే అమ్మాయి సంతోషం కోసం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోతాడు ‘ఏదో పాత కథా సార్‌?’ నీ సుఖమే నే కోరుకున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా!! ‘అరటిపండే నే కోరుకున్నా.. తొక్క తీసి నీకిస్తున్నా..!!’ అని నవ్వింది నీలూ.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement