నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను ఒకప్పుడు ఒక అమ్మాయిని చాలా లవ్ చేశాను. అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో ఇవన్నీ వద్దని నన్ను వదిలి వెళ్లిపోయింది. ఎందుకు అని ఆరాతీస్తే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని చెప్పింది. అప్పటి నుంచి ఆమె నాతో మాట్లాడలేదు. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. తరువాత నన్ను నేను సముదాయించుకుని సివిల్స్‌కి ప్రిపేరవ్వాలని డిసైడ్ అయ్యా. చదువు మీద ధ్యాసపెట్టి రోజుకు 17 గంటలు చదవడం మొదలు పెట్టా.
అయితే కొన్ని రోజులకి మా అంకుల్‌కి యాక్సిడెంట్ అయ్యి 20 డేస్ హాస్పిటల్‌లో తోడుగా ఉండాల్సి వచ్చింది. ఆ టైమ్‌లో ఒక నర్స్ మా అంకుల్‌ని బాగా చూసుకుంది. ఆ సమయంలో తన ప్రవర్తన నాకు బాగా నచ్చింది. తరువాత పరిచయం బాగా పెరిగి ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. తను నన్ను లవ్ చేస్తున్నా అని చెప్పింది కూడా. అయితే తనకు ఆల్‌రెడీ పెళ్లి కుదిరిందట. పెద్దల బలవంతం మీద ఒప్పుకుందట. ‘నువ్వు లేకుండా ఉండలేను’ అంటోంది. నాకు తనంటే ఇష్టం కానీ ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు సార్!! నా మనసులో మాట చెప్పలేకపోతున్నా!
– అజయ్ కుమార్
ఇదేనా అడ్రస్? ‘ఇదే అనుకుంటా సార్!’ మెట్లు ఇంత డార్క్‌గా ఉన్నాయి ఎందుకు? ‘లైట్ లేదు కాబట్టి సార్!’ అబ్బా ఎంత తెలివి నీది!! ‘నిజం సార్! ఎక్కడా స్విచ్ లేదు ఇక లైట్ ఎలా ఉంటుంది సార్?’ ఇంకా ఎన్ని మెట్లో? ‘తలుపు చేరే దాకా సార్!’ యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్! ‘జోక్ చెయ్యకండి సార్.. డోర్ వచ్చింది సార్’ డోర్ రాలేదు.. మనమే డోర్ దగ్గరకు వచ్చాం!‘సార్ మీరు నాకంటే ఇంటెలిజెంట్ సార్!! చాల్లే వెటకారం.. తలుపు కొట్టు... ‘మీరే కొట్టొచ్చుగా సార్!’ నేనయితే బెల్ కొడతా తలుపు కొట్టను!
‘హా అయితే బెల్లే కొట్టండి సార్!’ బెల్ లేదు!! ‘జరగండి సార్.. నేను తలుపు కొడతా!’ టక..టక..టక.. టక.. ‘సార్.. అజయ్ కుమార్ తలుపు తియ్యడంలేదు సార్!’ నువ్వు నర్స్ అని తెలియదేమో నీలూ!! టక..టక..టక.. టక.. ‘సార్ అజయ్ కుమార్ తలుపు తియ్యడం లేదు సార్!’ బుద్ధిమంతుడు సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు.. ఏ నర్స్ తన దీక్షను డిస్టర్బ్ చెయ్యలేదు. చలో పోయి అరటిపండు కొనుక్కుందాం!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com