నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్. నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నా. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను లవ్ చేస్తుంది. ఈ మధ్యనే ఆ అమ్మాయికి పెళ్లిచూపులు చూడడానికి వచ్చారు. మా విషయం అమ్మాయి ఇంట్లో వాళ్లకి తెలుసు కానీ నేపథ్యాలే ప్రాబ్లమ్ అంటున్నారు. ఒప్పుకోమని చెప్పేశారు. మా ఇంట్లో కూడా విషయం చెబితే వాళ్లూ సేమ్ ప్రాబ్లమ్ అని అంటున్నారు. ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు సర్? ప్లీజ్ మీరు ఇచ్చే సమాధానంౖ పెనే నా జీవితం ఆధారపడి ఉంటుంది సర్. - నాయుడు
నేపథ్యాన్ని నెయ్యిలో కలుపుకుని నాకెయ్యాలి అన్న! ‘అపచారం.. సార్!!’ అబ్బా అదే నేను అంటుంది ఆవకాయి పచ్చడిని.. ‘కాదు సార్ అపచారం.. నేపథ్యాలు వేరయితే పేరెంట్స్ ఒప్పుకోరు..!!’ సింగినాదం ఏం కాదు!?! ‘ఏంటి సార్ అలా కొట్టి పారేస్తున్నారు!’ ప్రేమించే ముందు నేపథ్యం అడిగారా? ‘ఊహూ.. అడిగి ఉండరు సార్!’ప్రేమించే ముందు మమ్మీడాడీలను అడిగారా?‘ఛాన్సే లేదు.. అప్పుడే నేపథ్యగానం అయిపోయేది!’ప్రేమకు నేపథ్యాలు ఉండవు!‘మరి?’నేపథ్యాలకు ప్రేమలు ఉండవు!‘అయితే..’పేరెంట్స్‌కి పిల్లల హ్యాపీనెస్ కావాలని ఉంటుంది!‘ఇప్పుడు ఏమి చెయ్యాలి’దమ్ము ఉన్న వాడు పేరెంట్స్‌ని కన్విన్స్ చెయ్యాలి!!ఏడిసినట్లు ఉంది మీ తొక్కలో అడ్వైజ్ సార్!’ప్రేమ పండు అవ్వాలంటే తొక్క అడ్వైజ్ చాలా అవసరం!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్,హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com