నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problem | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Thu, Sep 21 2017 12:08 AM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా!! నాకు వన్‌ ఇయర్‌ క్రితం ఒక అబ్బాయి ప్రపోజ్‌ చేశాడు. ‘నిన్ను బాగా చూసుకుంటాను. అమ్మానాన్నలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. తనని నమ్మి నేను కూడా ఓకే చెప్పాను. అయితే తనకు ఆల్‌రెడీ రెండు బ్రేక్‌అప్స్‌ అయ్యాయని తరువాత తెలిసింది. ఏంటని అడిగితే ‘నీకు చెప్పనందుకు సారీ, బట్‌ నువ్వు బాధపడతావనే చెప్పలేదు’ అన్నాడు. దాంతో కొన్నిరోజులు మళ్లీ హ్యాపీగానే ఉన్నాం. అయితే తనుకు చాలా మంది గర్ల్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారని తెలిసి షాక్‌ అయ్యాను. కానీ గర్ల్‌ ఫ్రెండ్స్‌ వేరు, నేను వేరు... అని సరిపెట్టుకున్నాను. కానీ తను వాళ్లతో చాలా క్లోజ్‌గా ఉంటాడట.

ఒక అమ్మాయిని రూమ్‌కి కూడా తీసుకెళ్తుంటాడని తెలిసి తట్టుకోలేకపోయాను. ఏంటని నిలదీస్తే.. తను మూడో మాజీ లవర్‌ అని, తనను మరిచిపోలేక కలిశానని చెప్పాడు. దాంతో చాలా బాధగా అనిపించింది. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు అన్నయ్యా!!      – సాత్విక


గజ్జి పట్టింది తల్లీ వాడికి.. ‘పోదా సార్‌?’ బ్రష్‌తో తోమితే పోయేది కాదు! ‘దేనితో తోమాలి సార్‌?’ చెప్పలేను! ‘ఎందుకు సార్‌?’ బాగుండదు! ‘పర్వాలేదు చెప్పండి సార్‌!’ తప్పదంటావా? ‘కొబ్బరి పీచు, బొగ్గు పొడితో తోమమని కథలు చెప్పకండి సార్‌.. కరెక్ట్‌గా చెప్పండి!’ ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు గర్ల్‌ గర్ల్‌కి బిహేవియర్‌ వేరు బాయ్‌ ఫ్రెండ్స్‌ అందు గుడ్‌ బాయ్స్‌ వేరయా విశ్వదాభిరామ ఇసుక వేసి తోమ!! ‘అంటే వాటర్‌ లేకుండా తోమాలా సార్‌?’ ప్రేమ లేని ఎడారిలో వేసి తోమాలి! ‘శహబాష్‌ సార్‌.. ఇదిగో అరటిపండు తోమేయ్యండి సార్‌!’
-  ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1,  బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement