
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం గూగుల్ కన్నా లవ్ డాక్టర్‌నే ఎక్కువ ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు నాకు మీ గైడెన్స్ చాలా అవసరం! నా వయస్సు 21. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను కూడా నన్ను ఇష్టపడింది. (తను కన్వర్టెడ్ క్రిస్టియన్. దేవుడు, పేరెంట్సే లోకం. తనది చాలా స్ట్రయిట్ బిహేవియర్.) వన్ ఇయర్ బాగానే గడిచింది. ఓ రోజు తను కాల్ చేస్తే... నేను బుద్ది తక్కువై.. మనసు బాగోక... ‘ఇంకెప్పుడూ కాల్ చెయ్యకు’ అనేశాను. అంతే, ఇంక తను కాల్ చెయ్యలేదు. ఇప్పటికి ఒన్ ఇయర్ అవుతోంది. ‘చదువు పూర్తి అయ్యాక.. ఆ దేవుడే మనల్ని కలుపుతాడు. అప్పటిదాకా బాగా చదువు, ఏం ఆలోచించకు’ అని చెప్పింది. బట్ తనని అస్సలు మరిచిపోలేకపోతున్నాను. ఈ చదువు పూర్తి అయ్యేలోపు తనకి సంబంధాలు చూస్తారేమో అని భయంగా ఉంది సార్!
– హేమంత్
ట్యాంక్‌లో నీళ్లు అయిపోయాక ట్యాప్ కట్టి ఏమి లాభం బ్రో.. ‘సార్ టూ మచ్! పాపం అంత సిన్సియర్‌గా లవ్ చేస్తున్నాడు. ఏదయినా సాయం చెయ్యండి లేకపోతే... మీ లైఫ్‌లో లవ్వే ఉండదు.. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే... తొక్క లైఫ్‌లో అరటిపండే ఉండదు..’
తొక్కలో లవ్వు ఉంటే ఏమి? లేకపోతే ఏమి? పండు తింటే వచ్చే కొవ్వు లవ్వు కంటే బెటర్! ‘సార్ మీతో ఆర్గ్యుమెంట్ కంటే చెవిటి వాని ముందు శంఖం ఊదుకోవడం బెటర్..’ సరే... హేమంత్ ట్యాంక్‌లో నీళ్లు ఫిల్ అవ్వాలంటే...! ‘ఫిల్ అవ్వాలంటే...?’ హార్ట్‌లో అమ్మాయి లవ్ ఫీల్ అవ్వాలి... ‘ఎలా ఫీల్ అవ్వాలి..?’ అరటిపండు ఇస్తావా నీలాంబరీ..? ‘కరెక్ట్‌గా చెబితే దేఖేంగే..!’ అమ్మాయిలాగా నువ్వు కూడా సిన్సియర్‌గా చదువుకుని గ్రేట్ ఫెలో అయి మళ్లీ ప్రపోజ్ చెయ్యి...! ‘అక్కడ అమ్మాయికి ప్రపోజల్స్ చూస్తున్నారు సార్...!’ మనోడికి ఇంకా 21 ఇయర్స్ ఓన్లీ! ఏం తింటాడు? ఏం తినిపిస్తాడు? ముందు కెరియర్. తరువాతే, ట్యాంక్ ఫుల్ ఆఫ్ లవ్. ఇదే ఫైనల్!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com