Affinity
-
మజిలీ
‘రమ్య’. పేరు ఎంత బాగుందో ఆమె కూడా అంతే అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే, ఓ దేవతలా అనిపిస్తుంది నాకు. ఆమె నవ్వుతుంటే, కొన్ని గంటల్లోనే కొన్ని కోట్లసార్లు చూసి ఉంటా. అంత అందంగా నవ్వుతుంది. నాకందుకే అనిపిస్తూ ఉంటుంది, ఆమె పుట్టగానే నవ్విందేమో అని! ఆమెను నేను మొదటిసారి వరంగల్ గౌతమి ఇంజనీరింగ్ కాలేజీలో చూడటం ఇప్పటికీ అలాగే గుర్తుంది. నా ఫ్రెండ్ వరుణ్ అదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ రోజు కాలేజీలో పార్టీ ఉంటే నన్ను కూడా బలవంతంగా తీసుకెళ్లాడు.పార్టీ కావడంతో కాలేజీలో చాలా హడావుడిగా ఉంది. నాలుగు స్తంభాలు ఉన్న దగ్గర నేను నిలబడి ఆలోచిస్తున్నా. ఉన్నట్లు ఉండి ఆకాశం చల్లగా మారింది. రాను రానూ వర్షపు జల్లు నవ్వుతూ పడింది. దూరం నుంచి తెల్లటి డ్రెస్‌లో ఆ వర్షపు జల్లులో అలా నడుచుకుంటూ ఒక అమ్మాయి వచ్చింది. ఆ వర్షపు జల్లు తనపై పడుతుంటే, నవ్వుతోంది. బహుశా ఆ వర్షపు జల్లు ఆమె కోసమే పడుతున్నట్లు ఆ నిమిషం నాకనిపించింది.ముఖంపైకి వచ్చి పడుతున్న కురులను తన చేతి వేళ్లతో అందంగా వెనక్కి నెట్టిపడేస్తూ చిన్ని చిన్ని అడుగులు వేస్తోంది. ఇంత అందమైన అమ్మాయిని చూడటానికే ఈ రోజు ఇక్కడికి వచ్చినట్లు నా మాటలు నా గుండెకి తాకాయి. ఇది ఆమెపై కలిగిన ప్రేమో, లేక ఆకర్షణో తెలియదు. కానీ, ఆమెకోసం ఏదైనా చేయొచ్చని మనసుకు అనిపించింది. ఇలా అనిపించడం కూడా నాకే వింతగా ఉంది. నా ఫ్రెండ్ వరుణ్‌ను పిలిచి ఆ అమ్మాయి ఎవరని అడిగాను.పేరు రమ్య. ఫస్ట్ ఇయర్. వరుణ్ ఆ అమ్మాయి గురించి చెబుతుంటే, వెళ్లి పరిచయం చేసుకోవాలనిపించింది. కానీ, ఏమో అప్పుడు ఆ సాహసం చేయలేదు. ఆమెకూ నేను నచ్చాలి కదా. అయినా, నేను ఎవరని ఆమె నాతో మాట్లాడుతుంది! ఒక్కటా.. రెండా.. ఎన్నో ప్రశ్నలు. అన్నీ తన చుట్టే! తనని చూసిన తర్వాత ఆరు గంటలు జరిగిన పార్టీ, అర నిమిషంలో ముగిసినట్లు అనిపించింది. తననివదిలి ఇంటికి వెళ్లాలనిపించలేదు. ఇదే విషయాన్ని వరుణ్‌కి చెప్పాను.‘ప్రేమ ఏంట్రా చరణ్! అయినా ఒక్క రోజులో ప్రేమ పుడుతుందారా? ఇవన్నీ వద్దు. టైం వేస్ట్ చేసుకోకురా. ఇంకో రెండు సంవత్సరాలు అయితే నీ ఇంజనీరింగ్ అయిపోతుంది. మంచి జాబ్ వస్తుంది. అప్పటికి ఆ అమ్మాయి థర్డ్ ఇయర్లోనే ఉంటుంది. అప్పుడు తనకి నీ విషయం చెప్పు. ఏమంటుందో చూడు. తనకీ ఇలాంటి ఫీలింగే ఉంటే, నీ లైఫ్ బాగుంటుంది’ అన్నాడు.‘అంటే ఏంట్రా నువ్వనేది, ప్రేమించిన ప్రతి వాడు చదువుని పక్కనపెట్టి అమ్మాయిల కోసమే తిరుగుతాడా?’‘తిరుగుతాడో లేదో నాకు తెలియదు చరణ్! కానీ నువ్వు ఆ అమ్మాయి కోసం ఇంత రిస్క్ చేయొద్దు. ఎందుకంటే, ఆ అమ్మాయి నిన్ను ప్రేమించట్లేదు కాబట్టి.’‘అయితే రేపు కాలేజ్‌కి వచ్చి నా ప్రేమ విషయం చెప్తా’‘హా. వెళ్లి చెప్పు. చెప్పు ఎలా ఉందో చూశావా అని సినిమా స్టైల్లో రిప్లయ్ ఇస్తుంది’‘ఎందుకు రా వరుణ్, నెగటివ్‌గా ఆలోచిస్తున్నావ్?’‘సారీ రా. కానీ ఆమె నాకు ఇవన్నీ నచ్చవంటే నువ్వు బాధపడతావ్. అది నేను చూడలేను. నా మాట విని నువ్వు ఒక టూ ఇయర్స్ వెయిట్ చెయ్యి’‘సరే రా వరుణ్, నాకు నా మీద కంటే నీ మీద నమ్మకం ఎక్కువ. నువ్వు చెప్పినట్లే నా చదువయ్యాకే ఆమెని కలుస్తా‘ అని వాడికి మాటిచ్చా.’ వాడికి ఇచ్చిన మాట ప్రకారమే, ఆమె నుంచి దూరంగా వచ్చేశా. చాలాసార్లు వరుణ్‌కి చెప్పకుండా ఆమెని చూడాలనిపించేది. కానీ, ఆమెను చూశాక నేను ఇక హైదరాబాద్‌కి మళ్లీ వెళ్లనేమో అనిపించింది. అలా చేస్తే నా ఫ్రెండ్షిప్ పాడైపోతుంది. ఏదేమైనా ఆమె నాకోసమే పుట్టిందన్న ఆ చిన్న నమ్మకంతోనే సంవత్సరం గడిపేశా. తర్వాత వరుణ్‌కి సెలవులని తెలిసి కలవడం కోసం వరంగల్ వెళ్లా. ఆ టైంలో రమ్య గురించి వరుణ్ని చాలాసార్లే అడిగాను. వాడు సమాధానం చెప్పలేదు. ఇక నేను అడగదల్చుకోలేదు. నాలుగు రోజులు ఉండి, తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్‌కి వెళ్లా. రాత్రి సరిగ్గా పన్నెండవుతోంది. బస్ టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్లి కూర్చున్నా. బస్ మొత్తం ఫుల్ అయింది కానీ, నా పక్కనున్న సీట్ మాత్రం ఖాళీగానే ఉంది. అప్పుడే వచ్చింది ఓ అమ్మాయి. కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది. రాత్రి ఒంటిగంట అవుతోంది. ఆ అమ్మాయి హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటోంది. ముఖానికున్న స్కార్ఫ్ మాత్రం తీయలేదు. పాటలు వింటూనే నిద్రలోకి జారుకుంది. నేను విండోవైపు తిరిగి పడుకున్నా. ఫోన్ కింద పడిన శబ్దం వినిపించి లేచా. కానీ ఆమె నిద్రలోనుంచి ఇంకా బయటకు రాలేదు. ఫోన్ పైకి తీశా. ఆమె నిద్ర ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూస్తున్నా. సరిగ్గా సగం దూరం వచ్చాక లేచింది. ‘‘ఏంటి అలా చూస్తున్నావ్?’’ అని సీరియస్‌గా అడిగింది. ‘కాదండి. మీ ఫోన్ కింద పడిపోయింది. మీరు లేస్తే ఇద్దామని చూస్తున్నా’ అన్నాను.‘అయ్యో! క్షమించు. నిద్ర పట్టేసింది, చూసుకోలేదు. చాలా థ్యాంక్స్, ఫోన్ ఇచ్చినందుకు.’ అని తన స్కార్ఫ్ వెనక ఉన్నమాటలు కనిపించలేదు కానీ, వినిపించాయి.‘పర్లేదండీ! కానీ చాలాసేపే నిద్రపోయారు మీరు..’‘అదేంటో.. నాకు బస్ ఎక్కిన కొద్దిసేపటికే నిద్ర పట్టేస్తుంది. ఇక రాత్రి సమయాల్లో ప్రయాణం అంటే, ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. సరే, మీరు ఏం చేస్తుంటారు?’‘నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ హైదరాబాద్‌లో. మరి మీరు?’‘నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఇక్కడే వరంగల్‌లో..’‘ఓకే. ఏ కాలేజో తెలుసుకోవచ్చా?’‘ఎందుకు?’‘కాదు. నేనొక అమ్మాయిని ఇష్టపడ్డా. ప్రేమించా. ఆ అమ్మాయి మీ కాలేజేమోనని?’‘ఓ సూపర్. ఏ కాలేజ్ మరి ఆ అమ్మాయి?’‘వరంగల్ గౌతమి ఇంజనీరింగ్ కాలేజ్!’‘అవునా, నేను అరోరా కాలేజ్. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి?’‘ఆమె పేరు రమ్య. చాలా అందంగా ఉంటుంది. చూడగానే చాలా ఇష్టపడిపోయా. కానీ, నా ఫ్రెండే.. అప్పుడే ఎందుకు లవ్ అని చదువు అయిపోయాక ఆఅమ్మాయిని కలవమని అన్నాడు. కానీ, ఈలోపు ఆ అమ్మాయిని నేను మర్చిపోతానని వాడి నమ్మకం. కానీ, అంత ఈజీగా మర్చిపోలేను. ఇంతకీ మీ పేరు?’‘నా పేరు శ్రీవాణి. ఆ అమ్మాయినిమర్చిపోతావేమో అని నాకు కూడా అనిపిస్తోంది’‘లేదండీ. బీటెక్ అయిపోయిన తర్వాత ఆమెకి నా విషయం చెప్తా’‘అచ్చా! చెప్పగానే ఆ అమ్మాయి ఒప్పుకోదు కదా మిస్టర్’‘అది నిజమే. బట్ వెయిట్ చేస్తా. ఒప్పిస్తా. నన్ను ఒప్పుకుంటుందన్న నమ్మకం ఉంది శ్రీవాణి గారు’‘అది ఓకే. కానీ ఈలోపు ఆ అమ్మాయి వేరే వ్యక్తిని ప్రేమిస్తే?’‘మీరు లేనిపోని భయాలు పెట్టకండి ప్లీజ్’ ‘జస్ట్అడుగుతున్నా. అప్పుడేం చేస్తావ్?’‘అలానే జరిగితే, తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటా. కానీ, నాకు నమ్మకం ఉంది. రమ్య నా సొంతం అని’‘సరే, గట్టిగా కోరుకుంటే జరుగుతుంది. నీకు మంచి జరగాలని నేను కూడా కోరుకుంటా’‘చాలా థ్యాంక్స్ అండీ. ఆ అమ్మాయి నా సొంతం’ అని మళ్లీ అనేసి నిద్రలోకి జారుకున్నా. హైదరాబాద్ వచ్చింది. పక్కన మాత్రం శ్రీవాణి లేదు. ఆమె ప్లేస్‌లో ఓ లెటర్ ఉంది. అది చూశాక నేనెంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమయింది.‘హాయ్! నిజం చెప్పాలంటే నీ పేరు కూడా నాకు తెలియదు. ఒక అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయిని ఇంతగా ఇష్టపడటం నిజంగా గ్రేట్ అనిపిస్తోంది నాకు. ఎందుకు ఇంత సంతోషమంటే, ఆ అమ్మాయిని నేనే కాబట్టి. నువ్వు చదువుతుంది నిజమే. నేనే రమ్యని. నేనేశ్రీవాణీని. నా పూర్తి పేరు రమ్య శ్రీవాణి. నువ్వు నా గురించి చెబుతున్న విషయాలకు నేను చాలా సంతోషపడ్డా. నువ్వు మంచివాడివో కాదో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒకే ఒక్కటి, నువ్వునాకోసం ఎదురుచూస్తున్నావు. నిజం చెప్పాలంటే, బస్సులో నీ మాటలు నా హదయాన్ని కదిలించాయి. ఒక అమ్మాయి కోసం ఆమెకి తెలియకుండా, ఓ అబ్బాయి ఏడాది నుంచి ఇంతలా ఎదురుచూడటం నాకు కొత్తగా అనిపించింది. ఇది నా గురించే కావడం నేను ఇంకా నమ్మలేకపోతున్నా. నా గురించి నువ్వు చెబుతుంటే, నా అనందాన్ని నా స్కార్ఫ్ వెనుక దాచేశాను. ఏ అమ్మాయికైనాకావాల్సింది నిజమైన ప్రేమే. నా గురించి అప్పుడే చెబితే నీ చదువుకు అడ్డం అవుతాననే భయంతోనే నేను అరోరా కాలేజ్, నా పేరు శ్రీవాణీ అని చెప్పాను. నువ్వు నాకోసం అప్పుడే ఒక సంవత్సరం ఎదురుచూశావు. ఇంకా ఒక సంవత్సరం నేను నీకోసం ఎదురుచూస్తాను. నువ్వు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావో అని’.ఆమె పేపర్ మీద రాసిన మాటలు చూసి బస్సులోనే ఎగిరి గంతేశా. ఎప్పుడు రాసిందో, ఎలా రాసిందో అర్థం కాలేదు. కాసేపు గాల్లో తేలాను. ఆ సంవత్సరమంతా ఆ లెటర్లోని మాటలనే తన మనసుగా చూసుకుంటూ గడిపేశా. మధ్యలో ఓ పదిసార్లు వరంగల్ వెళ్లినా తనని చూడలేదు. ఎందుకంటే, తను నాది కాబట్టి. నా ప్రెండ్షిప్, నా ప్రేమ కోసం సర్దిచెప్పుకున్నా.రెండేళ్ల తర్వాత చదువు పూర్తి చేసి విప్రోలో జాబ్ కొట్టి గౌతమి కాలేజ్ ముందు నిలబడ్డా. చాలామంది కాలేజీ నుంచి వస్తున్నారు. రమ్య మాత్రం కనిపించలేదు. ఆ బాధతోనే వరుణ్ దగ్గరకు వెళ్లాను. ‘రారా చరణ్, ఎలా ఉన్నావ్?’ నన్ను చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు వరుణ్. ‘వరుణ్, ఈ రోజు మీ కాలేజ్‌కి వెళ్లాను. రమ్య కనిపించలేదు’‘అదేంట్రా కనిపించకపోవడం. సరే, ఈ రోజు రాలేదేమో కాలేజీకి. రేపు వెళ్లి ట్రై చెయ్యి’ఆ మరుసటి రోజు నుంచి దాదాపు నెల రోజులు ఆమె కోసం ఎదురుచూశా. ఏ రోజూ ఆమె కనిపించలేదు. నా మనసుకు గాయం అయినంత పనయింది. ఇదే విషయం వరుణ్‌కి చెప్పాను.అరే చరణ్. నాకు కాలేజ్ అయిపోయి రెండు నెలలవుతోంది. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. అయినా ఆ అమ్మాయిని నేను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. సరే, నా జూనియర్స్కొందరివి నెంబర్స్ ఉన్నాయి. వాళ్లను అడిగి తెలుసుకుంటా’ అని దాదాపు ఓ ముప్ఫై మందికి కాల్ చేశాడు వరుణ్. అందరూ ఎక్కడికి వెళ్లిందోచెప్పలేదనే చెప్పారు. ఓ ఆరు నెలలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతిసారీ వరుణ్ నాకు ధైర్యం చెబుతూనే ఉన్నాడు. కానీ గుండెల్లో నిండివున్న తనని అంత ఈజీగా మర్చిపోలేను కదా. ఓ ఎనిమిది నెలల తర్వాత.. ఫేస్బుక్లో ఓ పోస్ట్ కనిపించింది. ‘దూరం’ అనే కథ అది. పూర్తిగా చదివాను. నా గురించే రాసినట్లు ఉంది. ఈ కథ రాసిందెవరో అని చూశా. తనే. రమ్య. ఫోటో చుశాక నాపై వర్షపుజల్లు సంతోషంతో పడినట్లు అయింది. ఎన్ని నెలలైంది అయింది తనని చూసి. ఉండబట్టలేక, ఆ పోస్ట్ కిందే ‘కథ చాలా బాగుంది’ అని కామెంట్ పెట్టా. తను నాకు రిప్లయ్ ఇచ్చింది. నంబర్ చెప్పింది.ఫోన్ చేశా.‘హాయ్ రమ్య. ఆ రోజు నువ్వు నా పక్కనే ఉన్నా గుర్తించలేకపోయా. నా మదిలో రమ్య ఉంది. అందుకే నేను నీ కళ్లలోకి చూడలేకపోయాను. కానీ, ఆ రమ్యే నా పక్కన ఉందని తెలుసుకోలేకపోయా’నిజం చెప్పాలంటే, నువ్వు మంచివాడివి. ఇంత మంచితనం నేను ఎవరి దగ్గరా చూడలేదు చరణ్’‘నీ గురించి మీ కాలేజీ ముందు ఎన్నో రోజులు చూశా. చాలా బాధపడ్డా’‘నువ్వు అక్కడికి వెళ్తావని నాకు తెలుసు. కానీ, నీ ప్రేమ కోసం నువ్వు ఎంత ఎదురుచూస్తున్నావో, నీకోసం నేను కూడా అంతే ఎదురుచూస్తున్నా’‘నా ప్రేమ ఫలించింది రమ్యా! నేను ఎదురు చూసినందుకు నువ్వు నా సొంతం అయ్యావ్’‘అది నేను ఒప్పుకుంటా చరణ్. ఇంట్లో పెళ్లి చేస్తాం అన్నారు. అందుకే అక్కడ నుంచి ఢిల్లీ వచ్చేశా. అక్క దగ్గర ఉన్నాను. నెల క్రితమే బావకి జాబ్ హైదరాబాద్ షిఫ్ట్ కావడంతో అక్కడికి వెళ్లిపోయారు.ప్రస్తుతం రూంలో ఒక్కదాన్నే ఉంటున్నాను. కానీ నిన్ను ఎలా కలవాలో.. నీతో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ బాధే ఈ ‘దూరం’ కథ. ఈ కథ నీవరకు వస్తుందని.. నువ్వు కచ్చితంగా చదువుతావని అనిపించింది. నా ఆశే నిజమైంది’‘నాకోసం నువ్వు ఎంతో గొప్ప పనిచేశావ్ రమ్యా! నిజంగా ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవాలి నేను’ ‘కచ్చితంగా నాకూ అదే కావాలి. నిన్ను మిస్ చేసుకోలేను. నువ్వు నాకోసం ఢిల్లీ వచ్చెయ్’ ‘వస్తా. కచ్చితంగా’నెలరోజులు టైం లేకుండా ఇద్దరం ఫోన్లో మాట్లాడుకున్నాం. ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. తన దగ్గరే ఉండేందుకు ఢిల్లీలో కొత్త జాబ్ చూసుకున్నా. ఇది నా జీవితంలో ఎంతో గొప్ప విషయం. నాకు అమ్మ, నాన్న అన్నీ ఇప్పుడు రమ్యనే కాబోతోంది. నాకంటూ ఎవరూ లేరు ఈ జీవితంలో. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంటే, వరుణ్ తల్లిదండ్రులే చదివించారు నన్ను. ఈ ఆనందం ఎన్ని కోట్లు పెడితే వస్తుంది! భగవంతుడు నా మీద దయ చూపాడు. రైల్వే స్టేషన్లో దిగా. బ్యాగ్ ఓ చేత్తో పట్టుకుని నడుస్తున్నా. రమ్య కాల్ చేసింది. ‘హలో’ అనేలోపు నలుగురు దొంగలు, వెనకాల నుంచి వచ్చి బ్యాగ్ లాక్కెళ్లారు. అరసెకను నాకేం జరిగిందో అర్థం కాలేదు. వాళ్ల వెనుకే పరిగెత్తాను. మధ్యలో ఓ బండరాయి కాలికి తగిలి ఫోన్ మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. తర్వాత అది కనిపించలేదు. వాళ్లు నాకు ముప్పై అడుగుల దూరంలోనే ఉన్నారు. వాళ్ల వెనుకే పరిగెత్తాను. పరిగెడుతూ పరిగెడుతూ పక్కనుంచి వస్తున్న బస్సుని చూసుకోకుండా రోడ్డు దాటబోయాను. గట్టిగా బస్సు హారన్ శబ్దం. బ్రేక్ పడ్డ చప్పుడు. ’ఎయ్’ అని ఎవరో బలంగా లాగిన విషయమూ. అన్నీ సెకండ్లలో వినిపించి, కనిపించాయి. నా చేతిని అందుకున్న మనిషిని చూశా. ఆమె నోటి నుంచి ఏవో మాటలు అలా వస్తూనే ఉన్నాయి. అవేమీ వినిపించడం లేదు. ఆమెను అలా చూస్తూ ఉండిపోయా. రమ్య. ఆమె నా రమ్య. రమేశ్ రాపోలు -
ఓహో జామ! అయ్యో రామ!
రామతీర్థం గ్రామంలో సింగరాజుగారి దివాణం వెనుక తోటలో అనేక రకాల చెట్లు ఉన్నాయి. ఆ తోట అంతటికీ ముఖ్య ఆకర్షణ మధ్యలోనున్న జామచెట్టు. దాని చిన్న పిందె దగ్గర నుంచి పండు దాకా మహా తీపి! అది ప్రతిసారీ విరగకాసేది. దాంతో పాటుగా ఒడ్డున ఉన్న పనస, దానిమ్మ, సీతాఫలం, బత్తాయి వంటి పండ్ల జాతులు సైతం ఏపుగా ఎదిగాయి. అయితే తోటలోని మిగతా చెట్లపై చిన్నచూపు ఉండేది జామచెట్టుకి. తనకున్న ప్రాధాన్యత మిగతా వాటికి లేదనే భావం బాగా పాతుకుపోయింది.ఒకసారి జామచెట్టు ఒడ్డునున్న చెట్లను చూసి ఫక్కున నవ్వి, ‘‘చూశారా! నా విలువ! ఇన్ని చెట్లు తోటలో ఉన్నా జనాల కన్ను నావైపే! తియ్యని నా కాయలు, పండ్లు తిని మెచ్చుకోనివారు లేరు. అంతేకాదు, రామచిలుకలకు ఆవాసంగా ఉన్నాను. అవి నాపైన వాలి పళ్లు తింటుంటే ఎంత అందంగా ఉంటుందో చూసేవాళ్లకు! మిగతా పక్షులన్నిటికీ కూడా ఆహారంగా పనికి వస్తాను. మీరూ ఉన్నారు పనికిరాకుండా’’ అని గేలి చేసింది.అది విన్న పనస చెట్టుకు కోపమొచ్చింది. ‘‘అదేంటి! ఎవరి గొప్ప వారికి ఉంటుంది. నువ్వు గప్పాలు కొట్టుకోవడం తగదు’’ అంది. ‘‘ఆ! చెప్పొచ్చావులే. నీలో ఏం గొప్ప ఉంది గనుక? ఏనుగులా పెరుగుతావు గాని, నీ కాయలు బండల్లా అంతలేసి. అయినా సరే వాటిని తినలాంటే మనుషులు నానా అవస్థలు పడాల్సిందే! నీ చర్మం ఒలిచి అందులో తొనలు బయటకు తీయడానికి తట్టెడు నూనె పూసుకోవాలి. ఎంతో శ్రమ పడితే తప్ప నీ తొనలను తినే యోగం లేదు. అదైనా పిందె నుంచి పండుదాకా అవడానికి యుగాలు పడుతుంది’’ అని ఎకసెక్కంగా అంది జామచెట్టు. ఆ మాటలు విన్న సీతాఫలం చెట్టుకి మండిపోయింది. ‘‘ఏం కూస్తున్నావో తెలుసా? నీకేం తెలుసు పనస విలువ? హద్దులు మీరితే బాగుండదు’’ అని హెచ్చరించింది. ‘‘ఓహో! నువ్వా నీతులు చెబుతున్నది? నీకు మాత్రం ఏముంది గనుక? నీ పండ్లు బయటకు గుడ్లగూబల్లా కళ్లున్నట్లు ఉంటాయి గాని పైనున్న తొక్కంతా తీసి పారేస్తే గాని గుజ్జు కనబడదు. తీరా తిందామంటే కడుపులో నల్లని కాటుకలాంటి పిక్కలు అడ్డుతుంటాయి. మరి నీ పండు తినడానికి ఎంత కష్టపడాలి?’’ అని వికటంగా నవ్వింది జామ.ఆ మాటలకు దానిమ్మకు చిర్రెత్తింది. ‘‘ఏం జామా! జోరు మీదున్నావు? నువ్వొక్కత్తెవే గొప్పదానిలా మాట్లాడుతున్నావేంటి? మిగిలిన పండ్ల జాతులు నీ దృష్టిలో పనికిరానివా?’’ అని గద్దించింది.‘‘నువ్వు కూడా సీతాఫలానికి ఏమీ తీసిపోవు! ఎందుకంటే నీ కాయలు చూడటానికి ఒకేలా ఉన్నా, ఏది తీపో, ఏది పులుపో తినేదాక తెలియని అగమ్యం. చేత్తో ఒలిచి తినే సౌలభ్యమూ లేదు. నీ పండు తినాలంటే తిప్పలు పడాల్సిందే! అందువల్ల నన్ను నిలదీసే అర్హత నీక్కూడా లేదు’’ అంది వేలెత్తి చూపుతూ.జామ మాటలకు చెట్లన్నీ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాయి. ఏం జవాబు చెప్పాలో వాటికి అర్థం కాలేదు.‘‘చూశారా! మీకు నన్న ఎదిరించే దమ్ము లేదు. చూడండి నా ప్రత్యేకత ఏ పండ్ల జాతిలోనూ లేదు. ఎందుకో చెప్పనా? వినండి. ఏ పండైనా తొక్క ఒలవందే తినడానికి వీలవదు. మరి నన్ను చూడండి. చెట్లు మీంచి కాయి కోసుకుని హాయిగా నమిలెయ్యొచ్చు. వెంటనే రుచి చూసి లొట్టలేయొచ్చు. పక్షులన్నిటికీ నేను తిండి పెడుతున్నట్లే లెక్క! మిమ్మల్ని అసలు ఏ పక్షి అయినా నేరుగా తినగలదా? బిక్కమొహాలేసుకోవడం కాదు. చెప్పండి!’’ అంటూ హుంకరించింది.జామ చెప్పిన మాటల్లో నిజం ఉన్నప్పటికీ దాని అహాన్ని మాత్రం సహించలేకపోయాయి మిగిలిన చెట్లన్నీ. ఈ వ్యవహారమంతా గమనిస్తున్న తుమ్మచెట్టు తోటి చెట్లకు వత్తాసు పలుకుతూ... ‘‘నీ ప్రవర్తన సబబుగా లేదు. నీ మిడిసిపాటు ఎన్నాళ్లో సాగదు. దేనికైనా కాలమే గుణపాఠం చెబుతుంది. ఎవరి విలువ వారికి ఉంటుంది. నా కాయలు తినడానికి ఏమాత్రం ఉపయోగపడవు. కాని నా ముళ్లు తోట చుట్టూ కాపలాగా పనికొస్తాయి. దేముడు ప్రతిదానికి ఒక విలువ ఇచ్చాడు. అది గుర్తుంచుకో!’’ అంది ఎదురుదాడి చేస్తూ. ‘‘ఓహో! తోటి మిత్రులకు తోడుగా నువ్వు కూడా రంగంలోకి దిగావన్న మాట! అసలు నీ రూపం ఒక్కసారైనా చూసుకున్నావా? ఏమీ బాగులేని వారిని తుమ్మమొద్దులా ఉన్నావంటారు. నీ ముల్లు గుచ్చుకుంటే జనం గగ్గోలు పెట్టి తిట్టుకుంటారు.’’ అని చులకనగా మాట్లాడింది జామ.మరింక దాంతో తలపడలేక మౌనం వహించాయి చెట్లన్నీ. బత్తాయి, సపోటా, నేరేడు చెట్లు ఏదో అనబోతే వారించింది పనసచెట్టు. ‘‘చూశారా! మీరెవ్వరూ నాతో సాల్లేకపోయారు. అసలు నా విలువ మీ అన్నింటికంటే ఎక్కువ కాబట్టి నన్ను తోట మధ్య పాతి మిమ్మల్నందరినీ పనికిరానట్టు ఒడ్డున పడేశాడు యజమాని’’ అంటూ వికటంగా నవ్వింది జామచెట్టు.ఇది జరిగిన రెండు రోజుల తర్వాత యజమాని సింగరాజు కొందరు వడ్రంగులను వెంటబెట్టుకొచ్చి పనసచెట్టును చూపించాడు. వాళ్లు రంపాలతో దాని లావైన కొమ్మలను కోయడం చూసి, ‘‘చూశావా పనసా! నీ పనయ్యింది’’ అని హేళనగా అంది జామ. కాని వాళ్లు అదే చెట్టు కింద కూర్చొని ఆ కలపతో చిన్న చిన్న బొమ్మలు చేయడం మొదలుపెట్టారు. ఆ సన్నివేశం చూసిన జామచెట్టు ఆశ్చర్యపోవడం గమనించిన తుమ్మచెట్టు ‘‘ఎప్పుడూ పరాయివాళ్లను నిందించడమే పనిగా పెట్టుకోకు. పనస విలువ తెలిసిందా?’’ అని సూటిగా అడిగింది. అయినప్పటికీ జామకు ఏమాత్రం అహం తగ్గలేదు. సూటిపోటి మాటలు అంటూనే ఉండేది. ఇలా ఉండగా, ఒకరోజు తోట యజమాని సింగరాజు కొందరు వ్యక్తులతో తోటలోకి వచ్చాడు. వాళ్లు ఏయే చెట్లకు ఏయే తెగులు పడుతుందో చెప్పి, దానికి విరుగుడుకి కూడా సలహాలు చెబుతూ ‘‘ఈ జామచెట్టు చూస్తే బయటకు బాగానే కనిపిస్తున్నా, దీని కాండం భాగంలో తెగులు సోకింది. పైగా ఇది తోట మధ్యలో ఉండటం మూలంగా జనమంతా దాని పళ్ల కోసం మీ తోటలోకి దూకి మరీ చొరబడుతున్నారు. దాని వల్ల మీ తోట మొత్తం ధ్వంసం కావడానికి కారణమవుతోంది. దీనికున్న చీడ మిగిలిన చెట్లకు పాకక ముందే దీన్ని ఇక్కడి నుంచి వెంటనే తొలగించండి.’’ అని చెప్పడం విన్న జామచెట్టు ఒక్కసారిగా బావురుమన్నది. తప్పనిసరి పరిస్థితిలో ఆ జామచెట్టును కూకటివేళ్లతో తీసేయాల్సి వచ్చింది. అది చూసిన మిగతా చెట్లు తన అహంకారమే జామచెట్టును అంతం చేసిందని అనుకున్నాయి. - కె.కె.రఘునందన -
ఆ కనులు ఆకర్షణ గనులు
ఎంతటివారైనా ఏదో కొంత సమయాన్ని తమతో తాము కాలక్షేపం చేసుకుంటూ గడిపినా, ఆ తర్వాత కొంత సమయాన్నైనా ఎవరితోనైనా గడపాలని అనుకుంటారు. అలా మరొకరితో సమయాన్ని గడపడం కోసం వాళ్లు మరో వ్యక్తి దగ్గరికి పోవడమో లేక ఆ పరిచితుడైన వ్యక్తికి కబురుచేసి రప్పించుకోవడమో చేస్తారు. ఇది లోక సహజమైన విషయం. అయితే సాయి మాత్రం ఎవరి సాంగత్యమూ తనకి అక్కర్లేదన్నట్లుగానే ఉండేవాడు. ఒంటరితనంలోనే – ఎందరితోనో తానున్నట్లుగా అనుకుంటూ ఉండేవాడేమో అనిపించేవాడు. సూర్యుడు అస్తమించాడనగానే మసీదులోకి వెళ్లేవాడు. పడుకోబోయేప్పుడు తన వస్తువులైన చిలుం – పొగాకు – రేకుడబ్బా – సటకాలని తృప్తిగా చూసుకుంటూండేవాడు. తన మోకాళ్ల వరకూ కప్పేస్తూ ఉండే పొడవైన చొక్కా(కఫనీ)ని ధరించి ఆ లోపల ఒక గోచీని ధరించేవాడు. తెల్లని శుభ్రమైన గుడ్డని తలచుట్టూ బిగించి గట్టిగా కట్టుకోవడమే కాక, ఆ మిగిలిన గుడ్డని బాగా మెలితిప్పి ఎడమచెవి వద్ద ముడివేసి ఉంచేవాడు. తన కఫనీకి అక్కడక్కడా చిరుగులున్నా ఎంతో సంతృప్తితో ఉండేవాడు. ఎవరైనా ఆయన్ని చూడ్డానికొచ్చినప్పుడు – తాను చిరిగిన దుస్తులతో ఉన్నాననే తక్కువదనం, బిడియం ఆయనలో ఏమాత్రమూ ఉండేది కాదు. వెనక్కి వేలాడుతూంటే ఆ ముడివేసిన వస్త్రం మిగిలిన భాగం ఓ జడలాగా అనిపిస్తూ ఉండేది, దూరంగా నిలబడి చూస్తుంటే. ఒక్కోసారి ఆ ఎడమచెవి వద్ద వస్త్రాన్ని ముడివేయగా మిగిలిన వస్త్రం అక్కడి నుండి ఎడమభుజం మీదుగా వక్షస్థలమ్మీదికి వేలాడుతూ కనిపిస్తూండేది. ఒక్కోసారి వారం, మళ్లీ మాట్లాడితే పదిరోజులైనా స్నానమే చేయకుండా ఉంటూండేవాడు. పాదాలకెప్పుడూ చెప్పులు ధరించేవాడు కాదు. ఇటు తోటకి వెళ్లినా అటు చావడి వైపుకి వెళ్లినా ఒట్టి పాదాలతో వెళ్లడమే ఆయనకు అలవాటు. తిరిగి తిరిగి వచ్చాక కూచోవాల్సి వస్తే పాతబడి చిరుగులతో కనిపించే ఆ గోనెపట్టాయే అతనికి గొప్ప ఆసనంగా ఉండేది. దాన్నేదో రాజులు వేసుకునే మెత్తని పట్టువస్త్రం తొడిగిన మెత్తని దిండుగా భావించేవాడు. రాత్రింబవళ్లూ ఆ గోనెసంచి అక్కడే ఉండేది. చలి నుండి తనని తప్పించుకోవడానికి అక్కడ ‘ధుని’ (నిరంతరం నిప్పుతో వెలుగుతూండే స్థలం) ఉండేది. మసీదులో దక్షిణానికి ముఖాన్ని పెట్టుకుని, తన ఎడమచేతిని ఆ చిన్న గోడలా ఉండే కట్టడం మీద పెట్టుకుని కూర్చుని కనిపిస్తూండేవాడు. వ్యక్తిలోని అహంకారం, అజ్ఞానం, అవమానభారం, తిరస్కారం, ప్రాపంచికమైన ప్రలోభాలూ... ఇలాంటి వాటన్నింటినీ అగ్నిలో ఆహుతి చేయాలనే దానికి సంకేతంగా ధుని వెలుగుతున్నట్లుగా భావిస్తూ నిరంతరం ఆ ధునినే శ్రద్ధతో, ఏకాగ్రతతో చూస్తూ కాలాన్ని గడుపుతూ, ఎప్పుడూ ‘అల్లా హో మాలిక్!’ అని పైకి అంటూండేవాడు. అహంకారం, అభిమానం అనే రెంటికీ సాక్ష్యంగా ప్రతీకగా రెండే రెండు కర్రలని ఎప్పటికప్పుడు ధునిలో వేస్తూ ఆ అగ్ని ఆరిపోకుండా ప్రజ్వరిల్లుతూ ఉండేలా చూసుకుంటూండేవాడు. ‘అల్లాహ్ హో మాలిక్!’ అంటూ జెండాని ఎగరేస్తూండేవాడు. ఆ మసీదు చాలా ఇరుకుగా ఉండేది. అయినా సరే అదే మసీదులో తిరుగుతూండేవాడు, నిద్రించేవాడు. తనని కలవడానికి వచ్చిన భక్తుల్ని కూడా అక్కడికే రమ్మనేవాడు. మరో విచిత్రమేమంటే బాబాని కలవాలంటే ఆ మసీదులోకి పోవాలి కదా! అది చదును చేయబడిన నేల కాదు. మోకాళ్ల లోతు గుంటలు. చిన్న చిన్న గోతులు. ఎత్తు పల్లాలతో నేల ఉండేది. తన మీద గనక నిజమైన భక్తి, శ్రద్ధ, ప్రేమ, విశ్వాసం ఉంటే ఈ అసౌకర్యాలని లెక్కించరుగదా! అనేది ఆయన దృఢ విశ్వాసం. శారీరక వ్యాధుల్ని నివారించుకోదల్చిన వారూ, మనో వ్యాధుల్ని పోగొట్టుకోదల్చినవారూ, ఆయనని గురించి అనేక విధాలుగా విని ప్రసిద్ధుడైన ఆయన ఎందుకంతటి ప్రసిద్ధిని సంపాదించగలిగారో చూసి పోదామని వచ్చిన వారూ, వారి వెంట వచ్చినవారూ... ఇలా అందరూ ఆ ఇరుకు మసీదులోనే ఆ గుంతలు గోతుల్లోనే వస్తూ అసౌకర్యమనే భావనకి ఏ కోశానా గురయ్యేవారు కాదు. ఆ కారణంగానే రోజురోజుకీ వచ్చేవారి సంఖ్య పెరిగిపోతూనే వచ్చింది గాని తరగనే తరగలేదు. అదే తీరుగా ఇందరు తండోపతండాలుగా తన దగ్గరికొస్తున్నారు గదా! అని ఏనాడూ సాయి తన ఆసనమైన పాతబడిన గోనె సంచినీ, ఇరుకు మసీదునీ, కుట్లూడిన చిరుగులతో కనిపిస్తున్న కఫనీని మార్చుకుందామనే ఆలోచనకీ రాలేదు. ఇదీ నిజమైన ఫకీరు లక్షణమంటే. ఇందరు ఇన్నిమార్లు వస్తూ మరికొందరిని కూడా ఎందుకు తీసుకొస్తున్నారు? రావడంలో, వస్తూ ఉండటంలో రహస్యమేంటీ? కారణమేమిటీ? దయనిండినవీ, దర్శించేవారికి వాళ్ల తప్పుల్ని వారికి అర్థమయ్యేలా వివరించగలిగినవీ, ఓదార్పునిచ్చేవీ, బాధలు తీరిపోతాయనే తీరు ఉపదేశాన్ని మౌనంగా ఇవ్వగలిగినవీ ఆకర్షణకి గనులలాగా ఉన్నవీ అయిన ఆయన ఆ కళ్లే. ఆ రోజున తన గుర్రమే ప్రాణంగా ఉన్న చాంద్‌పాటిల్ అంత ఎండలో అంతటి ఆందోళనలోనూ ఆకర్షించినవి సాయి కళ్లే. ఆయన్ని తన ఇంట్లో అలా ఉంచుకుని నిరంతరం సేవిస్తూ ఉండటానిక్కూడా కారణం ఆ కళ్లే. ప్రతిదానికీ తగిన కారణం కావాలంటూ ఆలోచించేవాడూ, దొరికిన కారణం నచ్చని పక్షంలో, ఏమాత్రమూ నమ్మనివాడూ అయిన అన్నాసాహెబు సాయిని దర్శించిన మరుక్షణంలో ఆయన జీవితాన్ని గ్రంథరూపంలో సాయిచరిత్రగా రాయాలనే ఆలోచనకి శ్రీకారాన్ని చుట్టించినవి కూడా ఆ కళ్లే. పరమ భయంకరుడూ, తన అరుపులతో షిరిడీ గ్రామ ప్రజలకి నిద్రాభంగాన్ని కలిగించేవాడూ, ఎందరు నచ్చజెప్ప ప్రయత్నించినా దగ్గరక్కూడా రానివ్వనివాడూ అయిన రోహిల్లా సాయిని దర్శించడానికి వచ్చి, దర్శించి అక్కడే ఉండిపోయేలా చేసినవి ఆ కళ్లే. ఖండోబా దేవాలయ అర్చకుడూ, సంప్రదాయపరుడూ, బ్రాహ్మణుడూ అయిన మహల్సాపతి ‘యా! సాయీ!’ అని సాదరంగా ఆహ్వానించడానికి కారణం ఆ కళ్లే. దాసగణుకి గంగాయమునలని సాయి చూపించగలడనీ ఆ తీరు దృఢ విశ్వాసాన్ని కలిగించినది ఆ కళ్లే. అందుకే సాయిని దర్శించదలిచి వెళ్లిన అందరూ కూడా దర్శించవలసింది ఆ సాయి నేత్రాలనే. బాధలతో ఉన్నవారికి బాధ నివారిణులూ – మనోవ్యాధితో ఉన్నవారికి ఉన్న మనోధైర్య కారిణులూ – కష్టాలలో మునిగి తేలుతున్న వారికి చేతి ఊతనిస్తాననే విశ్వాసదాయినులూ – సాయికి మరింత దగ్గర కాగలుగుతామన్న ఆనంద విధాయినులూ ఆ కళ్లు. ఆ కళ్లు. ఆ కళ్లే. చూసి తీరాలనే ఆర్తితో... లోకంలో కనిపించే ఎన్నో పక్షుల్ని, పశువుల్ని, మృగాల్ని, సర్పాలని, వాహనాలని, వ్యక్తుల్ని అలా చూసేస్తుంటాం. అన్నింటినీ మన మనసు ఇష్టంతో చూడదు. అలా చూడని పక్షంలో ఆ దృశ్యాన్ని బుద్ధికి పంపించదు. అలా బుద్ధికి చేరని దేన్నీ, ఆ బుద్ధి తనలో దాచదు. ఆ కారణంగా వేటిని మన మనసు గ్రహిస్తుందో, తాను ఆనందించి బుద్ధికి అందజేస్తుందో ఆ దృశ్యాలు మాత్రమే మనకి అనుక్షణం కళ్లముందు కనిపిస్తూ ఉంటాయి. అందుకే శాస్త్రం అంది – ఏదో యథాలాపంగా చూడటాన్ని కేవలం చూడటమనీ, అదే మరి రెండవతీరుగా బుద్ధిలో దాచేంత విధంగా చూడటాన్ని దర్శనమనీ. అందుకే దైవ దర్శనం అంటూంటాం. ఈ నేపథ్యంతో పరిశీలిస్తే సాయిని చూసినవారు కొందరున్నారు. దర్శించినవారు ఎందరో ఉన్నారు. మనం ఎదుటివారిని ఎలా చూస్తామో ఆ చూపుకి ఉన్న లోతుతనాన్ని బట్టే కదా ఎదుటివారు కూడా మనని చూసేది! ఆ కారణంగా కేవలం చూడటమనే పనిని చేసిన ఎందర్నో సాయి ‘రమ్మనలేదు – ఇంకా రావేమిటి? అనలేదు – ఎందుకు రావో చూస్తాననలేదు. నేను రానే రానని చెప్పిన నానా వంటి వారికి మళ్లీ కబురు చేసి మరీ రప్పించుకోకుండానూ ఉండలేదు! ఈ దృష్టిభేదాన్ని మనం గమనించాలి. ‘గౌలిబువా’ అనే తొంభై ఐదు సంవత్సరాల భక్తుడొకాయన ఉండేవాడు. ఆయనకి సాయి మీద కాదు భక్తి. పండరీపురంలో ఉండే విఠ్ఠలపాండురంగని మీదే దృష్టంతా. సంవత్సరంలో ఉండే 12 నెలల కాలంలో 8 నెలలపాటు పాండురంగని (విఠ్ఠలుడు) మీదే బుద్ధిని నిలిపి ఆ పండరీపురంలోనే ధ్యానంలోనే కాలాన్ని గడిపి, ఆ మిగిలిన 4 నెలల కాలాన్నీ గోదావరీ నదీ తీరాన తపస్సు చేసుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తూండేవాడు. ఆ నెలల కాలమూ కూడా శ్రీహరి యోగనిద్రకి ఉపక్రమించే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఉండే కాలంలోనే. అంటే శయన ఏకాదశి (శ్రీహరి యోగనిద్రని ముగించి నిద్రనుండి లేచే రోజు) వరకు మాత్రమేనన్నమాట. ఈ మధ్యలో ఒకసారి గోదావరి ఒడ్డునే ఉంటాడు కాబట్టి షిరిడీకొచ్చి సాయిని కలిసి వెళ్తూండేవాడు. ఇలా చాలాకాలం పాటు జరుగుతూ వచ్చింది. పైన అనుకున్నట్టుగా సాయిని ఆయన చూసి వెళ్తూండేవాడే తప్ప దర్శించి వెళ్లేవాడు కాదు. ఆ కారణంగా సాయి గొప్పదనం సర్వదేవతా సమూహం సాయి అనే భావం ఏనాడూ కలగలేదు ఆ వృద్ధ భక్తునికి. తన సామాను మోసేందుకోసం ఓ గాడిదని వెంటబెట్టుకుని దానికి తగిన ఆహారం మొదలైనవి సమకూర్చేందుకై ఓ వ్యక్తిని తోడు తీసుకుని ఈ 4 నెలలపాటూ గోదావరి ఒడ్డున ఉంటూండేవాడు. అలా ఒకసారి సాయివద్దకొచ్చి సాయిని అనుకోకుండా దర్శనదృష్టితో చూశాడు. అంతే! గౌలిబువా దృష్టి మొత్తం మారిపోయింది. దాంతో పైకి అననే అన్నాడు – సాయి నవరత్నాల్లో వజ్రంలాంటి వాడు. ఏ విధంగానూ ముక్కలు కానిదీ, నాశనం కానిదీ, కోయడానికి అవకాశమీయనిదీ అయిన వజ్రం ఎలా ఆకర్షణీయమైనదో, దృఢమైనదో అలా సాయి కూడా ఎవరికీ వశుడు కానివాడు – అహంకారం లేనివాడు – తన స్థాయిని గమనించి అందరినీ రానీయకుండా ఉంచాలనీ, కొందరినీ రప్పించుకోవాలనీ భావించేవాడు కాడు. ఇదంతా నా పూర్వ ఆలోచన. ఇప్పుడు మాత్రం సాయిని ఆర్తితో భక్తితో దర్శించాక నా ఆలోచనే మారిపోయింది. సాయి నన్ను చూసిన ఆ చూపులకున్న లోతుతనంతో నాకు అర్థమయింది – సాయి నాకిష్టమైన పండరీనాథుడు పాండురంగడే – అని అనేశాడు. మనం కూడా గమనించాలి. దైవాన్ని చూడరాదనీ, దర్శించాలనీ, అలా దర్శించగలిగినప్పుడూ, దర్శించినప్పుడూ మాత్రమే భవదవతార తత్త్వం మనకి గోచరిస్తుందనీ – అలా కాక ఏదో దేవాలయానికి వెళ్లాల్సిన అవసరం అలవాటూ ఉన్నాయనే భావంతోగాని వెళ్తే దేవుణ్ని చూడటమే జరుగుతుందనీ – దర్శించడం వీలు కాదనీ, ఇలా చూసిరావడం వల్ల సమయనష్టం తప్ప ప్రయోజనం ఏ మాత్రమూ ఉండదనీను. అలాంటి ఆర్తితో చూసినప్పుడే అది దర్శనం అనిపించుకుంటుందన్నమాట. కాబట్టి సాయిని దర్శించాలని అర్థం చేసుకుందాం! అహంకారులకి మార్గదర్శనం సాయికి ఇప్పుడు బాబాసాహెబ్ అనే అతనుండేవాడు. అతనింటికే వెళ్లి దాదాపు రోజురోజంతా అక్కడే గడిపేవాడు. అంతటి ఉత్తముడు బాబాసాహెబ్. అతనికో తమ్ముడున్నాడు. పేరు నానాసాహెబ్. అతనికి సంతానం ఎంతకాలానికీ కలగలేదు. ఎదురుచూసి ఎదురుచూసి తన భార్య అనుమతిస్తే రెండో పెళ్లిని కూడా చేసుకున్నాడు. అయినా అతనికి సంతానం కలగలేదు. నానా సాహెబ్ (నానా) తహశీల్దార్ ఉద్యోగాన్ని చేస్తుండేవాడు. ప్రభుత్వోద్యోగి అయిన కారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువమందితో పరిచయాలున్నాయి అతనికి. అలాంటి నానాకి సాయి ఓసారి ‘అప్పాకులకర్ణి’ అనే అతనితో కబురు చేశాడు – ఓసారి నానాని చూడాలనుంది. తనవద్దకి రావలసిందని. ఆ మాటల్ని లెక్కచేయకుండా నానా కాలాన్ని గడిపేస్తూ వచ్చాడు. మళ్లీ మళ్లీ కబురుపంపాడు సాయి. దాంతో తనకి కబురు తెచ్చిన కులకర్ణిని నిందిస్తూ – ‘నేనేమీ ఖాళీగా ఫకీరులా లేను. ప్రభుత్వోద్యోగిని. పని ఒత్తిడిలో ఉన్నా’ అంటూ నిష్టూరంగా దెప్పిపొడుపుగాను కూడా మాట్లాడాడు. కులకర్ణి వెళ్లిపోయాక తనలో తాను నవ్వుకుంటూ – ఈ ముస్లిం ఫకీరు దగ్గరికి నేను పోవడమా? మాయా శక్తులూ, మాటల గారడీలూ ఉన్న సాయి దగ్గరికి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది? పైగా రెవెన్యూ ఉద్యోగం చేస్తున్న నా స్థాయి ఎక్కడ? చెట్టు కింద చెప్పుల్లేకుండా కూచునే సాయి స్థాయి ఎక్కడ? చేతులు కట్టుకుని ఆ ఫకీరు ఎదురుగా నిలబడితే నన్ను గౌరవించే అందరూ నన్ను చూసి నవ్వరూ?’ అని ఆలోచించి రానేరానంటూ సాయికి వర్తమానాన్ని పంపించాడు నానా. అయితే ఆశ్చర్యకరమైన అంశమేమంటే ఎందుకో తెలియదుగానీ నానా సాయిని దర్శించాల్సిన పరిస్థితొచ్చింది. నానా సాయిని చూస్తూనే ‘సాయీ! నన్నెందుకు పిలిపించారు?’‡అని అడుగుతూ ఆయన కళ్లలో కళ్లు పెట్టి చూశాడు. అయస్కాంతం దగ్గరగా ఇనుపవస్తువుని పెడితే ఎలా ఆ వస్తువు కాస్తా ఆ అయస్కాంతపు ఆకర్షణకి గురై అయస్కాంతానికి హత్తుకుపోతుందో, బలవంతాన లాగితే తప్ప ఇవతలికి రాదో అలా నానా కళ్లు సాయి కనుల ఆర్ద్రతనుండి బయటికి రాలేకపోయాయి. అంతటితో ఆగక, ‘నానా! లోకంలో ఎందరు లేరు? అయినా నిన్నే ఎందుకు పిలిపించానంటావు? నువ్వు నీ నోటికొచ్చిన తీరులో మాట్లాడినా మళ్లీ ఎందుకని ఆహ్వానించానంటావు? బాగా ఆలోచించుకో! నీకూ నాకూ మూడు జన్మలనుండీ బంధం ఉందయ్యా! అది నీకు తెలియదు. నాకే తెలుసు. అందుకే ఓసారి చూద్దామని కబురంపాను. నాకో నమ్మకం ఉంది నీ మీద – నువ్వు ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా వస్తావని. వచ్చావుగా!’ అంటూ సాయి మాట్లాడుతూ ఉంటే ఆయన దయార్ద్రమయమైన కళ్లలో తన కళ్లని తిప్పలేక ఉంచిన నానా వెక్కి వెక్కి ఏడుస్తూ, ‘సాయీ! అపరాధం. మహాపరాధం. అపచారం. మహాపచారం అయిపోయింది’ అంటూ ఉండగానే సాయి తన ఎడమచేతిని నానా తలమీద పెట్టాడు. అంతే! సాయి కనిపించలేదు. ఒక క్షణం నానాకి సాయిలో ధర్మమయమైన వింటిని ధరించిన శ్రీరామచంద్రుడు కనిపించాడు. మళ్లీ అంతలోనే జటాజూటాన్ని ధరించి పరమానందంతో ఆశీర్వదిస్తున్న శివుడు దర్శనమిచ్చాడు. మళ్లీ క్షణంలోనే మహా బలిష్ఠుడూ, నవవ్యాకరణ పండితుడూ, అమోఘకంఠస్వరం కలవాడూ అయిన ఆంజనేయుడు కనిపించాడు. నానా తనని తాను నమ్మలేక కలా? నిజమా? అనుకుని నిజమే అని అనిపించాక ‘సాయిదేవా!’ అన్నాడు హృదయపూర్వకంగా. అక్కడి నుండి దైవంతో సమానంగా కొలుస్తూంటే సాయి దర్శనం కారణంగా నానాకి సంతానం కలిగింది. సాయిని చూస్తే సంతానం కలగడమా? అది సాధ్యమేనా? సాధ్యమే! ఎలాగో చూద్దాం! (సశేషం) -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ అన్నయ్యా!! నేను ఒక అమ్మాయిని ప్రేమించా. తను, నేను వన్ ఇయర్ చాలా ప్రేమించుకున్నాం. బట్ చిన్న గొడవతో నాకు దూరమైపోయింది. నాతో మాట్లాడంలేదు. ఇప్పుడు మళ్లీ తను వేరే అబ్బాయిని లవ్ చేస్తోందని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. వాడి కోసం తను చెయ్యి కూడా కోసుకుందని తెలిసింది. కానీ తను లేకుండా నేను ఉండలేకపోతున్నా. తను మనసులో నేను లేనని తెలిసి కూడా తనపైన ప్రేమ తగ్గడంలేదు. బనానా జోక్స్ వద్దు అన్నా ప్లీజ్. ఏదైనా మంచి సలహా ఇవ్వండి ప్లీజ్.. ప్లీజ్!! – నాని నానీ... నువ్వు చాలా గ్రేట్! అమ్మాయి నో అన్నాక కూడా... అదే రేంజ్లో లవ్ చేస్తున్నావు! కీప్ ఇట్ అప్!! ‘ఏంటి సార్.. అక్కడ అమ్మాయితో వర్కౌట్ కాలేదని గిలగిల కొట్టుకుంటుంటే.. యు ఆర్ గ్రేట్.. యు ఆర్ గ్రేటర్.. యు ఆర్ గ్రేటెస్ట్ అని డప్పు కొడుతున్నారేంటి సార్!’ మెచ్చుకుంటే కూడా ఏంటి నీలాంబరి ఫీల్ అవుతున్నావు? ‘ఇలా మెచ్చుకునే బదులు మీరు తిడితేనే బెటర్ సార్!!’ నానీ.. నీవు చాలా గ్రేట్! ఎందుకంటే నీ ప్రేమ చాలా గ్రేట్.. నీ పవర్ నీ ప్రేమే!! ప్రేమిస్తూనే ఉండు!! ‘ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని అంటారా సార్!?’ ప్రేమించడానికి అమ్మాయి అవసరమా నీలూ..? ‘గాడిదలను, కోతులను, కుక్కలను ప్రేమించమంటారా సార్?’ నిన్ను నీవు ప్రేమించుకో నిన్ను నువ్వు గౌరవించుకో.. అప్పుడు ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది నానీ.. లైఫ్‌లో ఏదయినా అవ్వాలన్నా.. ఎవరైనా ప్రేమించాలన్నా.. ముందు యు మస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్!! చాలా రోజుల నుంచి నన్ను ఒక అమ్మాయి చూస్తోంది. చూస్తే లవ్ అంటారా? లేక అమ్మాయిలు క్యాజువల్‌గా చూస్తుంటారా? – రవి క్యాజువల్‌గానే చూస్తోంది. ‘సార్! మీరు శాడిస్ట్... సార్!!’ అడిగిన దానికి సమాధానం చెప్పడం శాడిజం ఎలా అవుతుంది? ‘రవి మీరంటే ఎంతో గౌరవంతో రాస్తే...’ ‘ఆం!... గౌరవం లేదు.. జీబ్రా ఈకలు లేవు...’ ‘హ... హ... హ... హా... హా..’ ఏమైంది నీలాంబరీ? ‘జీబ్రాకి ఈకలేంటి సార్?’ గాడిదకు గుడ్డేంటి అని అడగని మీకు జీబ్రాకు ఈకలేంటని అడిగే అర్హత ఎక్కడిది? ‘ఓ... హో.. గౌరవం లేదు, గాడిద గుడ్డు లేదు అని అనకుండా జీబ్రా ఈకలు అన్నారా?’ నువ్వు చూశావా గాడిద గుడ్డును కానీ ఆర్ జీబ్రా ఈకలను కానీ..? ‘హ.. హ.. హ. హా.. చూడలేదు సార్, ఇంతగా నవ్వించకండి కడుపు నొప్పి వస్తుంది.’ రవి చూశాడు! ‘వాట్!?!!?!!’ అమ్మాయి నవ్వడం!! ‘అదా...’ ఆ నవ్వు సిల్లీగా లేదు, క్యాజువల్‌గా ఉంది అని చెప్పా! ‘అంటే నవ్వు వెనక పరమార్థం లేదా సార్?’ పరమార్థం ఉంది... ప్రేమార్థం లేదు!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని నాలుగేళ్ల క్రితం ప్రేమించా. ఆమెని ఎంతకీ మరిచిపోలేకపోతున్నా. టూ ఇయర్స్ క్రితం ఆమెకు పెళ్లి అయ్యింది. ఒక పాప కూడా ఉంది. అయితే ఇప్పుడు తను నన్ను మళ్లీ ప్రేమిస్తున్నా అంటోంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పెళ్లి అయ్యి పాప కూడా ఉందని ఆలోచిస్తున్నా. ఏం చెయ్యమంటారు సలహా ఇవ్వండి ప్లీజ్!! – చందు ఎబౌట్ టర్న్ కొట్టు తిరిగి చూడకు నీకు దండం పెడతా నీకు నీలాంబరి తోటలో ఎకరం రాసిస్తా!! ‘సార్.. ఎంత పెద్ద మనసు సార్ మీది’ కదా! అందుకే నీ పొలం రాసిస్తానన్నాను!! ‘యదవది పొలమే కదా... అది కాదులే సార్ చివాట్లు పెట్టకుండా అంత ప్రేమగా అర్థించుకుంటుంటే!! మీది చాలా చాలా పెద్ద మనసు అనిపించింది.’ చందు మంచోడు! తప్పు చెయ్యకుండా మనకు రాశాడంటే... మంచి మనసు ఉన్నవాడు! అలాంటి వాడిని రిక్వెస్ట్ చేసుకోవడమే కరెక్ట్!! ‘మీ మాట వింటాడా సార్?’ ఐయామ్ కాన్ఫిడెంట్!! ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ అందరిలానే నేనూ ఓ అమ్మాయిని లవ్ చేశా. ప్రపోజ్ చేశా. తను ఇప్పుడు మాట్లాడటం లేదు. ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు బాగానే ఉండేది. బట్ ప్రపోజ్ చేసినప్పటి నుంచి నాతో మాట్లాడం లేదు సార్. రీజన్ అడగటానికి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. తనని కలిసే వీలు కూడా లేదు. ఏం చెయ్యమంటారు సార్? తన వైఖరికి కారణం ఏమై ఉంటుంది సార్? – రాజు ‘పాపం సార్ ఫ్రెండ్ షిప్లో నుంచి దూకి లవ్ షిప్లో పడాలనుకున్నాడు!!’ అమ్మాయి చెయ్యి అందించడం లేదు! ‘కొట్టుకుంటున్నాడు సార్!!’ సరిగ్గా ఈత కూడా రాదేమో..! ‘ఫ్రెండ్షిప్ ఈత అయితే మేనేజ్ చేసేవాడు సార్!’ లవ్ షిప్ అంటే తుఫాన్లో చిక్కుకున్న షిప్ లాంటిది! ‘టైటానిక్ లా మునగాల్సిందేనా సార్?’ మనోడిది టైటానిక్ కూడా కాదు పుట్టి! ‘ఇక తుఫాన్‌కి బోల్తా పడటం ఖాయం సార్! హౌ టు సేవ్ హిమ్!?!’ ప్రేమ మరచిపోతే తుఫాన్ ఆగిపోతుంది! ‘అప్పుడు సింగిల్ హ్యాండ్‌తో పుట్టిని తోసుకుంటూ ల్యాండ్ మీదకు రావచ్చు సార్!’ విషయం ఏంటంటే... ప్రేమించేటప్పుడు కళ్లు నేల మీద ఉండవు. ఫ్యూచర్ ప్లాన్ చేసేటప్పుడయినా మైండ్ ల్యాండ్ మీద ఉంటే మంచిది!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. లాస్ట్ టైమ్ ప్రయత్నంలో విఫలం అయ్యాను. దాంతో నేను ప్రేమించిన అమ్మాయి కూడా ‘నీకు జాబ్ వస్తేనే పెళ్లి చేసుకుంటా’ అంది. జాబ్ కచ్చితంగా కొడతానని నమ్మకం ఉంది. కానీ, తను ఆ మాట అనడంతో తనపై నమ్మకం పోయింది. దాంతో తనని అవాయిడ్ చేయడం మొదలుపెట్టా. కానీ, తనను మరిచిపోలేకపోతున్నా సార్. సలహా ఇవ్వండి.– ప్రదీప్ ప్రేమకు డబ్బులు అవసరం లేదు!‘అవసరం... లేదా.. సార్?’ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు!!‘ఆర్ యూ ష్యూర్?’ప్రేమించి, రోజూ కలలు కనడానికి... డబ్బు అవసరం లేదు!‘ఏదో తేడా కొడుతోంది! వాట్ ఆర్ యూ సేయింగ్..!?!’పెళ్లికి రొక్కం కావాలి అని చెబుతున్నా. షాపుకు పోయి అరటిపండ్లు అడిగితే దుడ్లు అడగడా..? సంసారం ఉద్యోగం లేకుండా చల్తా క్యా? అంతగా ఫీల్ అయిపోయి అమ్మాయినిఏదో అనుకునే బదులు, గెట్ ది జాబ్! అండ్ గెట్ ది గర్ల్!!‘ఎంత కఠినమయిన మనస్సు సార్ మీది, నిజం రఫ్‌గా చెప్పేస్తారు.’ యా..!‘ఇదిగో పచ్చి అరటిపండు.. పచ్చి నిజంలా ఉంటుంది తిని చెప్పండి ఎలా ఉందో!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్.. అన్న! నేను మా మామని ఇష్టపడుతున్నాను. అది మా పేరెంట్స్‌కి ఇష్టం లేదు. మా మామకి కూడా ఇష్టం లేదు. మా మామ నాకంటే 9 ఏళ్లు పెద్దవాడు. అయినా మా మామే కావాలనిపిస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నా. మా మామని మరచిపోలేకపోతున్నా. దయచేసి సలహా ఇవ్వండి. – షైని ‘సార్ ఏంటి సార్ తెగ ఆలోచిస్తున్నారు..?’ మామ..! ‘ఎస్ మామ..!!’ అంటే.. అమ్మకు తమ్ముడా? ‘అయితే ఏంటి సార్..?’లేక... ‘లేక..!?!’ నాన్న చెల్లెలి మొగుడి తమ్ముడా?‘ఏంటి సార్ ఈ ఇన్వెస్టిగేషన్..?’లేక...‘అబ్బా టెన్షన్‌తో చస్తున్నాను.. లేక...!?!అక్క మొగుడి నాన్న తమ్ముడా?‘ఎవరైతేనేమి సార్..?’ లేక...! ‘లేకా..!?!’ అన్న భార్య తండ్రి బ్రదరా? ‘ఎవరైతేనేమి సార్.. ప్రేమించడానికి, తాళి కట్టించుకోవడానికి?’ తాళి ఏంటి తాళి అది కూడా మామతో? ‘మామో, దోమో.. ప్రేమించాక బద్ధ శత్రువైనా... పెళ్లి చేసుకుంటారు కదా సార్! ఏం సినిమాలు సూడ్డంలేదేంటి?’ దగ్గర బంధువులతో పెళ్లిళ్లు చేసుకుంటే పిల్లలు సరిగ్గా పుట్టరు. సారీ, నో మ్యారేజ్ విత్ మామా!! ‘ఈ ముక్క ముందే ఏడవచ్చు కదా సార్.. అమ్మకు తమ్ముడా? నాన్న చెల్లెలి మొగుడు తమ్ముడా? అక్క మొగుడి నాన్న తమ్ముడా? అన్న భార్య తండ్రి బ్రదరా..? అని చంపేశారు కదా! మీరు మంచి చెప్పినా తిప్పి తిప్పి చెప్పారు కాబట్టి.. నో అరటి పండు!!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్, నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు. కానీ నాకు భయం వేసి ప్రపోజ్ చెయ్యలేకపోయాను. కొన్ని నెలలకి చెన్నై నుంచి బెంగుళూర్ వచ్చి వేరే కంపెనీలో జాయిన్ అయ్యాను. తరువాత ఆ అమ్మాయి వేరే అబ్బాయిని లవ్ చేస్తోందని తెలిసింది. సమస్య ఏంటంటే ఇప్పుడు వాళ్లిద్దరూ మా కంపెనీలో జాయిన్ అయ్యారు. పైగా ఆ అమ్మాయి నన్ను అన్నయ్యా అని పిలుస్తుంది. తట్టుకోలేకపోతున్నాను. తనని నేను లవ్ చేశానని తెలిసి కూడా తను ఎందుకు అలా పిలుస్తుందో నాకు అర్థం కావడం లేదు. సలహా ఇవ్వండి ప్లీజ్!! – వాసు ‘దొరికిపోయారు సార్!’ ఏమిటో... నీ ఆనందం భరించలేకపోతున్నాను నీలాంబరి!! ‘మీకు పడాలి సార్!’ ఏంటి పడేది? చిక్కులు పడాలి సార్! పడితే కానీ, మీకు ప్రేమంటే ఏంటో తెలియదు!!’ తెలుసుకొని నేనేం చెయ్యాలి? ‘ప్రేమ తెలియకుండా లవ్ డాక్టర్‌గా చలామణి అవ్వడం వెరీ బ్యాడ్’ ప్రేమ తెలిస్తే సబ్జెక్టివ్ ఆన్సర్లు ఇస్తాం, తెలియకపోతే ఆబ్జెక్టివ్ ఆన్సర్లు ఇస్తాం! తెలియక పోవడమే బెటర్!! ‘సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అని ఇంగ్లీష్ మాటలు చెప్పి కన్ఫ్యూజ్ చెయ్యకండి. ‘వాసుకి’ ఆన్సర్ చెప్పండి!’ ప్రేమించిన అమ్మాయి... అన్నా అని పిలుస్తుంది. ‘వాసుకి... హార్ట్ పెయిన్ వస్తుంది!’ చాలా సింపుల్! ఏం చెయ్యాలి సార్..?’ అమ్మాయి లవ్ చేస్తున్న అబ్బాయిని అమ్మాయి ముందు అన్నా అని పిలవాలి! ‘మీరు సూపర్ సార్! దెబ్బకు అమ్మాయి అన్న అని పిలవడం మానేస్తుంది!! యూ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ సార్! ఇంద ఇంద తీసుకోండి.. తొక్క తీసి గుటకేసుకోండి...!’ అంటూ నీలాంబరి నవ్వింది. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ సర్! ఇంచుమించు పదేళ్లు ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండి చదువుకున్నా. చదువు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న కొద్దిరోజులకే కార్తీక్ అనే వ్యక్తి నా లైఫ్‌లోకి వచ్చాడు. అతడి కేరింగ్‌కి పడిపోయాను. సరదాగా... నేను నిన్ను ప్రేమించడం లేదు అంటే ఏడ్చేవాడు. నన్ను ప్రాణంగా చూసుకునేవాడు. ఇద్దరం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామనుకున్నాం. దాంతో నేను పీజీ జాయిన్ అయ్యాను. అక్కడ మనీష్ అనే అబ్బాయి నన్ను ప్రేమించాడు. నేను ఆల్రెడీ కార్తీక్‌ని లవ్ చేస్తున్నానని చెప్పాను. బట్ తను వినలేదు. తన లవ్‌ని నేను అంగీకరించడం లేదని చెయ్యి కట్ చేసుకున్నాడు. దాంతో వాళ్ల మదర్ కూడా మనీష్‌ని పెళ్లి చేసుకోమని నన్ను బ్రతిమలాడారు. దాంతో నాకు, కార్తీక్‌కి భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కాలేజ్ కూడా మానేశాను. తరువాత కార్తీక్‌తో చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ కొన్ని రోజులు తరువాత కార్తీక్‌లో సడన్‌గా మార్పు వచ్చింది. ఫోన్లు, మెసేజ్‌లు తగ్గించేశాడు. నేను కాల్ చేస్తే నాట్రీచ్బుల్. మెసేజ్లకి రిప్లై ఇచ్చేవాడు కాదు. ఎదురు పడితే ముఖం తిప్పుకుని వెళ్లిపోయేవాడు. చచ్చిపోవాలనిపించింది. నేను ఏం తప్పు చేశానో అర్థం కాక చాలా ఏడ్చా. 78 రోజుల తరువాత ‘నన్ను మర్చిపోయావా?’ అని మెసేజ్ పెట్టాడు. సరదాగా అన్న మాటలకే ఏడ్చే అతను ఇంతలా ఎందుకు మారిపోయాడో, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలీడం లేదు. ప్లీజ్ సర్... సలహా ఇవ్వండి. – అఖిల పడే దాకా తోకాడిస్తూ తిరుగుతారు! పడ్డాకా చెయ్యి కూడా అందించరు!! నువ్వు వెంపర్లాడుతున్నావని తెలుసు! అందుకే ఆడుకుంటున్నాడు!! ‘ఏమి చేయాలి సార్..?’ ఆడుకోవాలి!! ‘ఏమి ఆట సార్..?’ అరటి తొక్క మీద కాలు వేసి, తొసేసే ఆట!!‘హౌ..?’మనల్ని పడేసినోడ్ని టైమే పడేస్తుంది!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్, నేను రీసెంట్గా పీజీ కంప్లీట్ చేశాను. నేను పీజీలో జాయిన్ అయిన సంవత్సరం ఒక అబ్బాయిని లవ్ చేశాను. సర్ ఆనెస్ట్‌గా చెబుతున్నాను ఇంతవరకు ఏ అబ్బాయినీ లవ్ చెయ్యలేదు తనని తప్ప. తెలుగు సినిమా హీరోయిన్లా సైలెంట్‌గా లవ్ చేశాను. బట్ చెప్పకుండా ఉండడం తప్పు అని డేర్ చేసి చెప్పాను. తన కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఎంతగా లవ్ చేస్తున్నానో తనకి తెలుసు. కానీ ‘యాక్సెప్ట్ చేశాను’ అని చెప్పడం లేదు. నాతో క్లోజ్‌గా మూవ్ అవుతాడు. మాట్లాడతాడు. తన మనసులో ఏముందో తెలుసుకోలేకపోతున్నాను. అలా అని తనని మరచిపోయి ఇంకొకర్ని మ్యారేజ్ చేసుకుని, మ్యారేజ్ చేసుకున్న పర్సన్‌ని మోసం చెయ్యలేను అన్నయ్యా. నేను లవ్ అంటే మెంటల్లీ రిలేటెడ్ అని నమ్ముతాను అన్నయ్యా. మన కల్చర్‌కి పెద్దల మాటలకి వాల్యూ ఇస్తాను. బట్ ట్రూలీ మై లవ్ ఈజ్ ట్రూ. వెయిట్ చేస్తా అని కూడా చెప్పాను తనకి. ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాను. అతన్ని మర్చిపోలేక భవిష్యత్తుని ఆహ్వానించలేక ప్రెజెంట్లో చచ్చి బతుకుతున్నాను. తనను మర్చిపోయి ఇంకొకర్ని మ్యారేజ్ చేసుకోలేను అన్నయ్యా. తనతోనే ఇంకొకసారి మాట్లాడాలా. ఏమీ అర్థం కావడం లేదు. కానీ, ఒకటి మాత్రం చెప్పగలను. నా మీద ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ తనకి లేదు. వియ్ ఆర్ నౌ గుడ్ ఫ్రెండ్స్. నేను ఏమి చేస్తే బాగుంటుందో చెప్పండి అన్నయ్యా.... ప్లీజ్... – ఉష ‘‘సార్ ఏంటో ఇలాంటి అమ్మాయిలను చూస్తే నిజంగానే ‘లవ్ డాక్టర్ ఈజ్ బార్న్ ఫర్ దెమ్’ అనిపిస్తుంది. ఏమి చెయ్యాలి సార్ మీ చెల్లెలు?’’ లైఫ్ చాలా సింపుల్. ఏదయినా కావాలనిపిస్తే ఆ మనిషికి చెప్పాలి. ‘‘చెప్పింది కదా సార్... పడేసే దాకా తోక ఆడిస్తారు.. పడ్డాక హ్యాండ్ ఇస్తారు. మీరే చెప్పారు కదా సార్..’’ చెప్పింది సరే. తనేమనుకుంటున్నాడో చెప్పలేదు. అప్పుడు అడగాల్సిందే. ‘‘అడిగితే కాదంటే?’’ మన లాస్ అనుకోకూడదు. అతని దురదృష్టం అనుకోవాలి. ‘‘చెప్పడం ఈజీ సార్. అక్కడ గుండె పట్టేసినట్టవుతుంది.’’ మంచి అమ్మాయి. మంచి మనస్సు. తప్పకుండా దేవుడు మంచే చేస్తాడు. అడగడం వరకు ఓకే. అడుక్కోవడం నాట్ ఓకే. ‘‘మరి అరటిపండు రోజూ అడుక్కుంటారు కదా సార్’’ అంటూ నీలాంబరి నవ్వింది. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ గుడ్ ఈవెనింగ్ సర్, అయామ్ ఫ్రమ్ నల్గొండ. మై ప్రాబ్లమ్ ఎబౌట్ మై మదరలు అండ్ మామ. ప్లీజ్ గివ్ మి సొల్యూషన్. నా మేనమామకి ఇద్దరు డాటర్స్. ఇద్దరూ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. ఫస్ట్ వన్ మ్యారీడ్ ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్ బై ఎ బ్రాహ్మిన్. వి ఆర్ విశ్వబ్రాహ్మిన్స్. నౌ సెకండ్ డాటర్ ప్రపోజ్డ్ అనదర్ క్యాస్ట్ పర్సన్. నౌ మై మామ నాట్ యాక్సెప్టెడ్ దిస్ మ్యాచ్. నా మరదలు విల్ మ్యారీ హిమ్ ఓన్లీ. మ్యారేజ్ చెయ్యకుంటే సూసైడ్ చేసుకుంటా అంటోంది. మ్యారేజ్ చేస్తే నా పరువు పోతుంది అని నా మామ... ఇద్దరూ – మ్యారేజ్ చెయ్యలేని వెధవ అంటారు. ప్లీజ్ గివ్ మి సొల్యూషన్. యాక్చువల్లీ నా సెకండ్ మరదలు డెలివరీ టైంలో అత్తయ్య ఎక్స్పైర్డ్. టిల్ నౌ మామ డజ్నాట్ మ్యారీ. íహీ శాక్రిఫైసెస్ హిస్ లైఫ్. బట్ నౌ వీళ్లు ఇలా చెయ్యడం తట్టుకోలేకపోతున్నాడు. – శ్రీనివాస్ అన్నా కులం కుటుంబం లాంటిది. దానికి పరిధులు ఉంటాయి. ఆ లిమిటేషన్స్ను అర్థం చేసుకోవాలి. దాన్ని గౌరవించాలి. మనసు యూనివర్స్ లాంటిది. లిమిట్లెస్.. బండ్లెస్...! దాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. వీలయితే మామకు చెప్పు. మరదలు మీద నీకు ఇంటరెస్ట్ ఉంటే మరదలుకు చెప్పు. ‘‘సార్... అన్యాయం సార్... పాపం మామయ్యకు హెల్ప్ చేద్దామనుకుంటుంటే.. పెడర్థాలు... మీనింగ్లెస్ కనెక్షన్లు పెడుతున్నారు. ఐ యామ్ వెరీ హర్టెడ్... సార్... మీరు కూడా ఇంత చీప్‌గా ఆలోచిస్తారా?’’ ఏదో ఇంట్రస్ట్ ఉన్నట్టు అనిపించింది. మామ మీద ప్రేమ ఉంటే... ఒక డజన్ అరటిపండ్లు ఇచ్చి ఊరుకుంటారు కదా? మరదలు ఎవరినో ఇష్టపడుతుంటే తొక్కలా ఫీలైపోతున్నాడు. అని నేను అలా ఫీల్ అయిపోయా... సారీ నీలాంబరీ. నన్ను క్షమించు. అపార్థం చేసుకోకు. ‘‘ఓకే... ఓకే... నేను శ్రీనివాస్‌కి చెబుతాలే – ఇంట్రస్ట్ ఉంటే డైరెక్ట్‌గా లవ్ డాక్టర్‌కి రాయమని!’’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ రామ్ అన్నయ్యా! ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడేమో. చిన్నప్పుడే అమ్మ, నాన్నలను పోగొట్టుకున్నాను. తోడబుట్టిన అక్కని పోగొట్టుకున్నాను. కానీ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తన కూడా నన్ను లవ్ చేసింది. అమ్మాయి పేరెంట్స్‌కి విషయం తెలిసి వేరే మ్యారేజ్ ఫిక్స్ చేశారు. తనకి అది ఇష్టం లేక ‘నన్ను తీసుకెళ్లి పెళ్లిచేసుకో’ అని అడిగింది. నేను వెంటనే తనను తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకున్నా. 2 ఇయర్స్ గడిచాయి. ఇద్దరం జాబ్ చేసుకునేవాళ్లం. లైఫ్ హ్యాపీగా ఉంది అనుకునే టైమ్‌లో తన బిహేవియర్లో ఛేంజెస్ చూశాను. అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది. ఆఫీస్‌కి సరిగా వెళ్లడం లేదని తెలిసింది. నాకు ఆఫీస్‌కి వెళ్తున్నా అని చెప్పి వెళ్లేది. ఎంక్వైరీ చేస్తే అక్కడ వేరే అబ్బాయితో తిరుగుతోందని తెలిసింది. నేను ఓ రోజు ఆ విషయాన్ని అడిగాను. నాకు తెలిసిపోయిందని తెలిసి, తను ఆ అబ్బాయితో వెళ్లిపోయింది. అన్నయ్యా, నేను చేసిన తప్పు ఏంటో నాకు తెలియడం లేదు. అందరినీ పోగొట్టుకున్నా నా లైఫ్ తనే అని బతికాను, ఇలాగ మోసపోయాను. చచ్చిపోవాలని వుందన్నయ్యా. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా కూడా తను చేసిన మోసం క్షణక్షణం గుర్తుకొస్తూనే ఉంది. ఏమి చేయాలి? ప్లీజ్ అన్నయ్యా హెల్ప్ మి. ఏదన్నా చెప్పన్నయ్యా. – జశ్వంత్ తమ్ముడూ జశ్వంత్! ఓరి... ఓరి... ఓరి బంగారం కింద పడకూ... కష్టాలు వస్తాయి. భయపడకూ. మనం వీక్ అయితే అందరూ తొక్కేస్తారు.కింద పడకూ. చిన్నప్పట్నుంచీ ఏదో ఒకటి పోగొట్టుకున్నావు కాబట్టి... కాన్ఫిడెన్స్ పోయింది. ఛాతీ విరుచుకుని లేచి హీరోలా నిలబడు.మనలో ఉన్న భయాలను ఒక తన్ను తన్నకపోతే... ఆ భయాలు నిజమయి మనల్ని తన్నుతాయి. గెట్ అప్ అండ్ లవ్ లైఫ్... బంగారం. ‘సార్! జశ్వంత్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. మీకీ రోజు ఒక్క అరటిపండు కాదు గెల మొత్తం ఇచ్చేస్తాను’. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్, నేను మీ ఫ్యాన్‌ని. ఫోర్ ఇయర్స్ క్రితం నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను. గవర్నమెంట్ జాబ్ వస్తే పెళ్లి చేసుకుంటా అంది. దాంతో రాని చదువుని కూడా సీరియస్‌గా తీసుకుని చదివాను. బ్యాంక్ జాబ్‌కు 1 స్టెప్ దూరంలో ఉన్నాను. ఈ క్రమంలో టు ఇయర్స్ నుంచి ఆ అమ్మాయితో మాట్లాడటం లేదు. ఈ గ్యాప్‌లో ఆ అమ్మాయికి చాలా మంది ప్రపోజ్ చేస్తే వాళ్లకు కూడా అలానే చెప్పిందని తెలిసింది. ఎందుకు ఇలా చేశావని అడిగితే నాతో గొడవ పెట్టుకుంది. మాట్లాడటం లేదు. మిగిలిన వాళ్లందరితో బాగా మాట్లాడుతోంది. ఎంజాయ్ చేస్తోంది. తనంటే నాకు అసహ్యం వేస్తోంది. బట్ మరిచిపోలేకపోతున్నా. ప్లీజ్ సర్, పరిష్కారం చెప్పండి. - సాగర్ నీలాంబరి మెల్లగా తలకాయ పైకి లేపింది. ఛైర్‌ని నా ముందుకు లాక్కొని కూర్చున్నప్పుడే రెడ్ సిగ్నల్ వెలగాల్సింది! ఏమోలే! కొంచెం పర్సనల్‌గా ఏదో మాట్లాడాలని అనుకుంటుందేమో అని నేనేమీ అనలేదు!! కుర్చీ ఇంకొంచెం దగ్గరకు లాగింది. వామ్మో... సమ్‌థింగ్ ఈజ్ నాట్ రైట్ అనుకున్నా.. తల ఇంకా స్లోమోషన్లో పైకి లేస్తోంది.ఇప్పటికైన అర్థం చేసుకుని నేను పైకి లేచి నిలబడాల్సింది. కానీ, ఎందుకో విషయం తెలుసుకునే దాకా లేవకూడదని అలాగే కూర్చున్నా! ముందు మేడం కనుబొమలు పైకి లేపింది. నా గుండె దడ పెరిగింది. ఎడమ ఐ బ్రో డ్రాప్ చేసి కుడి కనుబొమ పైకి లేపింది. కొండ ఎక్కినప్పుడు బస్సు ఆయాసపడినట్లుగా నా గుండె బ్రీత్లెస్ అయిపోతోంది! నన్ను వీక్ పాయింట్లో పట్టేసుకుందని తెలిసిన నీలాంబరి... రెండు కనుబొమలు అప్ అండ్ డౌన్ ఆడించడం మొదలు పెట్టింది. అంతే లోయలో పడిపోతున్న బస్సులా గుండె కేక పెట్టింది! మంచంపై లేచి కూర్చున్నాను ఏంటీ పీడకల అని....!? ఆలోచిస్తే విషయం అర్థం అయ్యింది! నెక్ట్స్ మార్నింగ్ నీలాంబరి ముందు నిలబడి... నిన్ను అడగకుండా ఆన్సర్లు ఇచ్చేస్తున్నానని యూ ఆర్ వెరీ యాంగ్రీ కదా! అందుకే... డ్రీమ్స్‌లో కూడా వచ్చి కళ్ళెర్ర చేస్తున్నావు! ఇవ్వాళ్ళ సాగర్‌కి నువ్వే ఆన్సర్ ఇచ్చేసెయ్యి! రేపు డ్రీమ్లోకి రాకు ప్లీజ్ అన్నా!‘ఏముంది మనోడంటే అమ్మాయికి అసలు ఇంట్రెస్ట్ లేదు. ముఖం మీద చెబితే ఫీల్ అయిపోతాడని గవర్నమెంట్ జాబ్ వస్తే చేసుకుంటా అంది. మనోడికి అంత సీన్ ఉండదనుకుని! బట్ సాగర్‌కు జాబ్ వచ్చే లాగ ఉంది, అనుకునే... వేరే సిగ్నల్స్ ఇస్తోంది. మాటలే సరిగ్గా అర్థం కావు సాగర్, సిగ్నల్స్ అర్థం చేసుకోవడం ఎంతో టఫ్ కదూ.. అంటూ నీలాంబరికి నేనే అరటిపండు అందించా!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హలో అన్నయ్యా, 8వ తరగతి నుండి ఒక అబ్బాయి, నేను ప్రేమించుకుంటున్నాం. మాది ఒకే ఊరు. ఎంబీఏ వరకు మా ప్రయాణం బాగానే సాగింది. ఎంబీఏ ఫైనల్ ఇయర్లో ఉండగా నా ప్రేమ మా ఇంట్లో తెలిసిపోయింది. కానీ మా నాన్న నాకన్నా కులాన్నే ఎక్కువగా ప్రేమించాడు. బలవంతంగా, నన్ను బ్లాక్మెయిల్ చేసి ఏడాది కిందట పెళ్లి చేశాడు. ఆ పెళ్లికొడుకు మా ఊరికే చెందిన మా దూరపు బంధువే. ఆ బావకు నా ప్రేమ గురించి మొత్తం తెలుసు. ఈ సంవత్సరంలో ఒక్కరోజు కూడా నేను సంతోషంగా లేను. తనని వదిలేసినందుకు కుమిలిపోతున్నాను. నేను ప్రేమించిన అబ్బాయి మా ఊరికి రావడం మానేసి, ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. నాకు ఇప్పుడు అతడే కావాలనిపిస్తోంది. బావకు విడాకులివ్వడానికి సిద్ధమయ్యాను. కానీ వాడికి నేనంటే ప్రేమ పోయిందని తెలిసింది. తనని మళ్లీ ఎలా చేరుకోవాలి? అన్నయ్యా. దయచేసి సలహా ఇవ్వండి. ప్లీజ్... నా పేరు చెప్పుకోలేను. మౌనమె నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు మౌనమె నీ భాష ఓ మూగ మనసా ఓ మూగ మనసా...! చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా... తెగిన పతంగానివే...ఎందుకు వలచేవో... ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో... ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో... ఏమై మిగిలేవో ‘‘మౌనమె..‘‘ కోర్కెల సెల నీవు... ఊరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా... మాయల దెయ్యానివే లేనిది కోరేవు... ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ‘‘మౌనమె..‘‘ ‘గుప్పెడు మనసు సినిమాలో పాట కదా సార్..ఎలా సార్... మీకు అమ్మాయిల బాధ ఇట్టే ఎలా అర్థమయిపోతుంది. ఇప్పుడు ఏమిచెయ్యాలి సార్ మీ బంగారు తల్లి...’అమ్మో! ఆలోచిస్తుంటేనే ప్రాణం పోతోంది నీలూ.ఏమి చెప్పాలి. ఎలా ఆ బాధను కడిగేయాలి?ఒక మగాడు ప్రేమించాడు. కానీ, ప్రేమ కోసం పోరాడలేదు. ఒక మగాడు ద్వేషించాడు. కానీ, ఆ ద్వేషాన్ని ప్రేమించిన కూతురు మీదనే ప్రదర్శించాడు. కానీ బంగారు తల్లీ... నువ్వు బాగా చదువుకున్నావు. ఈ ప్రేమ– ద్వేషాల మధ్య కొట్టుమిట్టాడకుండా... ఒక్కసారి... ఒక్కసారి...‘ఒక్కసారి... ఆ.. ఒక్కసారి... ఏమి చెయ్యాలి సార్?’ జీవితంలో ఒక్కసారి మగాళ్ళను మరచిపోయి నిన్ను నీవు ప్రేమించుకో తల్లీ. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ అన్నయ్యా, నేను, మహేశ్వరి అనే అమ్మాయి ఐదు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నాం. మా పెద్దల్ని పెళ్లికి ఒప్పించాం. కాని అయామ్ అన్‌లక్కీ. తను బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయింది. తనని మరచిపోయి లైఫ్ మళ్లీ కొత్తగా స్టార్ట్ చేశా. లాస్ట్ మంత్ నాకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది. తనని చూడగానే నాకు మహేశ్వరే గుర్తుకొస్తోంది. తనని మరచిపోలేక పోతున్నా. ప్లీజ్ అడ్వైజ్ ఇవ్వండి. – విశ్వనాథ్ విశ్వనాథ్ నాకు చాలామంది చాలా ఉత్తరాలు రాస్తుంటారు. నేనిచ్చే సమాధానాలు ఎంత తిక్కగా ఉంటాయో అంతకంటే అల్లరి ఉత్తరాలు రాస్తారు. ప్రతి లవ్ స్టోరీని కొంచెం అనుమానంగానే చూస్తాను. ఎందుకో నిన్ను నమ్మబుద్ధి వేస్తోంది. ఐ హోప్ యూ ఆర్ టెల్లింగ్ ది ట్రూత్. మహేశ్వరి వెళ్లిపోయింది. నువ్వు ఉండిపోయావు. నాకు ఎంతో నచ్చిన ఎంతోమంది వెళ్లిపోయారు. నేను నిజంగానే మంచి స్నేహితుడినయితే నేనింకా ఇక్కడే ఎందుకు ఉండిపోయాను అనిపిస్తుంది. కానీ ఉన్నాను. ఉండిపోయాను. సంతోషంగానే ఉన్నాను. అలా అని నా స్నేహితులను, ఆప్తులను మరచిపోయానన్నది నిజం కాదు. మనుషులం.. బాధ తొలిచేస్తుంది... ఆ తరువాత జీవితం నడిపించేస్తుంది. నువ్వు నడిచేసేయి. బ్రతికేసేయి. స్మృతుల వనం నుంచి నాలుగు పూలు తెంచి నీ కొత్త స్నేహితురాలికి ఇచ్చేసెయ్. ‘సార్ ఎమోషన్‌తో అరటిగెల మీద కొట్టారు సారూ... మీరు అంతగా ఫీల్ అవకండి... ఆగండి. మీకు ఒక మంచి బనానా స్మూతీ చేసుకొస్తా’ అంటూ వెళ్లింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ గురువుగారు!! నాలుగు నెలల క్రితం ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. నేను ఓకే చెప్పాను. లవ్‌లో పడిన రెండోరోజునే తను నాకు ఫోన్ చేసి ‘‘బంగారు, నేను నిన్ను ప్రేమించి రెండు రోజులే అవుతోంది కానీ, నువ్వు లేకుండా నేను ఉండలేను రా! నిన్ను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేను రా’’ అని చెప్పింది! ఆ క్షణమే నిర్ణయించుకున్నా తనే నా ప్రాణమని! అయితే, చాలారోజులుగా నన్ను ఇంకో అమ్మాయి(నా క్లాస్మేట్) లవ్ చేస్తోంది. నేను ఇగ్నోర్ చేశాను. కానీ ఒకరోజు ఆ అమ్మాయి నా కోసం హైదరాబాద్ వచ్చింది. నాకు ఏం చెయ్యాలో తెలియక నా బంగారానికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు తన సాయం కోరాను. (మా క్లాస్మేట్ని తిరిగి ఇంటికి పంపించేస్తా.. ఒకవేళ వెళ్లనని మొండికేస్తే ఈ ఒక్క నైట్‌కి మీ ఇంట్లో ఉంచుకుంటావా బంగారం అని అడిగాను.) ఓకే అంది. ఆ రోజు నైట్ అంతా బాగానే మాట్లాడింది. కానీ, మరునాడు ఫోన్ చేసి ‘‘నేను నైట్ అంతా బాగా ఆలోచించా.. నేను నీకు కరెక్ట్ కాదు రా! నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేసి ఉండకపోతే... తను నీకోసం ఇంత దూరం ఎందుకు వస్తుంది? తనే నీకు కరెక్ట్, నాకు ఇంక ఫోన్ చెయ్యకు! మెసేజ్ చెయ్యకు!!’’ అని ఫోన్ పెట్టేసింది. తను మాట్లాడక 30 డేస్ అవుతుంది. అప్పటి నుంచి నేను ఏం తినడం లేదు. తనని మర్చిపోలేకపోతున్నా. నిజానికి మా క్లాస్మేట్ విషయం తనకి చెప్పకుండానే ఉండేవాడిని కానీ, భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకూడదని, అర్థం చేసుకుంటుందని నమ్మి చెప్పాను. ఇలా అవుతుందనుకోలేదు!! ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. – విక్రమ్ నీలాంబరీ, ఏమంటావ్? ‘సార్ అంతా నాటకం సార్!! పోజులు కొట్టాడు. అసలు ఇంకో అమ్మాయి లేదు సర్. బిల్డప్ ఇచ్చి తను ఎంత గ్రేటో.. అమ్మాయిలు తనకోసం ఎంతగా రెచ్చిపోతున్నారో చెబితే ఈ అమ్మాయి ఇంకా అతుక్కుపోతుందని అనుకున్నాడు.’ చటుక్కున ఊడిపోయింది ఇప్పుడు క్యా కర్నా!? ‘మీరే చెప్పండి సర్ డిస్ట్రబ్ అవుతాడేమో!! కొంచెం కైండ్‌గా చెప్పండి సర్!!’30 డేస్ నుంచి ఏమి తినలేదు. ముందు ఒక అరటిపండు తిను! ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్‌తో సెకెండ్ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫోన్ చేయించు! ‘ఏం చెబుతుంది సార్... ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ సెకెండ్ గర్ల్‌ఫ్రెండ్‌తో...?’ నేను తనని ప్రేమించాను కానీ, తను నిన్నే ప్రేమిస్తున్నాడు అని చెప్పిస్తే వర్క్అవుట్ అవుతుంది!! ‘సార్... చెప్పిస్తే...??’ నేను సిన్సియర్‌గా ఆన్సర్ చెబుతుంటే నువ్వు అరటిపండులో తొక్క అడ్డం వేస్తున్నావు!! ‘ఐ మీన్ చెప్పిస్తే...? అంటే స్లిప్పర్‡లాంటివి ఏవైనా ఇస్తే.... ఫీల్ అవుతాడేమో సార్ అని’ హో!! యు మీన్ చెప్పిస్తే...! అలా జరగదు!! మనోడు చాలా సిన్సియర్!! ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ అర్థం చేసుకుని సెకెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ని కన్విన్స్ చేస్తుంది. అంతా హ్యాపీస్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ అన్నయ్యా! మీరిచ్చిన ధైర్యానికి చాలా థ్యాంక్స్. నాన్న నాతో మాట్లాడటానికి ముందు అక్కతో మాట్లాడాను. మా ఇంట్లో వాళ్లు తనతో లైఫ్ రిజెక్ట్ చేశారు. మర్చిపో అని చెప్పారు. నెల అయింది సంతోషం కోసం సెర్చ్ చేస్తున్నా, దొరకడం లేదు. చావు ఒక్కటే పరిష్కారం కాదు కదా అని వెయిట్ చేస్తున్నా. నమ్మకాన్ని కోల్పోయాను అన్నయ్యా! తను నాకు ఒక మెయిల్ చేశాడు. మీకు చెప్పుకోవాలి అనిపిస్తుంది అన్నా. దయచేసి చదవండి. ‘‘సారీ రా, నేను జాబ్ వదిలేశాను. నువ్వు లేనప్పుడు ఈ జాబ్ చేసి నేనేమి చేయాలి? నాకు అమ్మ అయినా నాన్న అయినా నువ్వే. హ్యాపీ ఫాదర్స్ డే. ఏదో ఒక రోజు నిజం నీకు తెలుస్తుంది. అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. మీ నాన్నగారు అంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ నువ్వు నన్ను, ఆయనను బాధ పెడుతున్నావు. సారీ.. నీ లైఫ్ నీ ఇష్టం. కానీ... నా లైఫ్‌తో ఆడుకున్నావ్. దానికి నాకు సమాధానం కావాలి. నువ్వు ఇవ్వలేదో, వెళ్లి మీ నాన్ననే అడుగుతాను.’’ ఇది అన్నయ్యా... తనని నేను మోసం చేయలేదు. తన జీవితంతో ఆడుకోలేదు. తను నా కోసం ఎంత ఎదురు చూస్తున్నాడో నేను కూడా అంతలా ఎదురుచూస్తున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారన్నయ్యా? – షాము నీ అదృష్టం బాగుండి వర్కవుట్ అవ్వలేదు తల్లీ. ‘‘సార్! ఏంటి సార్ లవ్ వర్కవుట్ కాకపోతే. మీరు కాకమీద ఉన్నారు... వెరీ బ్యాడ్... అది కూడా మీ సిస్టర్ లవ్ వర్కవుట్ కాకపోతే ఏంటి సర్ ఈ శాడిజం?’’ వాడు గాన్ కేస్. నా బంగారం లక్కీ. బతికి బయటపడింది. పెళ్లీ గిళ్లీ అయితే లైఫ్ లాంగ్ హ్యాపీ ఫాదర్స్ డే, మదర్స్ డే అని తలకాయ తింటాడు. ‘‘మీరు ఇతరుల లవ్‌ని అరటిపండులా తింటారు... వెరీ బ్యాడ్.’’ అని నా చేతిలోని అరటిపండును లాక్కుంది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ సర్.. నా పేరు మీరా. నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. నేను నో చెప్పాను. బట్ మంచి ఫ్రెండ్స్‌గా ఉందామని చెప్పాను. తను మాత్రం తన లవ్‌ని ఒప్పుకోవాలని ఫోర్స్ చేస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ప్లీజ్ సలహా ఇవ్వండి. – మీరా కపూర్ ‘సార్ ఇవాళ అరటిపండు లేదు’ వై? ‘మార్కెట్లో లేవు’ మీ తోటలో లేవా? ‘ట్రాన్స్పోర్ట్ లేదు’ లారీలు స్ట్రైకా..? ‘సీజన్ అయిపోవస్తోంది కదా, మళ్లీ దొరకవని లారీలన్నీ మామిడి పండ్లు తోలుతున్నాయి సార్’ ఆటో లేదా? ‘లారీలు, బస్సులు, ఆటోలు, రిక్షాలు, సైకిళ్లు అంతా... మ్యాంగో.. మ్యాంగో.. అని డ్యూయెట్లు పాడుకుంటూ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి’ ఒక గెల నువ్వు తేవచ్చు కదా..? ‘కుదరదు సార్. మీరు తినరు, నన్ను తిననివ్వరు. నాకొక మ్యాంగో కావాలిగా..’ శంకర్ సినిమాలో ‘నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలిగా..’ అన్నట్లు ఏంటా పాట. ఏంటా డాన్స్.‘నాకు మామిడి పండు కావాలి’ ‘ఓకే అయితే మీరు అరటిపండు తెచ్చుకొని తినండి. నేను మామిడి పండు తెచ్చుకున్నాను... తింటాను.’ అదీ విషయం మీరా బంగారం. వాడ్ని లవ్ తెచ్చుకుని ఏమయినా కర్నే దో. నువ్వు మాత్రం ఫ్రెండ్ రిక్వెస్ట్ మీదే ఉండు. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్, నాకు రీసెంట్గా పెళ్లి అయ్యింది. ఇద్దరం బాగానే ఉంటాం. కానీ మా ఇద్దరి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలను కూడా వాళ్ల ఫ్యామిలీ ముందు చెబుతుంటారీయన. నేను మూడ్ ఆఫ్‌లో ఉంటే ఫ్యామిలీ అందరి ముందు ‘తనకు ఏం చెప్పకండి, అసలే దానికి విసుగు’ అని అంటారు. అందరి ముందు నన్ను హేళనగా మాట్లాడం, నాపై జోక్స్ వేయడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైఫ్‌లో నాకు సపోర్ట్‌గా ఉంటారా? అనే భయం వేస్తుంది. ప్లీజ్ సార్ మంచి సలహా ఇవ్వండి. – స్వాతి చూడు నీలాంబరి నువ్వు అంతే అంతమంది రీడర్స్ ముందు నన్ను ఎన్నేసి మాటలంటావు? మై హార్ట్ ఈజ్ వెరీ హర్టెడ్. ఈ క్వశ్ఛన్కి నువ్వే సమాధానం ఇవ్వు. తోటి అమ్మాయి బాధను, నా బాధను అర్థం చేసుకునే అవకాశం దొరికింది కమాన్ ఫైర్. ‘వద్దులే సార్ చాలా సున్నితమైన విషయం చెబితే హస్బెండ్ హర్ట్ అవుతాడు చెప్పకపోతే మీ చెల్లెలు హర్ట్ అవుతుంది... చాలా చిక్కు ప్రశ్న. మీరే సమాధానం ఇవ్వండి నేను అరటిపండు తెస్తాను.’ సరే నేనే చెబుతా. చాలా కష్టం బంగారు తల్లీ! మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ మొగుళ్లు అంతే! వాళ్లు అంతా సరదాగా అన్నాం అనుకుంటారు. కానీ, మనకు ఎంత బాధ కలుగుతుందో అర్థం చేసుకోరు. అది అహంకారం కాకపోవచ్చు తాను చిన్నప్పుడు చూసిన తాతయ్యో బాబాయో బావో వాళ్ల భార్యలను ట్రీట్ చేసిన తీరు అయ్యిండొచ్చు. ఆ రోజుల్లో భార్యలు బాధపడే వారు కానీ చెప్పుకునే వారు కాదు. తప్పనిసరి కాబట్టి ఆడవాళ్లు ఇన్సల్ట్ అయినా నవ్వేసేవారు. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. నాకు తెలిసి నీ భర్త ఇది శాడిజంతో చేస్తున్న పని కాదు. తెలియక చేస్తున్న పని. కొంత మందికి అలా ప్రేమ చూపించడం కూడా ఒక సరదా... బీ క్లియర్ విత్ హిం. చెప్పేసెయ్ నీకు చాలా బాధ కలుగుతుందని. జీవితాంతం ఈ హింస భరించలేనని. నిన్ను గౌరవించడం నీకు చాలా అవసరం అని. నీకు తనంటే ఎంత గౌరవమో చెప్పు. నిజానికి పెళ్లిలో ప్రేమకంటే గౌరవమే ముఖ్యమని చెప్పు. తాను ఆట పట్టిస్తున్నాడంటే నిన్ను తప్పకుండా గౌరవిస్తాడు. డోంట్ వర్రీ. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ సర్! నా వయస్సు 20, నేను మా ఫ్రెండ్ సిస్టర్ పెళ్లికి వెళ్లినప్పుడు ఒక అమ్మాయిని చూశాను. అప్పుడు నా వయస్సు 16. తను నాకు బాగా నచ్చింది. తరవాత ఒక జాతరలో మళ్ళీ చూశాను. మరోసారి ఒక గుడిలో చూశాను. అప్పుడు నాకు అనిపించింది నేనే కాదు తను కూడా నన్ను ప్రేమిస్తుందని. తను నన్ను చూసి నవ్వుతున్నప్పుడు తన కళ్లల్లో ఆ ప్రేమని చూశాను. మరో విషయమేమిటంటే తను మా ఫ్రెండ్ కజిన్. మా ఫ్రెండ్ ఉద్దేశంలో ఇది ప్రేమ కాదు. కానీ నేను ఒప్పుకోలేకపోతున్నాను. సలహా ఇవ్వండి. – వెంకట్ మోహన్ చెప్పు నీలాంబరీ, వెంకట్ మోహన్‌కి ఆన్సర్ చెప్పు.‘ఏంటి సార్, అమ్మాయిలకందరికీ మీరు ఆన్సర్ చెబుతారు. అబ్బాయ్‌లకు నన్ను చెప్పమంటారు’?బాయ్స్ లైక్ యు మేడం!‘మరి గార్ల్స్కి నేను నచ్చనా సార్..?’గార్ల్స్కి నువ్వంటే డివోషన్!‘మరి బాయ్స్‌కి..?’ ఎమోషన్!‘అయితే విను వెంకట్ మోహన్... అమ్మాయి నవ్వితే కళ్లల్లో లవ్ కనబడింది కదా నీకు? నీలాంటి గొప్ప ప్రేమికుడిని నేను ఇప్పటి దాకా చూడలేదు. అదే వేళలో ప్రపోజ్ చెయ్యాల్సింది!’‘అప్పుడు గానీ ప్రేమ పిచ్చి కుదిరేది కాదు..! అదేదో సినిమాలో మహేష్ బాబు బ్రహ్మాజీని జాతరలోనే తగులుకుంటాడు, మళ్ళీ లైఫ్‌లో వెంకట్ మోహన్ లైఫ్‌కి పనికి రాకుండాపోతాడు!’ ‘సార్. ఆన్సర్ నేనిస్తుంటే.. మధ్యలో ఈ కామెంట్స్ ఏంటి సార్..? నువ్వేమీ పట్టించుకోకు వెంకట్ మోహన్, ఈ సారి అమ్మాయి ఎక్కడ కనబడితే అక్కడ ప్రపోజ్ చేసెయ్యి...’‘అప్పుడు గానీ తిక్క తీరదు! అమ్మాయి ‘హెల్ప్’ అని కేక పెడుతుంది. వీడ్ని కనబడిన వాళ్లల్లా వాయించేస్తారు!’‘సార్, డోంట్ ఇంటర్ఫియర్. నువ్వేం భయపడకు మోహన్ వెంకట్, ఇంటికెళ్లి మరీ ప్రపోజ్ చేసెయ్యి!’వాడి పేరు వెంకట్ మోహన్, నాట్ మోహన్ వెంకట్.. టెన్షన్లో పేరు మార్చేసావు.‘నాకేమి టెన్షన్ సార్..? ఒక మంచి లవర్ని ఎంకరేజ్ చేస్తున్నాను..’ ‘మానసికంగా బలోపేతం చేస్తున్నావు గుడ్... కానీ ప్రపోజ్ తరువాత, అంగవైకల్యానికి గురి అయితే... దెబ్బలు మానుతాయి కానీ, గాయాలు మానవు! నీలూ ప్లీజ్ అండర్‌స్టాండ్!’‘కొడతారని పిరికివాడిలా పారిపోమంటారా సార్..!’‘ఇప్పుడు ట్వంటీ ఇయర్స్! కొంచెం సెటిల్ అయ్యాకా ట్రై చేస్తే బెటర్!’ ‘మీరు అరటిపండు రేపు తింటే బెటర్..’ అని విసురుగా టర్నింగ్ ఇచ్చింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నా పేరు పొట్టోడు. నా లవ్ పేరు పొట్టి. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ వన్ వీక్ నుంచి పొట్టి నన్ను ఎందుకో అసహ్యించుకుంటోంది. నేనేం తప్పు చెయ్యలేదు సర్!! చచ్చిపోవాలన్నంత బాధగా ఉంది. నేను ఏం చేస్తే నా పొట్టి మళ్లీ నాతో మాట్లాడుతుంది సార్? సొల్యూషన్ చెప్పండి ప్లీజ్!! – యశ్వంత్ పొట్ట చిరిగిపోతుంది!! పొట్టా పొట్టి చేసుకున్నారు కట్టి! ‘‘కట్టి అంటే ఏంటి సార్’’ ‘‘కట్టి అంటే కటీఫ్!!’’ ‘‘కటీఫ్ అంటే?’’ ‘‘పొట్టోడు అర్థం చేసుకుంటాడులే...’’ ‘‘నాకు తెలియాలి.. ఐ వాంట్ టు నో.. నా మానాన నేను పండిన అరటిపండు తింటుంటే పొట్టా.. పొట్టీ.. కట్టీ.. కట్టీఫ్ అంటూ.. బట్టీ కొడుతుంటే.. ఎలా? హౌ..? నాకు తెలియాలి!!’’ ‘‘కటీఫ్ అంటే చిన్న ఫైట్‌తో అమ్మాయి గుడ్ బై చెప్పిందన్నమాట!! ‘‘మరి ఫిటీఫ్ ఎలా చెయ్యాలి సార్?’’ ‘‘ఫిటీఫ్ అంటే...’’ ‘‘ఆపోజిట్ ఆఫ్ కటీఫ్..’’ ‘‘వెరీ ఈజీ ఓ గెల అరటిపండ్లు తట్టిలో తీసుకెళితే కటీఫ్ ఫిటీఫ్ హోజాతా!!’’ ‘‘తట్టీ అంటే..’’ ‘‘గంప.. గంపెడు ఆశలకు అరటి గంప...!’’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటేప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్,హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! డెయిలీ నేను లవ్ డాక్టర్ చదువుతున్నాను. అసలు లవ్ చెయ్యడం అవసరం అంటారా? హాయ్‌గా చదువుకోవడం మానేసి ఎందుకు ఇదంతా చెప్పండి అన్నయ్యా మీ మాటల్లో! ఈ చెల్లెలి కోసం!! – ప్రణీత అసలు లవ్ డాక్టర్ అనవసరం చెల్లి... ‘‘ఏంటి సార్ పోకింగ్ యువర్ ఐ విత్ యువర్ ఓన్ ఫింగర్...’’ ‘‘నీలాంబరీ, మనం తినేది అరటిపండు. ఆపిల్ కాదు... కొంచెం తెలుగులో స్పీకు ప్లీజ్!’’ ‘‘లవ్ డాక్టర్ అవసరం లేదు అంటే ఎలా సార్? దుకాణం బంద్ చేసుకుంటే ఏమి తింటాము..?’’ ‘‘డాక్టరా పాడా ఈ మోసం నేను కంటిన్యూ చెయ్యలేను!!’’ ‘ఏంటి సార్ సడన్‌గా ఈ బిహేవియర్..’ అంటూ నా పల్స్ చెక్ చేసింది నీలాంబరి!! ‘‘సార్ మండిపోతోంది జ్వరం.. కాలిపోతోంది ఒళ్లు.. ఉడికిపోయింది బ్రెయిన్..’’ ‘‘ఎవరో ఎవరినో ప్రేమిస్తే దాన్ని మనం బిజినెస్ చేసుకోవడం ఏంటి నీలాంబరి!!’’ ‘‘ఏంటి సార్ సన్యాసుల్లా మాట్లాడుతున్నారు ఆగండి... అరటిపండు జ్యూస్ తెస్తాను’’ అని పరుగెత్తింది నీలాంబరి!! ‘‘చూశావా చెల్లీ!! ఇదీ లొల్లి. ఒకరి ప్రేమ ఇంకొకరికి చులకన! ఒకరి బాధ మరొకరికి పలచన!! లవ్ అంతా మోస్ట్లీ పెంటే. వితౌట్ పెంట లవ్ అంటూ చెయ్యాలంటే కెరియర్ను లవ్ చెయ్యి! తప్పకుండా నిన్ను కెరియర్ లవ్ చేస్తుంది. ఈ ఆన్సర్ అందరికీ చూపించు. అప్పుడు కానీ నీలాంబరి తిక్క తీరదు. తిక్కోళ్ల లెక్క మీరదు. ఓకే నా!?’’ -ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని లవ్చేస్తున్నా. తను నన్ను లవ్ చేస్తోందో లేదో తెలియడం లేదు. కానీ నా వైపు బాగానే చూస్తుంది. తనకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు. తను ఇప్పుడు మా విలేజ్ నుంచి చాలా దూరంలో జాబ్ చేస్తోంది. నేను తనని చూడకుండా ఉండలేను. ఆ అమ్మాయిని మరిచిపోలేకపోతున్నా. తనని మరిచి పోవాలంటే ఏం చెయ్యాలి సార్! – ప్రేమ్‌కుమార్ డోలా పడమరకు తిరిగి 5:45 పిఎమ్ నుంచి 7:45 పిఎమ్ దాకా సింగిల్ లెగ్.. ‘ఏ లెగ్ సార్..?’ లెఫ్ట్ లెగ్ మీద నిలబడి... ‘నిలబడి..’ చేతిలో చెంబు తీసుకుని... ‘ఏ చెంబు సార్..?’ ఇత్తడి చెంబుతో దే తడి... ‘పోచమ్మ గుడి దగ్గరా సార్..?’ వన్ డ్రాప్ ఎట్ ఎ టైమ్ డ్రాప్ చేస్తూ... ‘చేస్తూ...?’ ఈ మంత్రం పఠించాలి! ‘వాట్ మంత్రం సార్.. టెన్షన్‌తో చచ్చిపోతున్నా..’ డోలా డోలా దిల్ జర జరా.. మరచిపోత నిన్ను జర జరా.. జాగు మాని లవ్ వదలరా.. ఇత్తడి చెంబుతో జలజల.. మరచిపొమ్మన్నాడు లవ్ డాక్టరా... ‘సార్ సూపర్ సార్ పోకిరి సినిమాలో ట్యూన్‌తో మంత్రం! ఎంజాయ్ ప్రేమ్ కుమార్ డోలా!!’ మనం ఇక అరటిపండు తింటే పోలా...!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం గూగుల్ కన్నా లవ్ డాక్టర్నే ఎక్కువ ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు నాకు మీ గైడెన్స్ చాలా అవసరం! నా వయస్సు 21. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను కూడా నన్ను ఇష్టపడింది. (తను కన్వర్టెడ్ క్రిస్టియన్. దేవుడు, పేరెంట్సే లోకం. తనది చాలా స్ట్రయిట్ బిహేవియర్.) వన్ ఇయర్ బాగానే గడిచింది. ఓ రోజు తను కాల్ చేస్తే... నేను బుద్ది తక్కువై.. మనసు బాగోక... ‘ఇంకెప్పుడూ కాల్ చెయ్యకు’ అనేశాను. అంతే, ఇంక తను కాల్ చెయ్యలేదు. ఇప్పటికి ఒన్ ఇయర్ అవుతోంది. ‘చదువు పూర్తి అయ్యాక.. ఆ దేవుడే మనల్ని కలుపుతాడు. అప్పటిదాకా బాగా చదువు, ఏం ఆలోచించకు’ అని చెప్పింది. బట్ తనని అస్సలు మరిచిపోలేకపోతున్నాను. ఈ చదువు పూర్తి అయ్యేలోపు తనకి సంబంధాలు చూస్తారేమో అని భయంగా ఉంది సార్! – హేమంత్ ట్యాంక్‌లో నీళ్లు అయిపోయాక ట్యాప్ కట్టి ఏమి లాభం బ్రో.. ‘సార్ టూ మచ్! పాపం అంత సిన్సియర్‌గా లవ్ చేస్తున్నాడు. ఏదయినా సాయం చెయ్యండి లేకపోతే... మీ లైఫ్‌లో లవ్వే ఉండదు.. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే... తొక్క లైఫ్‌లో అరటిపండే ఉండదు..’ తొక్కలో లవ్వు ఉంటే ఏమి? లేకపోతే ఏమి? పండు తింటే వచ్చే కొవ్వు లవ్వు కంటే బెటర్! ‘సార్ మీతో ఆర్గ్యుమెంట్ కంటే చెవిటి వాని ముందు శంఖం ఊదుకోవడం బెటర్..’ సరే... హేమంత్ ట్యాంక్‌లో నీళ్లు ఫిల్ అవ్వాలంటే...! ‘ఫిల్ అవ్వాలంటే...?’ హార్ట్‌లో అమ్మాయి లవ్ ఫీల్ అవ్వాలి... ‘ఎలా ఫీల్ అవ్వాలి..?’ అరటిపండు ఇస్తావా నీలాంబరీ..? ‘కరెక్ట్‌గా చెబితే దేఖేంగే..!’ అమ్మాయిలాగా నువ్వు కూడా సిన్సియర్‌గా చదువుకుని గ్రేట్ ఫెలో అయి మళ్లీ ప్రపోజ్ చెయ్యి...! ‘అక్కడ అమ్మాయికి ప్రపోజల్స్ చూస్తున్నారు సార్...!’ మనోడికి ఇంకా 21 ఇయర్స్ ఓన్లీ! ఏం తింటాడు? ఏం తినిపిస్తాడు? ముందు కెరియర్. తరువాతే, ట్యాంక్ ఫుల్ ఆఫ్ లవ్. ఇదే ఫైనల్!! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! ‘అసలు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నామా! లేదా!!’ అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి సార్!? ప్లీజ్ చెప్పండి సార్? – గణేష్ డజన్ అరటిపండ్లు తిన్నా ఆకలి తీరదు! ‘ఒక్క అరటిపండు తినక పోయినా ఆకలి ఉండదు’ అని లింకు కలిపింది నీలాంబరి! తొక్క మీద కాలేసినా... ‘జారి వీపు పగిలినా...’ అర్థం కాదు! ‘డిఫరెన్స్ తెలియదు’ తమన్నాను చూసినా... ‘ప్రియాంకాని చూసినా..’ తనే కనబడుతుంది! ‘తనే వినబడుతుంది!’ మహేష్‌ని చూస్తే... నువ్వే కనిపిస్తావు! ‘అర్జున్‌ని చూస్తే... నువ్వే అనిపిస్తావ్...! ఎండ వెన్నెలలాగా... తాటి చెట్టు స్ట్రీట్ లైట్‌లాగా.. తిట్లు బ్లెస్సింగ్స్ లాగా... ‘దెబ్బలు అక్షింతలు లాగా..’ ఇలా అనిపిస్తే...! ‘అలా అనిపిస్తే..?’ లవ్... లవ్... లవ్...! ‘ఆ తరువాత డాక్టర్... డాక్టర్... డాక్టర్...’ అని నవ్వింది నీలాంబరి! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్, రామ్ సర్! నేను 2 ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. నెల క్రితం ఇద్దరి ఇంట్లో మా విషయం తెలిసిపోయింది. ఓకే అన్నారు. కానీ నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సౌదీ వెళ్లి మనీ సంపాదించాలని ఉంది. కానీ అమ్మాయి వినడం లేదు. తనకి డైలీ లవ్ డాక్టర్ చదివే అలవాటు ఉంది! మీరే తనకు చెప్పండి సార్! – బాషా అమ్మాయి గారూ! దీనిని బాషా రికమండేషన్ లెటర్‌గా భావించండి! మీరు లవ్ డాక్టర్ రెగ్యులర్‌గా చదువుతారటా! బాషా చదవడు కాబట్టి మనం సీక్రెట్‌గా మాట్లాడుకుందాం! ‘సార్ తొక్క మీద కాలేసినట్టున్నారు’ అని నీలాంబరి ఎంట్రీ ఇచ్చింది. వై? ‘బాషా కూడా సీక్రెట్‌గా లవ్ డాక్టర్ చదివేస్తే..?’ క్యా హోతా? ‘మీ కొంప మునుగును..!’ వానాకాలం కొంపలు మునుగుడు సర్వ సాధారణం! ‘సార్ నాట్ దట్ కొంప... మీ ప్రాక్టీస్ మునుగున్!’ మన ప్రాక్టీస్ ఏమైనా అరటి తోటా... మునిగితే మునగడానికి? ‘సరే సార్! కానివ్వండి... అక్కడ అమ్మాయి సీక్రెట్ కోసం వెయిటింగ్!’ బంగారం... బాషాకి పైసల్ కావాలె! దిల్ అక్కర్లేదు! ఎందుకంటే నువ్వు ఆల్ రెడీ కమిట్ అయిపోయావు కదా! అందుకే నువ్వు లైట్! పైసల్ టైట్! ఇదేనమ్మా మగవాడి లక్షణం! అదే నువ్వు నాట్ ఓకే చెప్పి ఉంటే... నువ్వే కావాలని, కొంచెం రికమెండ్ చేయమని రిక్వెస్ట్ చేనేవాడు బాషా. లక్కీగా బాషా ఈ ఆన్సర్ చదవడంలేదు కాబట్టి నీకో సలహా చెబుతా..! ‘సార్ జాగ్రత్త బాషా భాయ్ చదివేస్తాడేమో..!’ నీలాంబరీ...! నువ్వు అరటిపండు తిను! నన్ను డిస్టర్బ్ చేయకు! చెల్లెమ్మా... నువ్వు కూడా కొంచెం స్టైల్ కొట్టు! బాషా భాయ్ ఇంకో రికమెండేషన్ లెటర్ కోసం నాకు రాస్తాడు! ‘మీరు, మీ చెల్లెలు కలిసి మీ ప్రాక్టీస్ బాగానే డెవలప్ చేసుకుంటున్నారు...’ అని నవ్వింది నీలాంబరి! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ అన్నయ్యా! నాలుగేళ్ల క్రితం ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. రెండేళ్ల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. హ్యాపీగా ఉన్నాడు. నన్ను మాత్రం పిచ్చిదాన్ని చేశాడు. ఇప్పుడు.. మళ్లీ మెసేజ్‌లు చేస్తున్నాడు. ‘నేను హ్యాపీగా లేను, నిన్ను మిస్ చేసుకుని తప్పు చేశా’ అంటున్నాడు. తనని మరిచిపోలేక చాలా ఇబ్బంది పడుతున్నాను! ప్లీజ్ అన్నయ్యా.. మంచి సలహా ఇవ్వండి. – గీత ఆ మెసేజ్‌లు తీసుకెళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వు తల్లీ్ల! దుర్మార్గుడు అని తెలిసి ఇంకా తన గురించి ఆలోచించడం రాంగ్! డిస్టర్బ్ ఏంటి? మోసం చేసేవాడితో డిస్టర్బ్ అవడం ఏంటి? నేను ఒప్పుకోను! ‘నేను కూడా ఒప్పుకోను గీతా’ అంది నీలాంబరి!మనం ఇలా వీక్‌గా ఉంటేనే వాడు పెట్రేగిపోతాడు! ‘ఒక్కసారి తిరగబడి క్లాసు పీకితే దెబ్బకు దారికొస్తాడు’ ప్లీజ్ స్టాప్ బీయింగ్ వీక్!‘అస్సలు డౌన్ కావద్దు. బలంగా ఉండు, మంచి రోజులు ముందు ఉన్నాయి’ యు ఆర్ రైట్ నీలాంబరి! మెచ్చుకోలుగా అరటిపండు అందించింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ అన్నయ్యా! ఓ అబ్బాయి, నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఒకరికొకరం చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని మా అమ్మకి చెబితే.. మా నేపథ్యాలు వేరుకావడంతో ఒప్పుకోలేదు. వేరు అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసింది. విషయం తెలుసుకున్న తను.. నేను లేకపోతే తట్టుకోలేనంటున్నాడు. లైఫ్ లాంగ్ ఎలాగైనా నాతో మాట్లాడుతూ ఉండు చాలు... అంటున్నాడు. కనీసం ఫ్రెండ్‌లా అయినా ఉండాలనిపిస్తోంది. ఏం చెయ్యమంటారు? సలహా ఇవ్వండి అన్నయ్యా! – మౌని వద్దు! ‘ఎందుకు వద్దు సార్..?’ వద్దు అంతే..! ‘ఫోర్ ఇయర్స్ లవ్ సార్!’ అయినా వద్దు! ‘ఏంటి సార్ ఇతరుల జీవితాలను శాసించే రైట్ మీకు ఎవరిచ్చారు..?’ ఏమయినా అనుకో... వద్దనే వద్దు! ‘మీరు అరటిపండు అడగండి అప్పుడు చెబుతా!’ ఏం చెబుతావు...? ‘వద్దు... అని చెబుతా..!’ ఆకలితో జీవితం తొక్క అయినా ఓకే కానీ, మౌనీ! సారీ... ఆ అబ్బాయితో వద్దే వద్దు. ‘ఎందుకు సార్’ ఒక్కోసారి విధి ఆడిన ఆటకు తల వంచక తప్పదు. ‘ఇట్ మేక్స్ నో సెన్స్...’ కావాలంటే అమ్మను కన్విన్స్ చెయ్యి... కుదరకపోతే ఫర్గెట్ హిమ్. ‘యూ ఫర్గెట్ అరటిపండు’. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నా వయస్సు 24. వన్ ఇయర్ నుంచి నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. రోజూ తనని ఫాలో అవుతున్నాను. రీసెంట్గా తనకి ప్రపోజ్ కూడా చేశాను. అయితే ఆమె.. తనకు తన ఫ్యామిలీ చాలా ముఖ్యమని చెప్పింది. నేను తనను ఫాలో చేస్తున్న విషయం తెలుసని చాలా ఈజీగా నవ్వుతూ చెప్పింది! కానీ, నన్ను రిజెక్ట్ చేశానని చెప్పలేదు. లవ్ చేస్తున్నానని చెప్పలేదు. చివరిగా నవ్వుతూ బస్సులో వెళ్లిపోయింది. సలహా చెప్పండి. – కార్తీక్ తేజ భాగ్ మిల్కా భాగ్ సినిమా చూడలేదేంటి..? పరుగు తీయ్యి... బస్సు వెనక పరుగు తియ్యి... లేదంటే గుర్రాన్ని రెంటుకు తెచ్చుకో... దానికి బాగా అరటి పండ్లు పెట్టు... ఎస్... బాగా తినబెట్టి... ‘ఒక సవారీ నేర్పరిని అపాయింట్ చెయ్యి...’ అబ్బా... భలే ఫ్లోలో ఉన్నావు నీలూ...! ‘లవ్ డాక్టర్‌కి ప్రియమైన నర్సా మజాకా...’ సిక్స్ మంత్స్ హార్స్ రైడింగ్ ట్రైనింగ్ తీసుకో...! ‘అప్పుడు మగధీరలో రామ్ చరణ్లాగ టిక్ టాక్ టిక్ టాక్ అంటూ బస్సును ఫాలో కా...’ అమ్మాయి దుపట్టా వచ్చి నీ మీద పడుతుంది! ‘కళ్లు కనబడవు’ ప్రేమ గుడ్డిదని తెలిసిపోతుంది! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ నమస్కారం లవ్ డాక్టర్ రామ్ గారూ! అందరూ ఎం.బి.బి.ఎస్, ఎం.ఎస్, బి.డి.ఎస్ లాంటివి చదివి డాక్టర్లు అయితే మీరు మాత్రం లవ్ చేసి డాక్టర్ అయ్యారు. మీకు నా పాదాభివందనం. అరటి పండు ఏనాడో చేసిన పుణ్యం కాబోలు మీలాంటి ప్రేమికుడు దొరికారు. ఇక నా విషయానికి వస్తే... నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను ప్రేమిస్తోంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అయితే మా కుటుంబ నేపథ్యాలు వేరు. వాళ్లు తనను సాఫ్ట్వేర్ లేదా గవర్నమెంట్ జాబ్ చేసేవారికి ఇవ్వాలని చూస్తున్నారు. కానీ నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నా. ఇంకా పూర్తిగా సెటిల్ కాలేదు కూడా. తను బాగా భయపడుతోంది. మా పెళ్లి జరగకపోతే తను బతకదు. తను లేకపోతే నేను ఉండలేను. నేను సెటిల్ అయ్యాక వెళ్లి మాట్లాడతాం అంటున్నారు మా పేరెంట్స్. కానీ, తనకు సంబంధాలు చూస్తున్నారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. – వికాస్ అయ్యయ్యో... గుండెలు బద్దలు ఆయెనె! అయ్యయ్యో... కన్నీళ్లు కారిపోయెనె! అయ్యయ్యో... నేపథ్యాలు వేరు ఆయెనె! అయ్యయ్యో... పేరెంట్స్ కిరికిరి ఆయెనె! ఉన్నది కాస్తా ఊడింది! సర్వ మంగళం పాడింది! సాఫ్ట్వేర్ ముందు లెక్చరర్ లవ్ స్టోరీ తిరుక్షవరమైపోయింది! అయ్యయ్యో... మాస్టార్ ఇప్పుడేమి చెయ్యాలి..? అయ్యయ్యో... అమ్మాయికి ఇప్పుడేమి చెప్పాలి..? ‘సార్... బ్లాక్ అండ్ వైట్ సినిమా ‘కులగోత్రాలు’లో రమణారెడ్డి నెత్తి మీద టవల్ వేసుకుని పాడిన పాటకు కొత్త పల్లవి రాస్తున్నారు. యంగ్‌స్టర్స్ బెంబేలెత్తుతారు. ఎందుకు సార్ వాళ్లని అలా పాత ట్యూన్స్‌లో కొత్తగా వాయిస్తున్నారు?’ ఏమి చేయమంటావు నీలాంబరి! ఇద్దరి ప్రేమ ప్యూర్. బిస్లరీ వాటర్ కన్నా స్వచ్ఛమైన ప్యూర్. వీళ్ల ప్రేమను నెత్తిమీద జల్లుకుంటే ఎవరి ప్రేమైనా పవిత్రమయిపోతుందనిపిస్తుంది. అసలు వీళ్ల ప్రేమ ఒక పవిత్రపుస్తకం. చదువుకున్న వాడు లవ్ డాక్టర్ అయిపోతాడు! ‘సార్, వికాస్ ఏదో కొంచెం వ్యంగ్యంగా ‘లవ్ డాక్టర్’ని మెచ్చుకున్నట్లు తిట్టాడని మనసులో పెట్టుకుని పాపం పవిత్ర ప్రేమికుడికి ఆన్సర్ ఇవ్వకుండా తొక్క ఇస్తారా సార్..?’‘హీ విల్ బీ వెరీ హర్టెడ్ సార్.. సరిగ్గా చెప్పండి ఏమి చెయ్యాలో లేకపోతే...’లేకపోతే క్యా కర్తే..? ‘అయ్యయ్యో.. అరటిపండు అయిపోయెనె!అయ్యయ్యో.. తొక్క వడలి మిగిలెనె!అయ్యయ్యో...’ ని.. నీ.. ల.. లా.. అం.. అంబా.. అంబరీ.. నా కడుపు మీద కొట్టకు, చెబుతా! చెప్పక ఛస్తానా..?మై డియర్ వికాస్... చేతిలో ఉద్యోగం ఉంది! మైండ్‌లో నాలెడ్జ్ ఉంది! గుండెలో లవ్ ఉంది! ఇంట్లో అప్రూవల్ ఉంది! బస్ రెంట్‌కు జేబులో క్యాష్ ఉంది! బంధువులను స్నేహితులను పేరెంట్స్‌తో పాటు తీసుకునివెళ్లి అమ్మాయి పేరెంట్స్ ముందు నీ ప్రేమను అరటిపండ్లలో పెట్టి సమర్పించు! బి బ్రేవ్ మై డియర్ ఫ్రెండ్! ‘అబ్బా.. ఏమి చెప్పారు సర్! అరటిపండు వొలిచి పెట్టినట్టు! ఇంద టేక్ వన్ డజన్ ఐ.. సే..’ అని నీలాంబరి నవ్వింది. - ప్రియదర్శిని రామ్లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నా చెల్లెలు ఒక అబ్బాయిని ప్రేమించింది. అతడికి కూడా మా చెల్లెలంటే ఇష్టమని తెలిసి, అబ్బాయి మంచివాడు కావడంతో మా ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లి చేశాను. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. తరువాత అతనికి దుబాయ్‌లో జాబ్ వచ్చింది. మా చెల్లెలిని, పిల్లలని ఇక్కడే వదిలి తను దుబాయ్ వెళ్లాడు. దాంతో వాళ్ల ఫ్యామిలీ అంతా కలిసి ప్రతిరోజూ మా చెల్లెలిని టార్చర్ చేసేవారు. చెప్పుడు మాటలు విన్న అతడు... విడాకులు కూడా ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు మళ్లీ మా చెల్లెలు కావాలని, పిల్లలు కావాలని ఫోన్లు చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు? – షేక్ ‘సార్ ఇది దుబాయ్ ప్రేమా? దుబారా ప్రేమా? తెలుసుకుని ఆన్సర్ చెప్పండి! అమ్మాయికి అన్యాయం జరిగిపోతుందని తెగ ఫీల్ అయిపోయి.. రెచ్చిపోయి..∙ఎమోషన్‌తో నోటికొచ్చినట్లు పేలి నా రెస్పెక్ట్, అరటిపండు రెస్పెక్ట్కీ భంగం కలగకుండా కొంచెం సోచ్నా! కొంచెం ఆలోచించి, కొంచెం ఒళ్లు కంట్రోల్లో ఉంచి చెప్పండి సార్! లేకపోతే మళ్లీ మోసం హోజాతా హై! తో అబ్ క్యా కర్నా హై!’ చెల్లెలు కదా! మరి భయంగా ఉండదా? వాళ్లు మళ్లీ కష్టపెడితే ఏ అన్న అయినా భరించగలడా? అమ్మో.. చెల్లెలికి బాధ కలిగితే గుండె పట్టేస్తుంది! ‘మీరేదో చెప్పేస్తారని టెన్షన్ సార్! ఏం చేద్దాం మరి?’ఖర్జూరపండు తిందాం?‘సాఆఆర్?!!?’అమ్మాయి ఒప్పుకుంటే, అబ్బాయి మంచి వాడని కన్ఫర్మ్ చేసుకుని... ఒక అవకాశం ఇవ్వచ్చు.. అనిపిస్తుంది! హ్యాపీగా మనం కూడా దుబాయ్ వెళ్లి ఖర్జూర పండు తిందాం! అరటిపండుకు రెస్ట్ ఇద్దాం! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్,హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను ఏడేళ్లుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. తను కూడా నన్ను ఇష్టపడింది. నాకు అన్ని రకాలుగా దగ్గరైంది. అది తెలిసి మా పేరెంట్స్ నాకు బలవంతంగా వేరే అమ్మాయితో పెళ్లి చేసేశారు. 2 ఇయర్స్ క్రితమే పెళ్లి జరిగింది. బట్ నా లవర్ని మరిచిపోలేకపోతున్నా. తనతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నా. అయితే... ఈ మధ్య తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నా! ఇప్పుడు నేను ఎవరిని వదులుకోవాలి సర్! ప్రేమించిన అమ్మాయినా? పెళ్లి చేసుకున్న అమ్మాయినా? ప్లీజ్ సలహా ఇవ్వండి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? – శివ నీ మెడలో తాళి చూపించుకుంటూ తిరుగు!‘అదేంటి సార్ అబ్బాయి మెడలో తాళి ఏంటి?’బలవంతంగా పెళ్లి చేశారు కదా!‘అయితే... మగాడు తాళి కట్టించుకుంటాడా సార్?’తల వంచి పెళ్లి చేసి ఉంటారు కదా! ‘పెళ్లికొడుకు తల వంచుతాడా సార్?’ ఇక్కడ సర్కస్ చేస్తూ... అక్కడ పెళ్లి చేసుకుని... మళ్లీ లవర్ని వాడుకుంటూ... ఇప్పుడు ఎవరిని వదలాలో మనం చెప్పాలంటే...! ఇద్దరి లైఫ్‌తో గేమ్స్ ఆడుతున్నాడు!‘సార్, చాలా బాధగా ఉందట సార్!’ పిచ్చి వేషాలాపితే బాధ తగ్గుతుంది! బాదుడు కూడా తప్పుతుంది! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ అన్నయ్యా! నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. తనకి నా ప్రేమ చెప్పాను కానీ... ఆ అమ్మాయి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. తనకి నేనంటే ఇష్టమో! కోపమో! చెప్పడం లేదు. కానీ, నేను ఇంకో అమ్మాయితో మాట్లాడితే మాత్రం కోపంగా చూస్తుంది. దయచేసి తన మనసు ఎలా తెలుసుకోవాలో చెప్పండి అన్నా! – వీరబాబు ‘వెరీ బిగ్ ప్రాబ్లమ్.. ఎలా తెలియాలి సార్.. అమ్మాయికి లవ్ ఉందా? హేట్ ఉందా? లేదా... హేట్ లాంటి లవ్ ఉందా? లేక... లవ్‌లో హేట్ ఉందా..?’ చాలా సింపుల్! ‘ఎలా సార్ అంత సింపుల్! ఇది ప్రేమ వ్యవహారం.. నాట్ ఈజీ!’ తొక్కలో అరటిపండు ఉన్నంత సింపుల్! ‘టెల్ మీ... టెల్ మీ ఐ సే!’ అసహ్యంగా చూస్తే కోపంగా చూసిందనుకుంటున్నాడు! ‘పొండి సార్... ప్రేమ ఉంది కాబట్టే కోపంగా చూసింది.’ అరటిపండు అనుకుని తొక్క తిన్నట్లుగా ఉంది నీ పోలిక! ‘లవ్ ప్రాబ్లమ్‌తో మీకు రాస్తే మీరు పెట్టే గడ్డి కంటే... ఆ తొక్కే నయం సార్’ అని నవ్వింది నీలాంబరి!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటేప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హలో సార్! నేను పదేళ్లుగా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. తను కూడా నన్ను ఇష్టపడుతోంది. మా ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. అయితే మా సంస్కృతులు వేరు. అందుకే మా పెద్దలు పెళ్లికి ఒప్పుకోవడం లేదు. వెళ్లిపోయి చేసుకుందామంటే... తను రానంటోంది? ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. తను లేకపోతే బ్రతకలేను. దయచేసి సలహా చెప్పండి సార్! – అశోక్ ‘సార్ ఏదో ఒక రోజు మీకు ఈ ప్రేమికులు గూగ్లీ వేస్తారు. మీరు పిచ్చ పిచ్చగా క్లీన్ బౌల్డ్ అయిపోతారు. వికెట్లు విరిగిపోతాయి. మనకెందుకు సార్? ఎక్కడికైనా పొయ్యి అరటిపండ్ల వ్యాపారం చేసుకుందాం! కావాలంటే నా పొలంలో నాలుగు ఎకరాలు రాసిస్తాను! చలో జంప్ కొడదాం అని చెబితే విన్నారా సార్? వీడేశాడు చూడండి గూగ్లీ’ అవును నీలాంబరీ... పద పోదాం.‘ఎక్కడికి సార్ నేనేదో జోక్ చేస్తే మీరు సీరియస్‌గా ప్యాక్ అప్ అంటున్నారు? ’పదపోదాం‘ ఎ...కా...డి..కీ...? ’వనవాసం!‘వాట్..?’పదేళ్ల నుంచి ప్రేమిస్తున్నాడట. ఇంకో నాలుగు ఏళ్లు ఆగితే వనవాసం పూర్తి అవుతుంది. ఆ తరువాత వాడి పట్టాభిషేకానికి అరటి గెల తీసుకెళదాం. అప్పటి దాకా చలో అడవికి!‘నేను రాను సార్. మీ పేరు రామ్ అయితే మీరేమయినా శ్రీరాముడా...? వనవాసం గినవాసం అంటున్నారు?’వాడి గర్ల్ ఫ్రెండ్ కూడా నీలాగే అడవికి రానంటోంది, పట్టాభిషేకం వద్దంటోంది!‘అబ్ క్యా కర్నా? పాపం ప్రేమికుడు!’సింగిల్‌గా అడవికి పోతే పోలా? ‘ఏంటి సార్... హృదయం లేకుండా టాకింగ్?’అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడుకొని మేనేజ్ చెయ్యాలి, లేదంటే బ్రహ్మచర్యం తీసుకొని అడవికెళ్లి పోవాలి..!‘కుర్రాడు... ట్రూ లవర్ సార్, కన్విన్స్ చేసి పట్టాభిషేకం మేనేజ్ చేస్తాడు. నేను ఒక అరటిగెల గిఫ్ట్ ప్యాక్ చేసుకొస్తా!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటేప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ రామ్, నేను నాలుగేళ్ల నుండి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నేను వర్క్ చేసే కంపెనీలోనే మా బిటెక్ కాలేజ్ అమ్మాయి కూడా జాయిన్ అయింది. తనతో నాకు కాలేజీలో అంత పరిచయం లేదు. ఆఫీస్‌కి వచ్చాక బాగా క్లోజ్ అయ్యాం. రోజూ తనతో మినిమమ్ రెండు గంటల టైమ్ స్పెండ్ చేసేవాడిని. ఇంకా చాటింగ్ ఔటింగ్‌కి వెళ్లేవాళ్లం. తనతో జర్నీ స్టార్ట్ చేసిన మూడు నెలలకే నాకు ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ అది అట్రాక్షనా లేక లవ్వా.. అని నన్ను నేను ఎవాల్యుయేట్ చేసుకుందామని ఒక సంవత్సరం పాటు తనకి చెప్పలేదు. నార్మల్‌గా మూవ్ అయ్యా. చివరికి ఒకటిన్నర సంవత్సరం తర్వాత చెప్పాను. తను నా నుండి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. నువ్వు నా ఫ్రెండ్‌వి అనుకున్నా అన్నది. కానీ మనకి అలా లేదే! ఏం చేస్తాం. తనని మర్చిపోలేక 10 టైమ్స్ పైనే చెప్పి వుంటాను. (లిటరల్లీ అడుక్కొని ఉంటాను). తర్వాత రెండు సంవత్సరాల్లో తను ‘నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే’ అని నాతో మాట్లాడడం కూడా మానేసింది. తను నాకు పరిచయం అయ్యి నాలుగేళ్లకు పైనే అయింది. నేను చెప్పి మూడేళ్లు అవుతోంది. నా వల్ల కావట్లేదు తనని మర్చిపోవడం. తనని లవ్ చేశాక అమ్మాయిలంటే రెస్పెక్ట్ పెరిగింది. నా ఇంటెలిజెన్స్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. కానీ తను మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి. తనకి ఇంకా చెప్తూనే ఉన్నా... రెండు– మూడు నెలలకోసారి. నాది ట్రూ లవ్ అని తనకి ఎలా చెప్పాలి. తను ఒప్పుకునేలా ఎలా చెప్పాలి. – దీపు నా పేరు అరటిపండు. ఇది సెకండ్ టైమ్... నేను మీ ముందుకు రావడం. దీపూ! ఇలాంటి క్వశ్చన్స్ ఈ మీసాల రాక్షసుడిని అడగకు. అసలు లవ్ అంటే ఏ బి సి డి తెలియని దానవుడు.‘అడుక్కునేవాడు ఒక ఇంటిముందు కాకపోతే ఇంకో ఇంటిముందు అడుక్కుంటాడు. అంతే కానీ, ఒకే ఇంటిముందు అడుక్కుంటూ ఉంటే న్యూసెన్స్ కేసు పెడతారు. ఆగేబడో’... అని ఆన్సర్ ఇస్తాడు.నన్ను మింగినట్టు నీ ఇగోను, ఉనికిని మింగిపారేస్తాడు. నా మాట విని ఇంకో లవ్ డాక్టర్ని చూసుకో. ఆల్ ది బెస్ట్. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! టెన్త్ క్లాస్ చదువుతున్నా. ఏడాది క్రితం ఒక అమ్మాయి (మా జూనియర్) ట్రాన్స్ఫర్ అయ్యి మా స్కూల్‌కి వచ్చింది. అలా వచ్చిందో లేదో నేను లైనెయ్యడం స్టార్ట్ చేశా. అలా 3 మంత్స్ బాగానే గడిచాయి. తరువాత ఆ అమ్మాయి క్లాస్మేట్ ఒకడు వచ్చి ‘బ్రో... నేను ఆ అమ్మాయికి ట్రై చేస్తున్నా... నువ్వు డ్రాప్ అవ్వు’ అన్నాడు. నేను నో అన్నా. కానీ, తరువాత ఇంకో అమ్మాయి కనిపించింది. తను ముందు అమ్మాయి కన్నా సూపర్‌గా ఉంది. దాంతో నేను రెండో అమ్మాయికి ట్రై చేశా. ఈ సమయంలో మొదటి అమ్మాయిని మా జూనియర్ లైన్లో పెట్టాడు. అయితే ఎగ్జామ్స్‌లో మార్కులు చూసుకున్నాక అమ్మాయిలు వద్దు ఏం వద్దు... అని నిర్ణయించుకున్నా. కానీ ఫస్ట్ లవ్ చేసిన అమ్మాయి బాగా గుర్తొస్తోంది. మరిచిపోలేక పోతున్నా. దాంతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నా. దయచేసి సలహా ఇవ్వండి. – విజయ్ ‘సార్ ఈ లెటర్ మీరు చదవకండి’ ఓకే. ‘అవును సార్ మీకు అనవసరంగా కోపం వస్తుంది సార్’ ఓకే. ‘ఆ కోపంలో... పాపం... యంగ్‌స్టర్స్‌కి క్లాస్ పీకుతారు’ ఓకే. ‘నిజం సార్... ఇప్పటిదాకా వచ్చిన మెయిల్స్‌లో... వరస్ట్ క్యాండిడేట్ సార్’ ఓకే. ‘ఇద్దరిని లైన్లో పెట్టబోయి... పరీక్షల్లో ఒక్క లైన్ కూడా రాయలేదు సార్’ ఓకే. ‘ఏంటి సార్... ఓకే ఓకే... అంటారు! కొంచెం హెల్ప్ చేయొచ్చుగా..?’ఇలా లైన్లో పెట్టేవాళ్లు... లైన్‌గా... లవ్‌లో లైఫ్lలో ఫెయిల్ అవుతారని... నువ్వే చెప్పు. ‘ఓకే సార్!’ - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను సిక్స్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచీ నన్ను ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు. నైన్త్ క్లాస్‌లో నేను స్కూల్ మారాను. సో.. నన్ను మరిచిపోతాడేమో అనుకున్నాను. కానీ ఆ నెక్స్ ఇయరే మేము ఇద్దరం ఎఫ్‌బిలో ఫ్రెండ్స్ అయ్యాం. టూ ఇయర్స్ అయినా ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు. తనంటే నాకు చాలా ఇష్టం కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే... మావి వేరువేరు మతాలు. పైగా మా డాడీకి ఇలాంటివి ఇష్టం ఉండవు. బట్ నాకు తనతోనే జీవించాలని ఉంది. ఏం చెయ్యమంటారు? – నవ్య మానస సార్.. డజన్ అంటే ఎన్ని? పన్నెండు. ‘హాఫ్ డజన్ ఎంత?’ ఇప్పుడు అరటిపండు లెక్కలెందుకు చెప్పు నీలాంబరీ? m‘చెప్పండి సార్.. చెప్పండి ప్లీజ్!’ ఆరు. ‘ఆరు నూరయినా నేను ఆరో క్లాస్ అబ్బాయినే లవ్ చేస్తానంటోంది నవ్య మానస. ఇప్పుడు ఏమి చెయ్యాలి సార్?’ ఇంకో డజన్ ఇయర్స్ ఆగమని చెప్పాలి ‘సార్ అప్పుడు నవ్య చాలా ఓల్డ్ అయిపోతుందేమో..?’ ఓకే. అయితే, హాఫ్ డజన్ ఇయర్స్ ఆగమని చెప్పు. ‘ఏంటి సార్ అంతా అరటిపండు లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నారు’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. వాళ్ల పెద్దలకు మా విషయం చెప్పి, వాళ్లు ఒప్పుకున్న తరువాతే నేను తనకి ఓకే చెప్పాను. లైఫ్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అందుకే కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్నాడు. నేనూ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను. అన్ని విషయాల్లోనూ చాలా బాగుంటాడు. కానీ, నేను వాట్సప్ ఆన్లైన్లో కనిపిస్తే గొడవ పడతాడు. ‘అమ్మాయిలతోనే మాట్లాడుతున్నా’ అని చెప్పినా వినడు. ఇష్టమొచ్చినట్లు తిడతాడు. ఇలా తిడితే నాకు ఇష్టం ఉండదు అంటే.. ఇంకా ఎక్కువగా మాటలంటాడు. ‘నువ్వు నాకు చాలా ఇష్టం. నీ మాటలు, నీ ప్రేమ అంతా నాకే కావాలి. నువ్వు ఎవరితోనూ మాట్లాడొద్దు’ అంటాడు. అమ్మాయిలతో చాట్ చెయ్యాలన్నా సరే... తనకు చెప్పి, పర్మిషన్ తీసుకుని, అప్పుడు మాట్లాడాలి. ‘నేనంటే ఇష్టం ఉంటే నా రూల్స్ పాటించు, లేదంటే నీ ఇష్టమొచ్చినట్లు నువ్వు ఉండు’ అంటాడు. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. సలహా ఇవ్వండి. – నమిషా మూడు ముక్కల్లో చెబుతా బంగారం! అది ప్రేమ కాదు. పొసెసివ్‌నెస్. అదొక జబ్బు. తనకు సైకియాట్రిక్ హెల్ప్ అవసరం! నీకు తన అవసరం లేదు! రన్ అవే బిఫోర్ యు గెట్ హర్ట్! అమ్మకు చెప్పు. అవసరమయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు! నీకు దండం పెడతా... అస్సలు టెంప్ట్ కావద్దు! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను నాలుగు నెలలుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తను పరిచయమైన మూడు నెలలకే ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. తనకు నేనంటే చాలా ఇష్టం. తను గతంలో ఇంకో అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయిని ఇంకా ఇష్టపడుతోంది. మా విషయం ఆ అబ్బాయికి తెలిసి మా ఇద్దర్ని కూర్చోబెట్టి అడిగితే... తనే ఇష్టమని చెప్పి వాడితో వెళ్లిపోయింది. వెళ్లిన రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి నాకు నువ్వంటేనే ఇష్టం, ఆ అబ్బాయికి భయపడి అలా చెప్పాను’ అంది. నాకు తనంటే ఇంకా ఇష్టముంది కానీ, తన మాటలు నమ్మాలంటే భయంగా ఉంది. చెప్పడం మరచిపోయా! నేను ముస్లిం, తను హిందు. దయచేసి కొంచెం సీరియస్‌గా ఆన్సర్ చెప్పండి.. ప్లీజ్ సర్! – కాలేషా షేక్ నీలాంబరీ... నీలాంబరీ... నీలాంబరీ... ‘పక్కనే పెట్టుకుని అన్ని సార్లు పిలుస్తారేంటి సార్..?’ ఎక్కడ..? నువ్వు ఎక్కడ...? నీలాంబరీ.. వేర్...ఆర్..యూ..? ‘ఏంటి సార్! ఏమైంది..? మీ ముందే ఉన్నానుగా..?’ నీలాంబరీ... నీలాంబరీ... ‘సార్! కళ్లు పోయాయా ఏంటి..?’ అంతా మసక మసకగా ఉంది..! వాడెవడో నా మీద కక్ష తీర్చుకోవడానికి... కావాలనే అలాంటి విషపు ఉత్తరం రాశాడు. చదివి కళ్లుపోయాయి! ‘సార్... అన్నీ అబద్ధాలు సార్! మిమ్మల్ని ఆటపట్టించడానికి అలా చేసుంటాడు చిచ్చర పిడుగు! మీరు టెన్షన్ పడకండి. ఇలా వాలిపొండి. మీ కంటి మీద తొక్క పెట్టి కూలింగ్ ఫీలింగ్ ఇస్తా వెంటనే తగ్గిపోద్ది! కానీ.. ఫస్ట్ టైమ్ మీకు రివర్స్ పడింది. కొత్త ఫీలింగ్ సార్!’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ సర్.. నా పేరు వైశాలి. బి.టెక్ పూర్తి చేశాను. నేను నా సీనియర్‌ను లవ్ చేస్తున్నాను. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు తను మా సీనియర్. అప్పటినుంచి తనంటే చాలా ఇష్టం. తనను మూడు సంత్సరాలు చూడకపోయినా తనంటే ఇష్టం పోలేదు. నేను నాలుగు సంవత్సరాల నుంచి ఫేస్బుక్లో మేసేజ్‌లు పెడుతున్నాను. తను నా మేసేజ్‌లు చూసినా రెగ్యులర్‌గా రిఫ్లై పెట్టలేదు. అలాగని బ్లాక్ చేయలేదు. రీసెంట్గా ఓ సారి ‘ఐ లవ్ యూ టూ’ అని మెసేజ్ పెట్టాడు. తను మెసేజ్ పెట్టిన ఒక నెల వరకు నేను ఆ మెసేజ్‌ను చూడలేదు. తర్వాత నేను మెసేజ్ పెట్టినా రిఫ్లై లేదు. కానీ అతను మోసం చేసే రకం కాదు. చాలా అమాయకుడు. అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడడు. బాగా చదువుతాడు. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. నేను లవ్ చేస్తున్నాను కనుక అతని గురించి ఇలా చెప్పడంలేదు. అతను చాలా మంచివాడని నాకు కచ్చితంగా తెలుసు. రీసెంట్గా ‘నువ్వు వైశాలిని ప్రేమిస్తున్నావా? అని ఓ ఫ్రెండ్ తనని అడిగితే నేను వైశాలిని లవ్ చేయడం లేదు. అని చెప్పాడట’. తను లేకుండా నేను బతకలేను. మా కులాలు వేరు. బహుశా అదే తన ప్రాబ్లమ్ అయి ఉండవచ్చు. దయచేసి నా సమస్యకు త్వరగా పరిష్కారం చూపండి. ప్లీజ్ సర్. మీరు నీలాంబరితో కాకుండా నాతో మాట్లాడండి. ప్లీజ్ నాకు త్వరగా సమాధానం చెప్పండి. ప్లీజ్ సర్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్... – వైశాలి రోడ్డు మీద నా మానాన నేను వెళుతుంటే డాష్ ఇచ్చాడు. గిర్రున తిరిగి ఢాం అని కింద పడ్డా.. ‘ఏయ్.. చూసుకోనక్కర్లేదా’ అని లేచా..? వాడు తిరిగాడు.. మళ్లీ తిరిగాడు.. మళ్లీ మళ్లీ తిరిగాడు. వాడు అలా తిరిగి తిరిగి కనబడుతుంటే నాకు కళ్లు తిరిగాయి. ఢాం అని మళ్లీ పడ్డా. మళ్లీ లేచా. ‘ఏయ్.. వాట్ ఆర్ యూ డూయింగ్? ఎందుకలా రౌండ్ రౌండ్‌గా తిరుగుతావు? ఏదైనా జబ్బా?’ కళ్లజోడు తీసి పెట్టుకున్నాడు. మళ్లీ కళ్లజోడు తీసి పెట్టుకున్నాడు. మళ్లీ మళ్లీ కళ్లజోడు తీసి పెట్టుకున్నాడు. నా కళ్లు తిరిగాయి. ఢాం అని మళ్లీ పడ్డా. మళ్లీ లేచా. ‘ఎందుకు గుద్దావు... ఎందుకు తిరిగావు... ఎందుకు తిప్పుతున్నావు..?’ ‘అది నా స్టైల్.. నా దారి రహదారి. ఎవరు అడ్డం వచ్చి పూడ్చినా ఢాం...అంతే’. ‘వార్నీ నరసింహా.. నువ్వా! ఎక్కడ తగలడ్డావు రా ఇన్నాళ్లు? నీలాంబరి కోసం రెగ్యులర్‌గా ఆఫీసుకి వచ్చేవాడివి!’ ‘ఓహ్ లవ్ డాక్టర్... సార్వాడూ.. మీరా! హౌ ఆర్ యు?’‘రోడ్డు మీద పడేసి హౌ ఆర్ యూ ఏంటిరా నీ అరవ పిండాకూడు కాకులు తినా’. ‘సారీ మేష్టారూ. నీలాంబరికి జలక్ ఇవ్వడానికి కొంచెందా డిస్టెన్స్ మెయింటెన్స్ సేసి పూడుస్తున్నా. ఆమ్మాయిలకు డెప్త్ తెలియాలంటే కొంచెందా గ్యాప్ ఇవ్వాలి సారూ.. అప్పుడుదా ప్రేమ ఉడికీ ఉడికీ...’ ‘సాంబార్ అవుతుంది. నీ అరవ కుంపటి గాడిదలు తన్న!’ ‘ఎన్నంగో మేష్టారూ... శాల బాధలో ఉన్నావు’. ‘నా బాధ ఎందుకులే నీ అరవ ప్రేమ లాజిక్ ఏడువ్. అయినా నీలాంబరికి ఇంత గ్యాప్ ఇస్తే ఇంకెవరైనా ట్రై చేసుకుంటారేమో. ముందే బ్యూటీ. ఆమె వెనకాల ఎంతమంది క్యూ కట్టారో తెలుసుగా...’ ‘తెలుసు తలైవా... పందులు గుంపులుగా వస్తాయి, సింగం సింగిల్గాదా వస్తది. నీలాంబరి ఎప్పోదుమ్ నాదే’. ‘నీ అరవ పౌరుషం గద్దలు తన్నుకుపోనూ.. ముందు లుంగీ దించు భరింలేకపోతున్నాను’. అమ్మా.. వైశాలీ.. మగాళ్లతో ఇదే ప్రాబ్లమ్. ఛీ పో అంటే వెంట పడతారు. హాయ్ అంటే పోజు కొడతారు. బి కేర్ ఫుల్.నీలాంబరితో మాట్లాడకుండా సమాధానం ఇద్దామంటే మేడమ్ లవర్ నా దుంప తీశాడు... ఇంకోసారి నీలాంబరి వద్దు అనొద్దు ఫ్లీజ్. -ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ హాయ్ సర్! నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను హిందు. నేను ముస్లిం. తను నాతో చాలా క్లోజ్‌గా ఉంటుంది. తనని పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. కానీ చాలాసార్లు నాతో గొడవలు పడింది. అయినా సర్దుకుపోతూ వచ్చా. తనంటే నాకు చాలా ఇష్టం. తను నన్ను లవ్ చేస్తుందో లేదో అర్థం కావడం లేదు. అడిగితే లేదంటుంది. మీ ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నా. మీ సమాధానాలు చాలా బాగుంటాయి సర్. – షేక్ ‘సారీ’ దేనికి నీలాంబరి..? ‘అడగొద్దు.’ జోక్ చేస్తున్నావా..? ‘జోక్ చెయ్యొద్దు.’ ఏడ్చినట్లుంది.! ‘నా ముందు ఏడ్చినా లాభం లేదు’ నేను ఏడవటం లేదు. ‘అంటే నా పరిస్థితి చూసి నవ్వుతున్నారా...?’ సూపర్... నీ పరిస్థితి చెబితే కదా... నవ్వేదైనా ఏడ్చేదైనా..? ‘మీ నర్స్ పరిస్థితి అర్థం చేసుకోలేనంత కఠిన హృదయులయి పోయారన్నమాట.’ నా వల్ల కాదు ఈ డ్రామా భరించలేక పోతున్నా... బై! ‘నర్స్‌కి కష్టం వస్తే తప్పించుకుంటారు. అంతే. మెన్ ఆర్ , ఆల్వేస్ ఎస్కేపింగ్.. మీరెందుకు నేనే వెళ్తా..!’ చూశావా షేక్ భాయ్...? నా పరిస్థితే ఇలా ఉంది. ఇక నీకు నేను ఏమి చెప్పగలను..? అమ్మాయిని అర్థం చేసుకో..! కిటికీ దగ్గరకు వెళ్లి నీలాంబరిని పిలిచి.. ‘గెల వద్దు.. పండు వద్దు.. తొక్కా వద్దు.. నువ్వు లేకపోతే ముక్క రాయలేను.. ప్లీజ్ కమ్ బ్యాక్..!’ అన్నా. నీలాంబరి అబౌట్ టర్న్ కొట్టి చెంగు చెంగున వచ్చి అరటిపండు ఇచ్చింది..! - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్ హాయ్ సర్, నా వయస్సు ఇరవై ఒకటి. నాకు మా ఇంటి పక్క అమ్మాయంటే చాలా ఇష్టం. మేము ఇద్దరం లవ్ చేసుకున్నాం. మూడు నెలల తరువాత బ్రేకప్ చెప్పింది. ఎందుకు అని అడిగితే... ‘నాకు మా పేరెంట్స్‌ని మోసం చెయ్యడం ఇష్టం లేదు’ అంది. ‘కావాలంటే సిస్టర్‌గా కంటిన్యూ అవుతాను’ అంది. నేను తట్టుకోలేకపోతున్నా, తను అలా ఉంటే నాకు చనిపోవాలనిపిస్తోంది సర్. – భాస్కర్ రెడ్డి ‘అమ్మా తల్లీ! ఒక అరటిపండు ధర్మం చెయ్యి తల్లీ!’ ‘అమ్మా చెల్లీ... అర అరటి పండు ధర్మం చెయ్యి తల్లో..!’ ‘ఏంటి సార్ ఇలా రోడ్ మీద పడ్డారు’ ‘హూ ఆర్ యూ..?’ ‘నేను సార్ నీలాంబరిని’ ‘హూ యామ్ ఐ..?’ ‘మహేష్ బాబు పాటలు వద్దు సర్... మీరు లవ్ డాక్టర్ రామ్ఃసాక్షి.కామ్ సార్’ ‘అమ్మా తల్లీ... ఒక అరటిపండు ధర్మం చెయ్యి తల్లీ!’ ‘అమ్మా చెల్లీ... అర అరటి పండు ధర్మం చెయ్యి తల్లో..!’ ‘ఏంటి సార్ ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు...? ప్రిస్టేజ్ ఏం కాను..?’ ‘నీలాంబరీ... నీ నర్సింగ్, నా డాక్టరేట్ అన్నీ మరిచిపో. నా వల్ల కాదు. లవ్ చేసి... ఆ తరువాత... ‘సిస్టర్ అనుకో’ అందట ఆ మహాతల్లి. వాడు టెన్షన్‌తో చస్తున్నాడు. నేను ఆన్సర్ ఇవ్వలేక చస్తున్నాను’.‘సార్, అలా అని బంగారం లాంటి ప్రాక్టీస్‌ని తొక్కలో వేసి బిచ్చగాడిలా తిరుగుతారా?’ ‘ప్రాక్టీస్ లేకపోతే ఇంక అరటిపళ్లు ఎలా దొరుకుతాయి..?’ ‘నేను ఉన్నాను కదా సార్..!’ ‘నర్స్‌ని సిస్టర్ అంటారు చూడు... ఆ సిస్టర్ కాదంట... ఒరిజినల్ సిస్టర్ అంటోందా అమ్మాయి. అమ్మా తల్లీ... ఒక అరటి’.... ‘ఛీ ఆపండి సార్. మీరు మరీను, మైండ్ డైవర్ట్ చేసుకోవాలి సార్. టెన్షన్ తగ్గిపోతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది.’ ‘అబ్బ, ఆ విషయం ఆ భాస్కర్ రెడ్డికి చెప్పుకో, నాకు అరటిపండు ఇచ్చుకో’. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్ హలో సర్! నా వయసు 21. నేను ఒక కంపెనీలో వర్క్చేస్తున్నాను. ఒక అమ్మాయిని చూశాను. అప్పటినుంచి నాకు తనే గుర్తుకు వస్తోంది. ఇది ప్రేమో లేక అట్రాక్షనో తెలియడంలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా నా వైపు చూడడం, నవ్వడం చేస్తోంది. మొన్న పండగకి మా ఊరు వచ్చినప్పుడు డేర్ చేసి ఆ అమ్మాయికి చెప్పేశాను. ఇంకా ఫోన్ నంబర్ కూడా ఇచ్చేశాను. తీసుకుంది. కాని ఇంకా రిప్లయ్ రాలేదు. ఏం చేయాలి సర్? – టి. ఆది దొరికిపోయావు బిడ్డా! ‘ఆది’ లైఫ్‌లో ‘అంతం’ స్టార్ట్ అయ్యింది. హ్యాపీనెస్ అంతం షురూ..! నిమిషానికి ఒకసారి ఫోన్ చూసుకుంటున్నావు. ఫోన్ ట్రింగ్మనగానే ఉలిక్కిపడుతున్నావు. ట్రింగ్ ట్రింగ్ అనే లోపలే ఎత్తేస్తున్నావు. నిద్రపొయ్యే ముందు ఫోన్ చూసుకుంటున్నావు. అర్ధరాత్రి లేచి చూసుకుంటున్నావు. కలలో ఫోన్ చూసుకుంటున్నావు. టిఫిన్, లంచ్, స్నాక్స్, డిన్నర్ చేసేటప్పుడూ చూసుకుంటున్నావు. ఇలా చూసుకుంటూ చూసుకుంటూ రోడ్డు మీద నడవకు ప్లీజ్. పడతావ్! ప్రేమలో గుడ్డివాళ్లైపోతారు. నువ్వేంటి బ్రో.. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకునేలా ఉన్నావ్. ‘సార్.. గుడ్డోడు ఎలాగో అవుతాడు. ఫోన్ అంతంత సేపు చూస్తే కాడా..?’ అబ్బ నువ్వు ఎంత స్మార్ట్ నీలాంబరీ... వాడి స్మార్ట్ ఫోన్ కంటే స్మార్ట్.. ‘పొండి సర్ మొహమాట పెడుతున్నారు..’ నా మాట విని ఆదీ... కొత్త సిమ్ పెట్టుకో! పాత కనెక్షన్ మరిచిపో! ‘టూ మచ్ సర్! ప్రేమికుడిని అంతగా వేధిస్తారా? ఏదైనా పాజిటివ్‌గా చెప్పొచ్చుగా..!’ లేకపోతే ఏంటి నీలాంబరీ..! నిన్న నంబర్ ఇచ్చాడట.. ఇవ్వాళ కన్ఫర్మేషన్ కావాలంట... నిన్న అరటిపిలక పెట్టి ఇవ్వాళ.. అరటిపండు కావాలన్నట్లు ఉంది కదా సర్.. అయితే ఒక మంచి ప్రేమికుడిని అంత పేషెంట్‌గా ఉండమన్న మీరు కొంచెం పేషెంట్‌గా ఉండండి. టుడే నో అరటిపండు అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్ హాయ్ సర్! మూడేళ్ల క్రితం ట్రైన్ జర్నీలో ఒక అబ్బాయితో పరిచయం అయ్యింది. మేము చాలా త్వరగా ఫ్రెండ్స్ అయిపోయాం. ఒన్ ఇయర్ తరువాత ప్రపోజ్ చేశాడు. తన మీద ఉన్న నమ్మకంతో ఓకే చెప్పాను. కానీ మా కులాలు వేరు. సెటిల్ అయిన తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ ఒక రోజు మా విషయం వాళ్ల ఇంట్లో తెలిసిపోయి పెద్ద గొడవ అయింది. ఆ అమ్మాయితో మాట్లాడొద్దని వాళ్ల ఇంట్లో మాట తీసుకున్న కారణంగా 6 నెలల పాటూ నాతో మాట్లాడం మానేశాడు. తరువాత మళ్ళీ దగ్గరయ్యాడు. ఇప్పుడు అంతా హ్యాపీగానే ఉన్నాం. కానీ ఇంతకుముందులానే మళ్లీ చేస్తాడేమో అనే భయం వెంటాడుతోంది. తను మాత్రం మరోసారి ఇలా చెయ్యనని నాకు మాట ఇచ్చాడు. ఇంకా విషయం మా ఇంట్లో తెలీదు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నా స్టోరీలో నేను చేసిన తప్పేమైనా ఉందా? చెప్పండి సర్. – రాణి బంగారు తల్లీ! ఎవరూ చెడ్డ వాళ్ళు కారు. పరిస్థితులు మనుషులను మారుస్తాయి. మళ్ళీ బలం పుంజుకున్నప్పుడు తప్పును అర్థం చేసుకుంటారు. తల్లితండ్రుల ప్రెజర్‌తో ముందు వద్దన్నాడు మళ్ళీ నువ్వు ఎంత బాధపడుతున్నావో అని దగ్గర అయ్యాడు... రెండు ఇన్సిడెంట్స్ ప్రెజర్ వల్ల జరిగాయి. ప్రేమ వల్ల మారాడా... ప్రెజర్ వల్ల మారాడా... నువ్వు అర్థం చేసుకుంటే బెటర్. ఇంత దూరం వచ్చాక అమ్మానాన్నల సలహా కూడా అవసరం. ఇంకా డిలే చేయొద్దు. మమ్మీ డాడీలతో వెంటనే మాట్లాడు. ఆల్ ది బెస్ట్. ఏమంటావు నీలాంబరీ? ‘ప్రేమికులు ఎంత డిప్రెషన్లో ఉండి రాస్తారో అర్థం చేసుకోమని ప్రవీణ్ అనే ఒక జెంటిల్మెన్ మీకు క్లాస్ పీకాడు సర్’. అందుకే ఇవ్వాళ తిక్క ఆన్సర్ ఇవ్వకుండా స్ట్రెయిట్ ఆన్సర్ ఇచ్చినట్టు ఉన్నారు.’ ‘అడగొద్దు ప్లీజ్ అన్నా అడుగుతారు. సరదాగా రాస్తే ప్రవీణ్‌కి కోపమ్. సీరియస్‌గా రాస్తే రీడర్‌కు ‘బోర్’డమ్. అసలు సరదాగా చెబితేనే సీరియస్ ఎక్కుతుంది. ‘తోలు తీస్తేనే అరటిపండు తినగలిగినట్లు’ అని నవ్వింది నీలాంబరి. - ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com