నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
సర్! ఇంచుమించు పదేళ్లు ఇంటికి దూరంగా హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. చదువు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్న కొద్దిరోజులకే కార్తీక్ అనే వ్యక్తి నా లైఫ్‌లోకి వచ్చాడు. అతడి కేరింగ్‌కి పడిపోయాను. సరదాగా... నేను నిన్ను ప్రేమించడం లేదు అంటే ఏడ్చేవాడు. నన్ను ప్రాణంగా చూసుకునేవాడు. ఇద్దరం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామనుకున్నాం. దాంతో నేను పీజీ జాయిన్ అయ్యాను. అక్కడ మనీష్ అనే అబ్బాయి నన్ను ప్రేమించాడు. నేను ఆల్‌రెడీ కార్తీక్‌ని లవ్ చేస్తున్నానని చెప్పాను. బట్ తను వినలేదు. తన లవ్‌ని నేను అంగీకరించడం లేదని చెయ్యి కట్ చేసుకున్నాడు.
దాంతో వాళ్ల మదర్ కూడా మనీష్‌ని పెళ్లి చేసుకోమని నన్ను బ్రతిమలాడారు. దాంతో నాకు, కార్తీక్‌కి భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కాలేజ్ కూడా మానేశాను. తరువాత కార్తీక్‌తో చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ కొన్ని రోజులు తరువాత కార్తీక్‌లో సడన్‌గా మార్పు వచ్చింది. ఫోన్లు, మెసేజ్‌లు తగ్గించేశాడు. నేను కాల్ చేస్తే నాట్‌రీచ్‌బుల్. మెసేజ్‌లకి రిప్లై ఇచ్చేవాడు కాదు. ఎదురు పడితే ముఖం తిప్పుకుని వెళ్లిపోయేవాడు. చచ్చిపోవాలనిపించింది. నేను ఏం తప్పు చేశానో అర్థం కాక చాలా ఏడ్చా. 78 రోజుల తరువాత ‘నన్ను మర్చిపోయావా?’ అని మెసేజ్ పెట్టాడు. సరదాగా అన్న మాటలకే ఏడ్చే అతను ఇంతలా ఎందుకు మారిపోయాడో, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలీడం లేదు. ప్లీజ్ సర్... సలహా ఇవ్వండి. – అఖిల
పడే దాకా తోకాడిస్తూ తిరుగుతారు! పడ్డాకా చెయ్యి కూడా అందించరు!! నువ్వు వెంపర్లాడుతున్నావని తెలుసు! అందుకే ఆడుకుంటున్నాడు!! ‘ఏమి చేయాలి సార్..?’ ఆడుకోవాలి!! ‘ఏమి ఆట సార్..?’ అరటి తొక్క మీద కాలు వేసి, తొసేసే ఆట!!‘హౌ..?’మనల్ని పడేసినోడ్ని టైమే పడేస్తుంది!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com