నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్, నేను మీ ఫ్యాన్‌ని. ఫోర్ ఇయర్స్ క్రితం నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను. గవర్నమెంట్ జాబ్ వస్తే పెళ్లి చేసుకుంటా అంది. దాంతో రాని చదువుని కూడా సీరియస్‌గా తీసుకుని చదివాను. బ్యాంక్ జాబ్‌కు 1 స్టెప్ దూరంలో ఉన్నాను. ఈ క్రమంలో టు ఇయర్స్ నుంచి ఆ అమ్మాయితో మాట్లాడటం లేదు. ఈ గ్యాప్‌లో ఆ అమ్మాయికి చాలా మంది ప్రపోజ్ చేస్తే వాళ్లకు కూడా అలానే చెప్పిందని తెలిసింది. ఎందుకు ఇలా చేశావని అడిగితే నాతో గొడవ పెట్టుకుంది. మాట్లాడటం లేదు. మిగిలిన వాళ్లందరితో బాగా మాట్లాడుతోంది. ఎంజాయ్ చేస్తోంది. తనంటే నాకు అసహ్యం వేస్తోంది. బట్ మరిచిపోలేకపోతున్నా. ప్లీజ్ సర్, పరిష్కారం చెప్పండి. - సాగర్
నీలాంబరి మెల్లగా తలకాయ పైకి లేపింది. ఛైర్‌ని నా ముందుకు లాక్కొని కూర్చున్నప్పుడే రెడ్ సిగ్నల్ వెలగాల్సింది! ఏమోలే! కొంచెం పర్సనల్‌గా ఏదో మాట్లాడాలని అనుకుంటుందేమో అని నేనేమీ అనలేదు!! కుర్చీ ఇంకొంచెం దగ్గరకు లాగింది. వామ్మో... సమ్‌థింగ్ ఈజ్ నాట్ రైట్ అనుకున్నా.. తల ఇంకా స్లోమోషన్‌లో పైకి లేస్తోంది.ఇప్పటికైన అర్థం చేసుకుని నేను పైకి లేచి నిలబడాల్సింది. కానీ, ఎందుకో విషయం తెలుసుకునే దాకా లేవకూడదని అలాగే కూర్చున్నా! ముందు మేడం కనుబొమలు పైకి లేపింది. నా గుండె దడ పెరిగింది. ఎడమ ఐ బ్రో డ్రాప్ చేసి కుడి కనుబొమ పైకి లేపింది. కొండ ఎక్కినప్పుడు బస్సు ఆయాసపడినట్లుగా నా గుండె బ్రీత్‌లెస్ అయిపోతోంది!
నన్ను వీక్ పాయింట్‌లో పట్టేసుకుందని తెలిసిన నీలాంబరి... రెండు కనుబొమలు అప్ అండ్ డౌన్ ఆడించడం మొదలు పెట్టింది. అంతే లోయలో పడిపోతున్న బస్సులా గుండె కేక పెట్టింది! మంచంపై లేచి కూర్చున్నాను ఏంటీ పీడకల అని....!? ఆలోచిస్తే విషయం అర్థం అయ్యింది! నెక్ట్స్ మార్నింగ్ నీలాంబరి ముందు నిలబడి... నిన్ను అడగకుండా ఆన్సర్లు ఇచ్చేస్తున్నానని యూ ఆర్ వెరీ యాంగ్రీ కదా! అందుకే... డ్రీమ్స్‌లో కూడా వచ్చి కళ్ళెర్ర చేస్తున్నావు! ఇవ్వాళ్ళ సాగర్‌కి నువ్వే ఆన్సర్ ఇచ్చేసెయ్యి! రేపు డ్రీమ్‌లోకి రాకు ప్లీజ్ అన్నా!‘ఏముంది మనోడంటే అమ్మాయికి అసలు ఇంట్రెస్ట్ లేదు. ముఖం మీద చెబితే ఫీల్ అయిపోతాడని గవర్నమెంట్ జాబ్ వస్తే చేసుకుంటా అంది. మనోడికి అంత సీన్ ఉండదనుకుని! బట్ సాగర్‌కు జాబ్ వచ్చే లాగ ఉంది, అనుకునే... వేరే సిగ్నల్స్ ఇస్తోంది. మాటలే సరిగ్గా అర్థం కావు సాగర్, సిగ్నల్స్ అర్థం చేసుకోవడం ఎంతో టఫ్ కదూ.. అంటూ నీలాంబరికి నేనే అరటిపండు అందించా!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com